Hyderabad-district

Hyderabad-district విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Hyderabad-district

బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అరెస్ట్
news,telangana

బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అరెస్ట్

బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ను హైదరాబాద్ గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. క్రిశాంక్‌తో పాటు ఎంఆర్ మీడియా తెలంగాణ, మరికొందరిని కూడా ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.

6 అక్టో, 20262 min read
SIRపై అనుమానాలు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలి: మహేశ్ కుమార్‌ గౌడ్
news,politics,telangana

SIRపై అనుమానాలు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలి: మహేశ్ కుమార్‌ గౌడ్

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అర్హులైన ఓటర్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇండియా కూటమి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించారు.

3 అక్టో, 20261 min read
హైదరాబాద్‌ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో యువ వైద్యురాలి అనుమానాస్పద మృతి.. స్నేహితుడు పరారీ
crime,news,telangana

హైదరాబాద్‌ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో యువ వైద్యురాలి అనుమానాస్పద మృతి.. స్నేహితుడు పరారీ

హైదరాబాద్‌లో 27 ఏళ్ల యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. హఫీజ్‌పేట్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

2 అక్టో, 20261 min read
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం
news,telangana

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేగింది. కడపకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన క్యాబిన్‌ సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికుడిని విమానం నుంచి దించి పోలీసులకు అప్పగించారు.

2 అక్టో, 20261 min read
సచివాలయంలో గద్వాల విజయలక్ష్మిని అడ్డుకున్న అధికారులు.. కేబినెట్ భేటీకి నో ఎంట్రీ!
news,politics,telangana

సచివాలయంలో గద్వాల విజయలక్ష్మిని అడ్డుకున్న అధికారులు.. కేబినెట్ భేటీకి నో ఎంట్రీ!

తెలంగాణ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మిని కేబినెట్ సమావేశానికి అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమావేశానికి తనకు ఆహ్వానం లేదని అధికారులు చెప్పడంతో ఆమె సీఎంవోను సంప్రదించినప్పటికీ అక్కడా స్పష్టత లభించలేదని సమాచారం.

1 అక్టో, 20261 min read
రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..నా హోటళ్లకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన రేవంత్‌కు థ్యాంక్స్
news,politics,telangana

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..నా హోటళ్లకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన రేవంత్‌కు థ్యాంక్స్

సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. తన హోటల్‌ వ్యాపారం, కుటుంబ ఆస్తులపై సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తన హోటళ్లకు ఉచిత ప్రచారం కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి కుటుంబాల ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సవాల్‌ విసిరారు.

1 అక్టో, 20262 min read
హైదరాబాద్‌లో బిర్యానీ, హలీమ్ మాత్రమే కాదు.. 200 ఏళ్ల నాటి ఈ స్వీట్ గురించి తెలుసా?
news,telangana

హైదరాబాద్‌లో బిర్యానీ, హలీమ్ మాత్రమే కాదు.. 200 ఏళ్ల నాటి ఈ స్వీట్ గురించి తెలుసా?

హైదరాబాద్ అనగానే బిర్యానీ, హలీమ్ గుర్తొస్తాయి. అయితే నగరానికి శతాబ్దాల నాటి మరో అరుదైన మిఠాయి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతోంది. అదే ‘బాదం కి జాలీ’. నిజాంల కాలం నాటి ఈ సంప్రదాయ స్వీట్‌కు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. బాదం, పంచదార, యాలకులతో కళాత్మకంగా తయారయ్యే ఈ మిఠాయి గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా చేసిన పోస్టుతో మరోసారి చర్చ మొదలైంది.

1 అక్టో, 20262 min read
ఆరు గ్యారెంటీలను పక్కనపెట్టి దేవుళ్లపై చర్చ ఎందుకు?: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
news,politics,telangana

ఆరు గ్యారెంటీలను పక్కనపెట్టి దేవుళ్లపై చర్చ ఎందుకు?: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాముడు, శివుడి విషయంలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టకుండా మతాలు, దేవుళ్ల అంశాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు.

