All Live updates & Timeline
ఢిల్లీలో రాహుల్, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వచన్ సదన్’కు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బారికేడ్ ఎక్కి జాతీయ జెండాతో నిరసన తెలిపారు. అనంతరం రాహుల్, ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణాలో పెరగనున్న కరెంటు చార్జులు
తెలంగాణ విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడనుంది. నవంబర్‌లో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.

బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అరెస్ట్
బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ను హైదరాబాద్ గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. క్రిశాంక్‌తో పాటు ఎంఆర్ మీడియా తెలంగాణ, మరికొందరిని కూడా ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.