
రామగుండంలో ఉగ్ర లింకుల అనుమానాలు.. ఎన్‌ఐఏ అదుపులో ఇంజినీరింగ్ విద్యార్థి
పెద్దపల్లి జిల్లా రామగుండంలో NIA నిర్వహించిన తనిఖీలు కలకలం రేపాయి. అయోధ్య నగర్‌లో చేపట్టిన సోదాల్లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడిని ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.