1 అక్టో, 20261 min read
వరంగల్ ఎయిర్‌పోర్టు పేరుపై వివాదం.. రేవంత్‌పై కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు
news,telangana,politics

వరంగల్ ఎయిర్‌పోర్టు పేరుపై వివాదం.. రేవంత్‌పై కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు

వరంగల్ మామునూరు విమానాశ్రయానికి పేరు పెట్టే అంశం తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీసింది. విమానాశ్రయానికి రేచర్ల రుద్రారెడ్డి పేరు పెట్టాలన్న ప్రతిపాదన వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయంటూ ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆరోపించారు. అయితే, విమానాశ్రయానికి తుది పేరు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

30 సెప్టెం, 20261 min read
ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్...  ఇద్దరు రెడ్డి నేతలకే టికెట్లా? అంటూ కవిత ఫైర్
news,politics,telangana

ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్... ఇద్దరు రెడ్డి నేతలకే టికెట్లా? అంటూ కవిత ఫైర్

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే రెండు స్థానాలకూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలనే ఎంపిక చేయడంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు.

30 సెప్టెం, 20262 min read
ఆయిల్ కంపెనీ జాబ్ అని చెప్పి రష్యాకు.. చివరికి ఆర్మీలోకి! నలుగురు తెలంగాణ యువకుల కోసం కుటుంబాల కన్నీటి వేడుకోలు
news,telangana

ఆయిల్ కంపెనీ జాబ్ అని చెప్పి రష్యాకు.. చివరికి ఆర్మీలోకి! నలుగురు తెలంగాణ యువకుల కోసం కుటుంబాల కన్నీటి వేడుకోలు

ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు తెలంగాణ యువకులు అనూహ్యంగా రష్యా సైన్యంలో చేరి యుద్ధభూమిలో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు నమ్మించి విదేశాలకు తీసుకెళ్లి, ఆ తర్వాత ఆర్మీలో చేర్చారని కుటుంబాలు పేర్కొన్నాయి. యువకులను సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

29 సెప్టెం, 20262 min read
హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం..రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరణ
news,telangana

హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం..రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరణ

మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం (సెప్టెంబరు 26) ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించి, దేశానికి, తెలంగాణకు మన్మోహన్ సింగ్ అందించిన సేవలను స్మరించుకున్నారు.

25 సెప్టెం, 20262 min read
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపయ్య.. ఘనంగా నిమజ్జనం
news,spiritual,telangana

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపయ్య.. ఘనంగా నిమజ్జనం

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపయ్య నిమజ్జనం ఘనంగా పూర్తైంది. ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్-4 వద్ద పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహాన్ని ప్రత్యేక పూజల అనంతరం గంగమ్మ ఒడికి చేర్చారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

25 సెప్టెం, 20261 min read
ఖైరతాబాద్ మహాగణపతి ఎదుట దానం నాగేందర్ డ్యాన్స్‌.. ఆకట్టుకున్న దృశ్యం
news,spiritual,telangana

ఖైరతాబాద్ మహాగణపతి ఎదుట దానం నాగేందర్ డ్యాన్స్‌.. ఆకట్టుకున్న దృశ్యం

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. టస్కర్ ముందు దానం నాగేందర్ కొబ్బరికాయ కొట్టి యాత్రను ప్రారంభించారు. భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య గణనాథుడు నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు.

25 సెప్టెం, 20261 min read
రూ.450 నుంచి రూ.35 లక్షలకు.. బాలాపూర్ లడ్డూ వేలం ప్రస్థానం ఇదే!
news,telangana,spiritual

రూ.450 నుంచి రూ.35 లక్షలకు.. బాలాపూర్ లడ్డూ వేలం ప్రస్థానం ఇదే!

బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన లడ్డూ వేలానికి రంగం సిద్ధమైంది. చివరి పూజా కార్యక్రమాలు ప్రారంభమైన అనంతరం గణనాథుడిని గ్రామ ప్రదక్షిణకు తీసుకెళ్లనున్నారు. అనంతరం ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం జరగనుంది. 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన ఈ వేలం.. 2025 నాటికి రూ.35 లక్షలకు చేరింది. దీంతో ఈసారి లడ్డూ ఎంత ధర పలుకుతుందనే ఆసక్తి నెలకొంది.

25 సెప్టెం, 20262 min read
Social Media Image
crime,news,telangana

డ్రగ్స్ సమాచారం పోలీసులకు ఇస్తున్నాడనే అనుమానం.. స్నేహితుడినే కత్తులతో పొడిచి హత్య!

