రాయలసీమ అభివృద్ధిలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ.. “నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి” అంటూ సీఎం చంద్రబాబును కోరారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 28వసారి సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం అంటే ప్రజల మధ్య ఉండే వ్యవస్థ అని, పేదలకు సేవ చేయడమే తన బాధ్యత అని పేర్కొన్నారు. ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.76 వేల కోట్లు అందించినట్లు వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారణాసిలో పర్యటిస్తున్నారు. కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు.. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉల్లి, కంది పప్పు, పామాయిల్ వంటి సరుకులను త్వరలో ఈ వ్యవస్థల ద్వారా సరఫరా చేయాలని సూచించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ప్రధానికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ప్రజాసేవ, నాయకత్వం, దేశ అభివృద్ధికి చేస్తున్న కృషిని ఇద్దరూ తమ సందేశాల్లో ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉండవల్లిలోని నివాసంలో భార్య భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌తో కలిసి చంద్రబాబు విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి.. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లాలని గణనాథుడిని ప్రార్థించినట్లు సీఎం తెలిపారు.
తిరుమల శ్రీవారి భక్తుల రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు రిలయన్స్ సంస్థ టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులను అందిస్తోంది. వీటిలో తొలి విడతగా 15 బస్సులు తిరుమలకు చేరుకున్నాయి. మరో 10 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బస్సులతో పాటు 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా రిలయన్స్ సమకూర్చనుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2017లో చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు వచ్చిన స్పందనను మరోసారి అందుకోవాలనే ధీమాను వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన, తమ పాలన మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు.
విజయవాడలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన చిన్ననాటి రోజుల్లో ఉపాధ్యాయుడి చేతిలో దెబ్బలు తిన్న విషయాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. మారుతున్న కాలానికి అనుగుణంగా టీచర్లు కూడా తమ బోధనా విధానాలను మార్చుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం పొందుతున్న మహిళలకు త్వరలో ఏసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ అవకాశం కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏసీ బస్సుల సంఖ్యను పెంచి, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ బ్రాండేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే నేతలు ఆ పార్టీ చరిత్ర, త్యాగాల గురించి తెలుసుకోవాలని సూచించారు.
మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను జాతికి అంకితం చేశారు. నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతించిన సీఎం.. అనంతరం నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేశారు. తొలి దశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించనున్నట్లు తెలిపారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘన మధ్య నెలకొన్న వివాదంపై స్పందించారు. మేఘనను తమ కుటుంబంలో కూతురిలా చూసుకున్నామని చెప్పారు. కుటుంబ వివాదాన్ని రాజకీయంగా వాడుకుంటూ తన కుటుంబంపై ఫేక్ వీడియోలు, ఆడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఏపీ డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలు, లీకేజీపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడంపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. డీఎస్సీ అంశంపై శాసన మండలిలో చర్చకు ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన అవకతవకలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి స్కామ్ చూడలేదని వ్యాఖ్యానించారు.
బండ్ల గణేష్ కుమార్తె జనని, సూర్యతేజ వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. సంక్షేమంతో ప్రజలకు భరోసా కల్పిస్తూ, అభివృద్ధితో రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నామని ఆయన తెలిపారు.
అమరావతి నిర్మాణ పనుల్లో భారీగా అవినీతి జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 21.77 కి.మీ. సీడ్ యాక్సెస్ రోడ్డుకు రూ.1,519 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు.
అమరావతి రాజధాని అభివృద్ధిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ ఈ-3 రెండో దశను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రూ.1,519 కోట్లతో నిర్మించిన ఈ 21.77 కిలోమీటర్ల కారిడార్ రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనుంది. ఈ సందర్భంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను సీఎం కొనియాడుతూ వారికి పాదాభివందనం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఏపీలో రూ.2,08,406 కోట్ల విలువైన 25 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 21,627 మందికి ఉద్యోగాలు రానున్నాయి. గ్రీన్ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, డేటా సెంటర్లు, రోబోటిక్స్ రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఏపీ ఆర్థిక వృద్ధిపై సీఎం చంద్రబాబు చెబుతున్న లెక్కలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, సామాన్యుల పరిస్థితిని ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేల హాజరుపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సభ్యుడి సీటు వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి, సభ్యుడు తన స్థానంలో కూర్చుంటేనే హాజరుగా పరిగణిస్తామని ప్రకటించారు. సభకు రాకుండా కేవలం రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లిపోవడాన్ని అరికట్టడమే ఈ నిర్ణయ లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ కుటుంబం నడుపుతున్నది ప్రజా పాలన కాదని విమర్శించారు. సీఎం కుటుంబ సభ్యులకు సంబంధించిన పలు సంస్థలు, కాంట్రాక్టులపైనా ఆరోపణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, గంజాయి బ్యాచ్‌లను పూర్తిగా అణిచివేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, శాసన మండలిలో వైసీపీ సభ్యులు లేవనెత్తే ప్రతి అంశానికి స్పష్టమైన సమాధానం ఇచ్చేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.
హెరిటేజ్ డెయిరీ వ్యాపారాన్ని కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తరించుకునేందుకు లాభాల్లో ఉన్న విజయ డెయిరీని నాశనం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చూస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. చదరపు అడుగుకు రూ.20 వేల చొప్పున భవనాలు నిర్మించడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు.
అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు నెలలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.