తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తో అనుకున్న ప్రాజెక్టులు ప్రస్తుతానికి ముందుకు వెళ్లకపోవడంతో లోకేష్ ఇప్పుడు మహేశ్ బాబుతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ గొడ్డలితో చేసిన దాడిలో తీవ్రంగా గాయపడినా.. విమానాన్ని అదుపులో ఉంచి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు పుర్రెలో తీవ్ర ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అబుధాబిలో చికిత్స పొందుతున్న ఆయన వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వచన్ సదన్’కు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బారికేడ్ ఎక్కి జాతీయ జెండాతో నిరసన తెలిపారు. అనంతరం రాహుల్, ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశంలోని మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఆరు స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో రెండు అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో రెండు, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ స్థానం, అస్సాంలో ఒక లోక్‌సభ స్థానానికి మంగళవారం (అక్టోబర్ 6) ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార పార్టీలకు కీలక పరీక్షగా మారిన ఈ ఉప ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కోసం బుచ్చిబాబు రా అండ్ రస్టిక్ నేపథ్యంలో ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మహాత్మా గాంధీ చిత్రంతో ఉన్న రూ.500 కరెన్సీ నోటును ఉపయోగించి అసభ్యకరంగా రీల్ చేసిన ఆరోపణలపై గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మహిళా కంటెంట్ క్రియేటర్ సిమ్రాన్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆందోళనకారులను తరలించేందుకు సిద్ధమైన పోలీసు బస్సు డ్రైవర్ వద్ద నుంచి ఓ మహిళా కార్యకర్త తాళం చెవిని లాక్కొని బస్సు కదలకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ జరిపిన దాడిని యూఏఈ ప్రాసిక్యూటర్లు ఉగ్రవాద చర్యగా ధృవీకరించారు. విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని కూల్చివేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.
కొత్త క్రిమినల్ చట్టాలు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు తుది తీర్పు వరకు న్యాయ ప్రక్రియ గరిష్టంగా మూడేళ్లలో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మరో ఏడాదిన్నరలో కొత్త చట్టాల పూర్తి అమలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ వాహనదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను రూ.3 చొప్పున పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న నయారా ఫ్యూయల్ స్టేషన్లలో కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ధరల సవరణ చేపట్టినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అర్హులైన ఓటర్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇండియా కూటమి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించారు.
బెంగళూరు–ముంబై నగరాల మధ్య మరో కీలక రైలు సర్వీసు అందుబాటులోకి రానుంది. కేఎస్ఆర్ బెంగళూరు–ముంబై సీఎస్ఎంటీ మధ్య వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించనుండగా రాష్ట్రంలో అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఆగనుంది.
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతు తెలిపారు. గణేష్ నిమజ్జనం పూర్తయిందని, జ్ఞానేష్ నిమజ్జనం మాత్రం మిగిలి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని, పౌరసత్వాన్ని కాపాడేందుకు ప్రజలు ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
సాధారణంగా దేవుళ్లకు ఆలయాలు నిర్మించి పూజలు చేస్తుంటాం. అయితే స్వాతంత్య్ర సమరయోధుడైన మహాత్మా గాంధీకి కూడా ఆలయం నిర్మించి నిత్య పూజలు నిర్వహిస్తున్న ప్రాంతం తెలంగాణలో ఉంది.
అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు చిన్నారుల మధుర గానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకృతి అందాల నడుమ ‘ఏక్ తూ హీ యార్ మేరా’ పాటను ఆలపిస్తూ, చిలిపి హావభావాలతో అలరించిన సింగా, న్గమ్‌జాన్, లిల్లీ వీడియోకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ దాడికి గురైనప్పటికీ 173 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్‌లో మాట్లాడారు. తీవ్ర గాయాలతోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించిన కెప్టెన్ ధైర్యాన్ని ప్రధాని ప్రశంసించారు. ఘటన సమయంలో హనుమాన్ చాలీసా జపించానని కెప్టెన్ స్మిత్ తెలిపారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
రాయలసీమ అభివృద్ధిలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ.. “నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి” అంటూ సీఎం చంద్రబాబును కోరారు.
