సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వచన్ సదన్’కు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బారికేడ్ ఎక్కి జాతీయ జెండాతో నిరసన తెలిపారు. అనంతరం రాహుల్, ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆందోళనకారులను తరలించేందుకు సిద్ధమైన పోలీసు బస్సు డ్రైవర్ వద్ద నుంచి ఓ మహిళా కార్యకర్త తాళం చెవిని లాక్కొని బస్సు కదలకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అర్హులైన ఓటర్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇండియా కూటమి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతు తెలిపారు. గణేష్ నిమజ్జనం పూర్తయిందని, జ్ఞానేష్ నిమజ్జనం మాత్రం మిగిలి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని, పౌరసత్వాన్ని కాపాడేందుకు ప్రజలు ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో ఖైరతాబాద్ బైఎలక్షన్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత పెరిగింది.
హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హిమాయత్‌నగర్ డివిజన్‌లో సుమారు 20 వేల ఓట్లు తొలగించారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం వైఖరి మార్చుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని, హైదరాబాద్‌లో పరిస్థితులు సాధారణంగా ఉండవని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలను ఏర్పాటు చేసిన లేదా ఇతర పార్టీల్లో చేరిన నేతలు తిరిగి హస్తం గూటికి రావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శరద్ పవార్, మమతా బెనర్జీలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.
ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) అంశాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ‘ఓట్ చోరీ’ జరుగుతోందని ఆరోపించిన ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని అన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 73.39 లక్షల ఓటర్ల ఎంట్రీలను ASDD కేటగిరీలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు లేఖ రాశారు. అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా క్లెయిమ్స్, అభ్యంతరాల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరారు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో హైదరాబాద్ కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 73.3 లక్షల మంది ఓటర్లు ASDD (Absent, Shifted, Dead, Duplicate) కేటగిరీలో ఉండగా.. వారిలో ఏకంగా 43 లక్షల మంది హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నారు. ముఖ్యంగా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన ఓటర్లే అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వివిధ కారణాలతో సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫామ్‌ల సమర్పణ, డిజిటలైజేషన్ ప్రక్రియ నేటితో (ఆగస్టు 10) ముగియనుంది. ఇప్పటికే ఫామ్ సమర్పించిన ఓటర్లు అది డిజిటలైజ్ అయిందో లేదో సింపుల్‌గా ఎస్‌ఎంఎస్ ద్వారా తెలుసుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...
తెలంగాణలో SIR రెండో విడతపై బీజేపీ దృష్టి సారించింది. ఆగస్టు 10లోగా ఫారమ్-6 ద్వారా అర్హులైన కొత్త ఓటర్ల నమోదు పూర్తి చేయాలని ఎన్. రాంచందర్‌రావు సూచించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు.
టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పేరు కేటాయింపు వివాదంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. ఎన్నికల సంఘం నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇచ్చే అవకాశం కల్పిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.