దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ నేరాల కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో దాదాపు రెండు వారాల పాటు నిర్వహించిన ప్రత్యేక సోదాల్లో మ్యూల్ ఖాతాలు, కేవైసీ పత్రాలు సమకూర్చుతున్న 100 మందికి పైగా ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పల్నాడు జిల్లాలో క్షుద్రపూజల పేరుతో ఇద్దరిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటకు చెందిన నిఖిల్.. నిద్రిస్తున్న వారిని బండరాయితో హత్య చేసి, మృతదేహం నుంచి కొన్ని శరీర భాగాలను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో 2018లో జరిగిన మరో హత్యలోనూ నిఖిల్ ప్రమేయం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
పదో తరగతిలో ఏర్పడిన పరిచయం ఓ వివాహితకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పాత పరిచయంతో ఆమెతో తరచూ మాట్లాడిన ఓ కానిస్టేబుల్ కరీంనగర్‌లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, రహస్యంగా వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడి రూ.1.30 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. చివరకు వీడియోలను భర్తకు పంపడంతో ఆమె కాపురం కూడా దెబ్బతింది.
సోషల్ మీడియా రీల్స్ విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలు విషాదానికి దారితీశాయి. రీల్స్ చేయొద్దని భర్త వారించడంతో మనస్తాపానికి గురైన 35 ఏళ్ల వివాహిత గజ్వేల్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 11 ఏళ్ల వైవాహిక బంధం, ఇద్దరు పిల్లలున్న కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
మద్యం, మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్నతల్లి నివసిస్తున్న ఇంటికే నిప్పుపెట్టాడు. పెట్రోల్ పోసి ఇంటిని దహనం చేయడంతో విలువైన వస్తువులతో పాటు రేషన్ సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం నస్కల్ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, సంపన్నుల ఇళ్లలో దోపిడీలకు ఈ ఆయుధాలను ఉపయోగించేందుకు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో ముగ్గురు సర్వీసులో ఉన్న ఆర్మీ జవాన్లతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నోయిడా సెక్టార్ 94లోని సూపర్‌నోవా భవనంలో విషాద ఘటన చోటుచేసుకుంది. హర్యానాలోని మానేసర్‌కు చెందిన 25 ఏళ్ల సంభవ్ జైన్ 43వ అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. ఘటనకు ముందు తండ్రికి పలుమార్లు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం అందినప్పటికీ.. మృతికి పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
కృష్ణా జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం పేరుతో మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ కనిపించకుండా తిరుగుతున్న భర్త.. చివరకు తన కాలనీలోని ఓ ఇంట్లో మరో మహిళతో ఉండగా భార్యకు కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య, కుమారుడితో కలిసి అతడిపై దాడి చేసి పోలీసులకు అప్పగించింది.
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. పురుగుల మందు కలిపిన మద్యం తాగించి హత్య చేసిన అనంతరం.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారు. అయితే మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో సంచలనం సృష్టించిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రవెల్లి హరిణి (18) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారంలో దూరం పెట్టడంతో కక్ష పెంచుకున్న పవన్‌కుమార్ ముందస్తు పథకంతో హరిణిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. పాఠశాల వద్ద ఏర్పడిన పరిచయం తర్వాత సన్నిహితంగా మారిన 22 ఏళ్ల యువకుడు, పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక ఇళ్ల నుంచి అదృశ్యమయ్యారు. అనంతరం కోనంకి గ్రామ శివారులోని చెరువులో మృతదేహాలుగా కనిపించడంతో కుటుంబాల్లో విషాదం నెలకొంది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కె) గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉన్న వ్యవసాయ భూమిని కొడుకుల పిల్లలకు రాసిచ్చినా వృద్ధాప్యంలో కన్న కొడుకుల ఆదరణకు నోచుకోలేకపోయిన దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంటి నుంచి గెంటివేయడంతో అద్దె ఇంట్లో ఉంటున్న వారు చివరకు తమ వ్యవసాయ పొలంలోని బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు.
