Bhadradri-kothagudem

Bhadradri-kothagudem విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Bhadradri-kothagudem

ప్రేమకు దూరమైందని కక్ష..బైక్ క్లచ్ వైర్‌తో గొంతు బిగించి చంపిన ప్రియుడు
crime,news,telangana

ప్రేమకు దూరమైందని కక్ష..బైక్ క్లచ్ వైర్‌తో గొంతు బిగించి చంపిన ప్రియుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో సంచలనం సృష్టించిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రవెల్లి హరిణి (18) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారంలో దూరం పెట్టడంతో కక్ష పెంచుకున్న పవన్‌కుమార్‌ ముందస్తు పథకంతో హరిణిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

1 అక్టో, 20261 min read
మహిళా ఉద్యోగి నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్
crime,news,telangana

మహిళా ఉద్యోగి నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ హాస్టల్ వార్డెన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. చర్ల మండలం సత్యనారాయణపురంలోని ఎస్టీ బాలుర ఇన్‌చార్జ్ హాస్టల్ వార్డెన్, రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భూక్యా వాలుసింహ.. మహిళా ఉద్యోగి గైర్హాజరును అనధికారిక గైర్హాజరుగా నమోదు చేయకుండా ఉండేందుకు రూ.14 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.

18 సెప్టెం, 20261 min read
సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్
news,telangana

సీతమ్మసాగర్ పనులు వేగవంతం చేయాలి.. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బహుళార్థసాధక బ్యారేజీ, జలవిద్యుత్ ప్రాజెక్టు అయిన సీతమ్మసాగర్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

3 ఆగ, 20261 min read
Union Minister G.Kishan Reddy (File Photo)
district,news,telangana

సింగరేణికి పీకేఓసీ-2 డిప్‌సైడ్ బొగ్గు బ్లాక్.. కార్మికులకు అభినందనలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేఓసీ-2 (ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్) డిప్‌సైడ్ కోల్ బ్లాక్ సింగరేణి సంస్థకు దక్కడం సంతోషకరమైన పరిణామమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.

3 ఆగ, 20262 min read
భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి.. మూడో, రెండో ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ
news,telangana

భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి.. మూడో, రెండో ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ

భద్రాచలం వద్ద గోదావరి నది క్రమంగా శాంతిస్తోంది. ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గడంతో వరద ఉధృతి తగ్గుతోంది. ఆదివారం ఉదయం నీటిమట్టం 47.8కి చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకున్నారు.

2 ఆగ, 20261 min read
రూ.52 కోట్ల పెట్టుబడి మోసం ఛేదించిన పోలీసులు.. కేరళలో ప్రధాన నిందితుడి అరెస్టు
news,telangana

రూ.52 కోట్ల పెట్టుబడి మోసం ఛేదించిన పోలీసులు.. కేరళలో ప్రధాన నిందితుడి అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్‌కుమార్‌ను కేరళలో అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

1 ఆగ, 20262 min read
గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
news,telangana

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 53 అడుగులు దాటిన నీటిమట్టం శనివారం ఉదయానికి 55.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా, రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

1 ఆగ, 20262 min read
రేగా కాంతారావు (ఫైల్ ఫొటో)
district,news,telangana

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో లైంగికంగా వేధించాడని మీడియా రంగానికి చెందిన 22 ఏళ్ల యువతి ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 69, 351(2) కింద కేసులు నమోదు చేశారు.

31 జులై, 20261 min read
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి
district,news,telangana

గోదావరికి వరద ఉధృతి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తూ తీర ప్రాంత ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

31 జులై, 20262 min read
(ఫైల్ ఫొటో)
andhra-pradesh,district,news,telangana

గోదావరిలో వరద ఉధృతి.. పాపికొండల విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం ఉద్ధృతంగా మారింది. నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా పాపికొండల విహారయాత్రను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.

30 జులై, 20261 min read
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉంది.. భద్రతే తొలి ప్రాధాన్యమన్న మంత్రి వివేక్ వెంకటస్వామి
news,telangana

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉంది.. భద్రతే తొలి ప్రాధాన్యమన్న మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలోని పరిశ్రమల్లో అత్యున్నత భద్రతా ప్రమాణాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శక్తి ( కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్ ) మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తెలిపారు.

29 జులై, 20262 min read
తాడిచర్ల బ్లాక్-2, ఆర్‌కేపీ మైన్స్‌ పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలి.. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
news,telangana

తాడిచర్ల బ్లాక్-2, ఆర్‌కేపీ మైన్స్‌ పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలి.. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ

సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచర్ల బ్లాక్-2తో పాటు ఆర్‌కేపీ మైన్స్‌కు పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని తెలంగాణ శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ&ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు.

28 జులై, 20261 min read