హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, ఆమె భర్త వసు భగ్నానీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయన్న వార్తలపై రకుల్ స్పందించింది. తాను ఎవరికీ బినామీ కాదని, తనకు కోట్ల విలువైన ఆస్తులను ఎవరూ బహుమతిగా ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేయొద్దని కోరింది.
ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టిన చేతులు ఇప్పుడు కెమెరా ముందు నటించేందుకు సిద్ధమవుతున్నాయి. హింసను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన తొమ్మిది మంది మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం లభించింది. రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో వారి ఆత్మవిశ్వాసంతో కూడిన ర్యాంప్ వాక్ వైరల్ కావడంతో ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు చిన్నారుల మధుర గానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకృతి అందాల నడుమ ‘ఏక్ తూ హీ యార్ మేరా’ పాటను ఆలపిస్తూ, చిలిపి హావభావాలతో అలరించిన సింగా, న్గమ్‌జాన్, లిల్లీ వీడియోకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘బిందాస్’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నోరా ఫతేహి తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకోగా రజనీకాంత్ కూడా కాసేపు కనిపించి సందడి చేశారు.
సినీ తారలు తమకున్న ప్రజాదరణను సామాజిక బాధ్యతతో వినియోగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. ముఖ్యంగా ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరించే ముందు పలుమార్లు ఆలోచించాలని అన్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్‌తో ‘రాకా’ షూటింగ్ పూర్తి చేసిన దీపికా, ఇప్పుడు హాలీవుడ్ సూపర్‌హిట్ ‘ది ఇంటెర్న్’ బాలీవుడ్ రీమేక్‌ను నిర్మించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
పాన్ మసాలా ఉత్పత్తిని ప్రకటన ద్వారా ప్రోత్సహించిన బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై FDA కమిషనర్ తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు కావడం వల్ల చట్టానికి అతీతులు కాదని, నిషేధిత ఉత్పత్తిని ప్రోత్సహించిన వారిపైనా బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మపై బాలీవుడ్ నటి, మాజీ మోడల్ సోఫియా హయత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2012లో రోహిత్‌తో డేటింగ్ చేసినట్లు చెప్పిన సోఫియా.. తాజాగా ఓ టాక్ షోలో తమ రిలేషన్‌షిప్ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేసింది. గతంలోనూ రోహిత్‌తో తన సంబంధంపై ఆమె సోషల్ మీడియాలో పోస్టులు చేసింది.
దివంగత బాలీవుడ్ నటి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇందులో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తితోపాటు పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతరుల పేర్లు ప్రస్తావించింది.
ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత ఆధారంగా తెరకెక్కిన హిందీ భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా హిందీలో రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో సెప్టెంబర్ 18న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు భారీ విజయాన్ని అందుకుంటోంది. విడుదలైన ఐదో వారాంతంలో రూ.45.60 కోట్ల వసూళ్లు సాధించి, ఐదో వీకెండ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ‘ధురంధర్’, ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ రికార్డులను సైతం అధిగమించింది.
నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులకు అండగా నిలిచేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఖాఠ్మాండూకు వెళ్లారు. తీవ్రంగా ప్రభావితమైన త్రిశూలి బజార్‌ను సందర్శించి స్థానికులను కలుసుకుని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
అతిలోక సుందరి శ్రీదేవి వ్యక్తిగత జీవితం కూడా ఆమె సినీ కెరీర్‌లాగే ఎన్నో సంచలనాలకు కారణమైంది. నిర్మాత బోనీ కపూర్‌కు ఒకప్పుడు రాఖీ కట్టిన శ్రీదేవి.. అదే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం, పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడం అప్పట్లో బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ప్రేమకథ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు ఇప్పటికీ అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.
సినిమాల్లో రాజకుటుంబాలకు చెందిన పాత్రల్లో ఎంతో హుందాగా కనిపించే ఈ స్టార్ హీరోయిన్.. నిజ జీవితంలోనూ అదే రాజ వంశానికి చెందిన వారసురాలు కావడం చాలా మందికి తెలియదు. అందం, అభినయంతో టాలీవుడ్, బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె కుటుంబ నేపథ్యం ఎంతో గొప్పది. హైదరాబాద్ హైదరి కుటుంబంతో పాటు తెలంగాణలోని వనపర్తి సంస్థానంతో ఉన్న అనుబంధం ఆమెను ఇతర హీరోయిన్లతో పోలిస్తే మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది.
