
news,telangana
హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం..రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరణ
మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం (సెప్టెంబరు 26) ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించి, దేశానికి, తెలంగాణకు మన్మోహన్ సింగ్ అందించిన సేవలను స్మరించుకున్నారు.
25 సెప్టెం, 20262 min read