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసైన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వెన్న దుర్గా దినేష్ అలియాస్ సాయి జీవితం అనేక మలుపులు తిరిగింది. బెట్టింగ్‌లో చేసిన అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్నా అప్పులు తీరలేదు. చివరకు చోరీల బాట పట్టిన సాయి.. జైలులో పరిచయమైన వారికి దొంగతనాల్లో శిక్షణ ఇచ్చి ముఠాగా ఏర్పడి వరుస చోరీలకు పాల్పడ్డాడు. పల్నాడు ప్రాంతంలో జరిగిన భారీ చోరీ కేసులో సాయితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
నల్ల కాగితాన్ని ప్రత్యేకమైన కెమికల్‌లో ముంచితే అసలైన రూ.500 నోటుగా మారుతుందని నమ్మించిన ఓ ముఠా రాయ్‌పూర్‌కు చెందిన వ్యాపారిని ఏకంగా రూ.1.5 కోట్లకు మోసం చేసింది.
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజుకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాగారం ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వినోద్, శేషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్లేశ్‌తో వినోద్‌కు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ శంషాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన 19 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల తన ప్రియుడు కలలోకి వచ్చి తనను దగ్గరకు రమ్మంటున్నాడని కుటుంబ సభ్యులతో చెప్పిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడం విషాదాన్ని నింపింది.
హైదరాబాద్ పహాడీషరీఫ్ పరిధిలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఎల్.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా రేప్, పోక్సో కేసుల ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. నిందితుడికి రూ.25,500 జరిమానాతో పాటు బాధితుడికి రూ.2 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కేసు విచారణ కోసం కోర్టుకు వచ్చిన మహిళపై ఆమె భర్త పోలీసు, లాయర్ల సమక్షంలోనే దాడికి పాల్పడ్డాడు. జుట్టు పట్టుకుని కిందపడేసి కొట్టడంతో పాటు గొంతు నులిమాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పెళ్లి చేసుకోవడానికి 21 ఏళ్లు నిండే వరకు ఆగాలని చెప్పిన తండ్రిపై ఓ 18 ఏళ్ల యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో తండ్రిని తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ ఘటన చండీగఢ్‌లో కలకలం రేపింది.
బెంగళూరులో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ఖాళీ ప్రదేశంలో పడివున్న పాత పరుపును తరలించేందుకు ప్రయత్నించిన కార్మికులకు అందులోంచి ఓ కాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో అది 28 ఏళ్ల అనుసూయ మృతదేహంగా గుర్తించారు.
హైదరాబాద్ గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ ఎక్కుతున్న సమయంలో ఓ సెక్యూరిటీ గార్డు ఆమెను పక్కకు లాగి బలవంతంగా ముద్దు పెట్టాడు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులు, వీసా గడువు ముగియనున్న వారి నుంచి భారీగా నగదు వసూలు చేశారంటూ యూట్యూబర్ నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్‌పై పలువురు బాధితులు తెలంగాణ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ ఓయో హోటల్‌లో మహిళ తీవ్రగాయాలతో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ప్రియుడితో కలిసి హోటల్‌లో దిగిన మహిళ అనంతరం ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. ఘటన అనంతరం ప్రియుడు శ్రీనివాస రవితేజ కనిపించకుండా పోవడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
బీహార్‌లోని జమూయ్ జిల్లాలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులపై ఓ గుంపు దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 19న కోచింగ్ ముగించుకుని స్కూటర్‌పై వెళ్తున్న విద్యార్థులను అడ్డుకుని వేధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. సదర్ బజార్ ప్రాంతంలో పెన్సిల్, పెన్ను వంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన బాలికను ఓ వ్యక్తి మాయమాటలతో దుకాణంలోకి తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పెళ్లైన 18 రోజులకే ఓ బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది. ఘట్‌కేసర్ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న పల్లవి.. కళాశాల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్‌లో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో అక్రమంగా డిస్పోజల్ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే ఆపరేషన్‌లో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ హాస్టల్ వార్డెన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. చర్ల మండలం సత్యనారాయణపురంలోని ఎస్టీ బాలుర ఇన్‌చార్జ్ హాస్టల్ వార్డెన్, రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భూక్యా వాలుసింహ.. మహిళా ఉద్యోగి గైర్హాజరును అనధికారిక గైర్హాజరుగా నమోదు చేయకుండా ఉండేందుకు రూ.14 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని వీఎస్‌టీ స్టీల్ బ్రిడ్జిపై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడిని రాంనగర్ పార్సీగుట్టకు చెందిన మనోజ్‌గా పోలీసులు గుర్తించారు. శివం రోడ్డులోని అపోలో డయాగ్నొస్టిక్స్‌లో అతడు పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు సహా నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక మృతదేహాన్ని బహిరంగ ప్రదేశంలో పడేయగా.. కుక్కలు పీక్కుతిన్న స్థితిలో పోలీసులు గుర్తించారు.