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, ఈ పాత్ర కోసం ముందుగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఆడిషన్ ఇచ్చిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే చివరికి ఆ అవకాశం సాయి పల్లవిని వరించింది. ఈ ఆసక్తికర విషయంపై సినీ వర్గాల్లో మరోసారి చర్చ జరుగుతోంది.
రామాయణ సినిమాలో సీత పాత్రలో సాయిపల్లవి కనిపించనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు ఆమె ఎంపికను ప్రశంసిస్తుండగా, మరికొందరు గతంలో సీత పాత్ర పోషించిన నటీమణులతో పోల్చుతూ విమర్శలు చేస్తున్నారు.
సినిమాలు, సీరియల్స్‌లో కలిసి నటిస్తూ ప్రేమలో పడిన జంటలు చాలామందే ఉన్నారు. కానీ ఓ సీరియల్‌లో తల్లి, కొడుకులుగా నటించిన ఇద్దరు నటీనటులు నిజ జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం మాత్రం చాలా అరుదు. వయసు, మతం వంటి అడ్డంకులను దాటుకుని ఒక్కటైన కిశ్వర్ మర్చెంట్, సుయాష్ రాయ్ ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ తన విలువైన ఆస్తిని హఠాత్తుగా విక్రయించడంతో సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు కారణమేంటన్నది ఇప్పటికీ అధికారికంగా బయటకు రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు ఆమె సినిమా వస్తుందంటే స్టార్ హీరో సినిమా విడుదలైనంత హడావుడి కనిపించేది. స్టార్ హీరోలే ఆమె కాల్షీట్ల కోసం ఎదురుచూసేవారంటే అప్పట్లో ఆమెకున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. దక్షిణాది ప్రేక్షకుల గుండెల్లో మాత్రం ఆమె స్థానం ఎప్పటికీ చెరిగిపోలేదు. నిజానికి ఆమె అసలు పేరు సౌందర్య కాదనే విషయం చాలా మందికి తెలియదు. అసలు ఆమె పేరు ఏంటి? ఆమెకు 'సౌందర్య' అనే పేరు ఎలా వచ్చింది? విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న రామాయణ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. దాదాపు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక డీల్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రిలీజ్‌కు ఇంకా మూడు నెలలకు పైగా ఉన్నా ఈ సినిమాకు ఏకంగా రూ.75 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. అసలు ఆ డీల్ ఏంటంటే? సినిమా విడుదలకు ముందే ఇంత భారీ మొత్తం రావడానికి కారణమేంటి?
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై CJP అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ చేసిన వ్యాఖ్యలకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఘాటుగా స్పందించారు. తన సినీ, ప్రజా జీవితాన్ని ప్రస్తావిస్తూ సౌరవ్ దాస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ మాటల యుద్ధం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఒక సినిమా థియేటర్లలో వారం, నెల లేదా ఏడాది ఆడటం పెద్ద విషయమే. కానీ 31 ఏళ్లుగా ఒకే థియేటర్‌లో ప్రతిరోజూ ప్రదర్శితమవుతూ ఇప్పటికీ ప్రేక్షకులను రప్పిస్తున్న సినిమా గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక దశలో ఈ షోను నిలిపివేయాలని యాజమాన్యం నిర్ణయించినా.. అభిమానుల నిరసనతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అసలు మూడు దశాబ్దాలుగా చెక్కుచెదరని ఈ రికార్డు ఏ సినిమాది? దాని వెనుక ఉన్న కథ ఏంటి? అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టమని చాలామంది భావిస్తారు. కానీ 76 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాకేష్ రోషన్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా తన ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్ల గురించి ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సరైన సమయంలో తీసుకున్న ఒక నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుందని అంటారు. బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్ర విషయంలో అది అక్షరాలా నిజమైంది. దశాబ్దాల క్రితం రూ.4.25 లక్షలకు కొనుగోలు చేసిన బంగ్లా.. నేడు ఏకంగా రూ.450 కోట్ల విలువైన ఆస్తిగా మారింది.