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో స్నేహితులే వసీం అనే యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై గతంలోనూ ఎన్డీపీఎస్ కేసులు ఉన్నట్లు సమాచారం.

24 సెప్టెం, 20261 min read
తెలంగాణలో కొత్త విధానం.. ఇకపై ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులు,ఇలా బుక్ చేసుకోండి!
news,telangana

తెలంగాణలో కొత్త విధానం.. ఇకపై ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులు,ఇలా బుక్ చేసుకోండి!

తెలంగాణలో ప్రభుత్వ పౌర సేవలను మరింత సులభంగా అందించేందుకు మీసేవ డోర్ డెలివరీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇక కొన్ని ముఖ్యమైన ధృవీకరణ పత్రాలు, ఆధార్, రిజిస్ట్రేషన్, పోలీస్ శాఖకు చెందిన సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చు. ఇందుకోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి లేదా మీసేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని ప్రజల స్పందన ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

23 సెప్టెం, 20262 min read
యూట్యూబర్ నందన దంపతులకు మరో షాక్.. రూ.95 లక్షల వరకు వసూలు చేశారంటూ ఫిర్యాదు
crime,international,news,telangana,andhra-pradesh

యూట్యూబర్ నందన దంపతులకు మరో షాక్.. రూ.95 లక్షల వరకు వసూలు చేశారంటూ ఫిర్యాదు

యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులు, వీసా గడువు ముగియనున్న వారి నుంచి భారీగా నగదు వసూలు చేశారంటూ యూట్యూబర్ నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్‌పై పలువురు బాధితులు తెలంగాణ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.

22 సెప్టెం, 20262 min read
దానం నాగేందర్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. బుధవారం విచారణ
news,politics,telangana

దానం నాగేందర్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. బుధవారం విచారణ

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించిన అనర్హత కేసు మరో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌ను బుధవారం విచారణ జాబితాలో చేర్చేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంగీకరించారు.

21 సెప్టెం, 20262 min read
AI Image
crime,news,telangana

పెళ్లైన 18 రోజులకే విషాదం.. కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకిన నవ వధువు

పెళ్లైన 18 రోజులకే ఓ బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది. ఘట్‌కేసర్‌ పరిధిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న పల్లవి.. కళాశాల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

19 సెప్టెం, 20262 min read
గిరిజన యువకుడి ఆత్మహత్య.. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలి మనవడి వేధింపులే కారణం!
crime,news,politics,telangana

గిరిజన యువకుడి ఆత్మహత్య.. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలి మనవడి వేధింపులే కారణం!

బైక్ విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి ఆత్మహత్యకు తీవ్ర కలకలం రేపుతోంది. రాజేష్ అనే గిరిజన యువకుడిని యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేష్ యాదవ్ వేధించాడని, మూడు రోజులుగా ఒత్తిడి కారణంగా అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

19 సెప్టెం, 20262 min read
హైదరాబాద్‌లో అంతర్జాతీయ మొబైల్ చోరీ ముఠా గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్
news,crime,telangana

హైదరాబాద్‌లో అంతర్జాతీయ మొబైల్ చోరీ ముఠా గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్

హైదరాబాద్‌లో చోరీకి గురైన మొబైల్‌ ఫోన్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో అక్రమంగా డిస్పోజల్ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే ఆపరేషన్‌లో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు.

19 సెప్టెం, 20261 min read
Hyderabad: ఐటీ కంపెనీ ముందు భారీ కొండచిలువ..ఆ తర్వాత ఏం జరిగిందంటే?
news,telangana

Hyderabad: ఐటీ కంపెనీ ముందు భారీ కొండచిలువ..ఆ తర్వాత ఏం జరిగిందంటే?

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు పరిసరాల్లో భారీ కొండచిలువ కనిపించడంతో ఐటీ ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఓ ఐటీ ఉద్యోగి దాన్ని చాకచక్యంగా పట్టుకుని చేతికి చుట్టేసుకున్నాడు. అనంతరం మిత్రుడితో కలిసి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

18 సెప్టెం, 20261 min read
ఫార్ములా ఈ-రేస్ కేసు..అక్టోబర్ 30కి విచారణ వాయిదా
crime,news,telangana

ఫార్ములా ఈ-రేస్ కేసు..అక్టోబర్ 30కి విచారణ వాయిదా

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది. విదేశీ కంపెనీకి సమన్లు అందకపోవడంతో విచారణ వాయిదా పడిందని కేటీఆర్ తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు కేసులకు భయపడేది లేదని, న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

18 సెప్టెం, 20261 min read
హైదరాబాద్‌ NIA కోర్టు సంచలన తీర్పు..ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి నెట్టిన నిందితులకు జీవిత ఖైదు
india,national,news,telangana,international

హైదరాబాద్‌ NIA కోర్టు సంచలన తీర్పు..ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి నెట్టిన నిందితులకు జీవిత ఖైదు

హైదరాబాద్‌లోని ప్రత్యేక NIA కోర్టు 2019 నాటి అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను ఉద్యోగాల పేరుతో భారత్‌కు అక్రమంగా తరలించి, వ్యభిచారంలోకి నెట్టిన కేసులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు సహా తొమ్మిది మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది.

18 సెప్టెం, 20262 min read
మా నియోజకవర్గ ఇళ్లు ఇతరులకు ఎలా ఇస్తారు?..ప్రభుత్వంపై దానం నాగేందర్ ఎదురుదాడి
news,telangana,politics

మా నియోజకవర్గ ఇళ్లు ఇతరులకు ఎలా ఇస్తారు?..ప్రభుత్వంపై దానం నాగేందర్ ఎదురుదాడి

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత లోపించిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. తన నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లను ఇతర నియోజకవర్గాల వారికి ఇచ్చారని శాసనసభలో జీరో అవర్‌లో ప్రస్తావించారు. ఈ విషయాన్ని మంత్రికి చెబితే ‘కూల్ కూల్’ అంటున్నారని, ప్రభుత్వ పెద్దలు కూల్‌గా ఉండటం వల్లే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని విమర్శించారు.

18 సెప్టెం, 20262 min read
AI Image
news,politics,telangana

రజాకార్ల దాష్టీకాన్ని తొక్కిపెట్టారు.. గత పాలకులపై కిషన్ రెడ్డి విమర్శలు

సెప్టెంబర్ 17 సందర్భంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

17 సెప్టెం, 20261 min read
నా బ్యాంక్ ఖాతాలు అన్‌ఫ్రీజ్ చేయండి.. కోర్టులో ఐబొమ్మ రవి పిటిషన్
crime,news,telangana

ఐ బొమ్మ రవికి ఆర్థిక కష్టాలు.. ఫ్రీజ్ చేసిన రూ.3 కోట్లు అన్‌ఫ్రీజ్ చేయాలి.. నాంపల్లి కోర్టులో పిటిషన్

ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన మాజీ నిర్వాహకుడు ఇమ్మంది రవి మరోసారి వార్తల్లో నిలిచారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు ఫ్రీజ్ చేసిన తన బ్యాంక్ ఖాతాల్లోని సుమారు రూ.3 కోట్లను అన్‌ఫ్రీజ్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రవి కోర్టుకు తెలిపారు.

16 సెప్టెం, 20261 min read
అల్లు అర్జున్ మామపై పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?
cinema,crime,news,telangana

అల్లు అర్జున్ మామపై పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరికొందరిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, గేటు తాళాలు పగులగొట్టి, నిర్మాణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.

15 సెప్టెం, 20261 min read
Balapur Ganesh Mandapam 2026
news,spiritual,telangana

పూరీ జగన్నాథ ఆలయాన్ని తలపించేలా బాలాపూర్ గణేశ్ మండపం.. ఖర్చెంతో తెలుసా?

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ బడా గణేశ్ తర్వాత ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గణనాథుడు బాలాపూర్ గణేశుడు. ప్రతి ఏటా వినూత్నంగా ఏర్పాటు చేసే మండపంతో పాటు భారీ డిమాండ్ ఉండే లడ్డూ వేలం ఈ గణేశ్ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈసారి పూరీ జగన్నాథ ఆలయాన్ని తలపించేలా బాలాపూర్ గణేశ్ మండపాన్ని తీర్చిదిద్దారు.

15 సెప్టెం, 20262 min read