పప్పులు నానబెట్టేటప్పుడు చిటికెడు వంటసోడా ఉపయోగించడం వల్ల పప్పు మెత్తబడటానికి సహాయపడవచ్చు. నానబెట్టిన నీటిని పారబోసి, పప్పులను బాగా కడిగి వండడం జీర్ణక్రియకు ఉపయోగపడొచ్చు.
హైదరాబాద్ అనగానే బిర్యానీ, హలీమ్ గుర్తొస్తాయి. అయితే నగరానికి శతాబ్దాల నాటి మరో అరుదైన మిఠాయి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతోంది. అదే ‘బాదం కి జాలీ’. నిజాంల కాలం నాటి ఈ సంప్రదాయ స్వీట్‌కు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. బాదం, పంచదార, యాలకులతో కళాత్మకంగా తయారయ్యే ఈ మిఠాయి గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా చేసిన పోస్టుతో మరోసారి చర్చ మొదలైంది.
ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన కాక్‌పిట్ దాడి తీవ్ర కలకలం రేపింది. దాడిలో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ తీవ్రంగా గాయపడి భారీగా రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయే పరిస్థితికి చేరుకున్నారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇజ్రాయెల్ దంత వైద్యుడు డాక్టర్ షోటా మొసావ్ వెంటనే కాక్‌పిట్‌లోకి వెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన సకాలంలో స్పందించడం పైలట్ ప్రాణాలను కాపాడడంలో కీలకంగా మారింది.
దుబాయ్ నుంచి టెల్‌అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో కో-పైలట్ కత్తితో దాడి చేయడంతో విమానం ప్రమాదకరంగా కిందికి పడిపోయింది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యంగా ప్రతిఘటించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఆయన అసాధారణ సాహసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సహ పైలట్ దాడి చేసినప్పటికీ భారతీయ కెప్టెన్ ప్రాణాలకు తెగించి అతడిని ఎదుర్కొన్నారు. అదే సమయంలో విమానంపై నియంత్రణ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుని సుమారు 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థలు వెల్లడించాయి.
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గత 26 ఏళ్లలో బీజేపీతో బీఆర్‌ఎస్ ఒక్కసారి కూడా పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టురట్టయింది. భారత తీరరక్షక దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన పడవ నుంచి 526 కిలోల మెథాంఫెటామైన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు తెలంగాణ యువకులు అనూహ్యంగా రష్యా సైన్యంలో చేరి యుద్ధభూమిలో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు నమ్మించి విదేశాలకు తీసుకెళ్లి, ఆ తర్వాత ఆర్మీలో చేర్చారని కుటుంబాలు పేర్కొన్నాయి. యువకులను సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
నల్ల కాగితాన్ని ప్రత్యేకమైన కెమికల్‌లో ముంచితే అసలైన రూ.500 నోటుగా మారుతుందని నమ్మించిన ఓ ముఠా రాయ్‌పూర్‌కు చెందిన వ్యాపారిని ఏకంగా రూ.1.5 కోట్లకు మోసం చేసింది.
ఔషధాలు, వైద్య పరికరాల తయారీ వ్యయం, వాటి ఎమ్మార్పీ మధ్య భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యాన్సర్ మందు తయారీకి రూ.3 వేలు ఖర్చవుతుంటే ఎమ్మార్పీ రూ.27 వేలుగా ఎలా నిర్ణయిస్తారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
వారణాసిలో లాట్ భైరవ్ ఆలయ వార్షిక ఉత్సవంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బందోబస్తు విధుల్లో ఉన్న పలువురు పోలీసులు వేదికపై మహిళా కళాకారుల డ్యాన్స్‌ను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ కెమెరాలకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.