కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలను ఏర్పాటు చేసిన లేదా ఇతర పార్టీల్లో చేరిన నేతలు తిరిగి హస్తం గూటికి రావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శరద్ పవార్, మమతా బెనర్జీలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య, మంత్రి కొండా సురేఖకు ఢిల్లీ నుంచి పలువురు ఫోన్లు చేసినా ఆమె వెళ్లలేదని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు సేవ చేయాలన్న మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కొండా దంపతుల లక్ష్యమని పేర్కొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2017లో చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు వచ్చిన స్పందనను మరోసారి అందుకోవాలనే ధీమాను వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన, తమ పాలన మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ ‘పితృస్వామ్యాన్ని అంతం చేయాలి’ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు డొల్ల మాటలేనని బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక కీలక రాజకీయ నిర్ణయం తీసుకుంటారా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి క్రమశిక్షణ అంశం హాట్ టాపిక్‌గా మారింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించింది.
మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి పై వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కొండా సురేఖ తన పార్టీలో చేరాలని, బీసీ మహిళగా ఆమెను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్‌లో బీసీ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కీలక మలుపు తిరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే బర్తరఫ్‌కు సిఫార్సు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో కొండా సురేఖ తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై మరోసారి చర్చ మొదలైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. సమయం వచ్చినప్పుడు తనకు వచ్చే పదవిని ఎవరూ అడ్డుకోలేరని, సీఎం అయ్యే అవకాశం వస్తే బ్రహ్మదేవుడు కూడా తనను ఆపలేడని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు పాత కాంగ్రెస్ కార్యకర్తలను పక్కనబెట్టి పార్టీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
మంత్రి కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రులు, నేతలపై ఆరోపణలు ఉన్నాయని, వారికి ఒక న్యాయం.. తనకు మరో న్యాయం ఎందుకని సురేఖ ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ బ్రాండేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే నేతలు ఆ పార్టీ చరిత్ర, త్యాగాల గురించి తెలుసుకోవాలని సూచించారు.
వైసీపీలో అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి వైఎస్ జగన్ ఒక్కరే నేత అని, మిగతా వారంతా కార్యకర్తలేనని స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, పార్టీలోని అంతర్గత పరిణామాలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ గీత దాటిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం, కేబినెట్ పనితీరులో మార్పులు అవసరమని సూచించారు. రాష్ట్రంలో పెన్షన్‌ను రూ.4,000కు పెంచడంతో పాటు రైతు భరోసాను కొనసాగించాలని కోరారు.
తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఎపిసోడ్‌కు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పరకాల నియోజకవర్గం వ్యవహారంపై విభేదాలు, మంత్రి పదవిపై వేటు ప్రచారం కొనసాగుతున్న వేళ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. రక్షాబంధన్ సందర్భంగా మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఇరువురి మధ్య రాజకీయ విభేదాలకు తెరపడిందా? అనే చర్చ మొదలైంది.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే తాను మాట్లాడుతున్నానని, పార్టీని బలహీనపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మాది అసలైన కాంగ్రెస్ రక్తమని, తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడిన ఉద్యమకారులను కించపరచొద్దని సూచించారు.
అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని అన్నారు. రాజకీయ కారణాలతోనే తన పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించిన సీఎం.. గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి, తనకు ఎందుకు నిరాకరించారో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై ఎవరైనా ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వానికి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కాంగ్రెస్ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొండా కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.
కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుస్మితకు లేదని విమర్శించారు. తల్లిదండ్రుల పేరును దిగజార్చేలా మాట్లాడకుండా రాజకీయాల్లో ఓపిక, బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా తనను ఏమీ చేయలేరంటూ రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ నోటి దురుసు, అహంకారం, అవినీతి పాలనే ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి భస్మాసుర హస్తంగా మారుతుందని వ్యాఖ్యానించారు.
నెల్లూరులో వైసీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన దైవ నామాలు, భక్తి గీతాలను అపహాస్యం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు.