
భూమి మార్పిడి కోసం లంచం.. తహసీల్దార్‌ను పట్టుకున్న ఏసీబీ
ములుగు జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. గోవిందరావుపేట మండల తహసీల్దార్ సృజన్‌కుమార్ భూమిని కుటుంబసభ్యుల పేర్లపై మార్చేందుకు రూ.14 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.



