
ఈసీపై విపక్షాల సమరం.. రాహుల్, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వచన్ సదన్’కు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బారికేడ్ ఎక్కి జాతీయ జెండాతో నిరసన తెలిపారు. అనంతరం రాహుల్, ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.





























