విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను టాలీవుడ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రముఖ దర్శకులు కలిసి విడుదల చేశారు. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
రాయలసీమ అభివృద్ధిలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ.. “నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి” అంటూ సీఎం చంద్రబాబును కోరారు.
వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనను, తన అనుచరులను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడే నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు. లేదంటే మహిళా కార్యకర్తలతో గట్టిగా సమాధానం చెప్పిస్తామని వ్యాఖ్యానించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ప్రధానికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ప్రజాసేవ, నాయకత్వం, దేశ అభివృద్ధికి చేస్తున్న కృషిని ఇద్దరూ తమ సందేశాల్లో ప్రస్తావించారు.
ఆయుర్వేద చికిత్స కోసం కేరళలో కొన్ని వారాలు గడిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చికిత్సను విజయవంతంగా ముగించుకుని రాష్ట్రానికి వీడ్కోలు పలికారు. కేరళ ప్రజల ఆతిథ్యం, వైద్యుల సేవలు, ఆలయాల ఆధ్యాత్మిక అనుభూతిని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగ సందేశం ఇచ్చారు. పవన్ సందేశానికి కేరళ సీఎం ఆత్మీయంగా స్పందిస్తూ సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.
కేరళలో ఆయుర్వేద చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి దీపారాధన, మీనుట్టు, వేది వజిపాడు తదితర సేవల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘క్రేజీ కళ్యాణం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘కాకా ధూమ్ ధమాకా’ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. పెళ్లి కూతురు గెటప్‌లో అనుపమ వేసిన మాస్ స్టెప్పులు ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరును ఖరారు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పాఠశాల విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. చిన్నారుల చేత రాఖీలు కట్టించుకున్న ఆయన.. విద్యార్థినుల పేర్లు, తరగతులు అడిగి తెలుసుకుని వారితో సరదాగా ముచ్చటించారు.
మహారాష్ట్రలో వైద్యులపై దాడుల పరంపర ఆందోళన కలిగిస్తోంది. థానేలోని కల్యాణ్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ యోగేంద్ర జైస్వాల్‌పై రోగి కుమారుడు దాడికి పాల్పడ్డాడు. వైద్యుడిని దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావోద్వేగ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నప్పటి నుంచి తనకు అన్నయ్య చిరంజీవి హీరోగానే కనిపించేవారని, ఆయన కష్టం, క్రమశిక్షణ, కుటుంబంపై చూపిన ప్రేమ తన జీవితానికి స్ఫూర్తిగా నిలిచాయని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ చిరంజీవిపై భావోద్వేగ పోస్టు చేశారు.
విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఫిక్స్ అయింది. ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ప్రకటించిన చిత్రబృందం.. 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాప్షన్ కూడా ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కౌంటర్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కౌంటర్ సిద్ధమైన తర్వాత దాన్ని ఆపమని ఎవరు ఆదేశించారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలపై ప్రతిపక్షాలు మాత్రమే మాట్లాడటం లేదని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంగా మార్చారని కేటీఆర్ ఆరోపించారు.
కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. సంక్షేమంతో ప్రజలకు భరోసా కల్పిస్తూ, అభివృద్ధితో రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నామని ఆయన తెలిపారు.
సోషల్ మీడియాలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు వ్యవహరించే తీరుపై పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. పోస్టులు, వ్యాఖ్యల్లో భాష, భావ వ్యక్తీకరణ విషయంలో సంయమనం పాటించాలని సూచించారు.
శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పిఠాపురం, ద్రాక్షారామంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, భీమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి రక్షణ కల్పించేందుకు రూ.323 కోట్లతో తీర రక్షణ గోడ నిర్మించనున్నారు. డిజైన్, డీపీఆర్, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ-మద్రాస్ చేపట్టనుంది.
రాష్ట్రంలోని 158 మారుమూల ఆవాసాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించనున్నారు. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.422.10 కోట్లతో 347 కి.మీ. మేర 146 రోడ్లు, 19 వంతెనలు నిర్మించనున్నారు.
ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసుపత్రికి చేరుకుని హరిప్రసాద్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.
నెల్లూరులో వైసీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన దైవ నామాలు, భక్తి గీతాలను అపహాస్యం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హలిశహర్‌లో మమతా బెనర్జీ కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకున్నారు. తన వాహనంపై బురద, రాళ్లు, చెప్పులు విసిరారని మమతా ఆరోపించగా.. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ మాత్రం ఈ ఘటనతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
హైదరాబాద్ ఓల్డ్‌సిటీలోని బేలా శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించిన కల్యాణ మహోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామి సతీసమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యుల్లా భావిస్తూ, ఎవరికైనా కష్టం వస్తే ముందుండి ఆదుకుంటున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు.
మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టిన 'అడవితల్లి బాట' కార్యక్రమం పనులను వేగవంతం చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరు వైద్య విద్యార్థులను ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారులకు తగిన గుర్తింపు కల్పించేందుకు లేపాక్షి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రాష్ట్ర హస్తకళా అభివృద్ధి సంస్థ దేశంలో తొలిసారిగా హస్తకళా ఉత్పత్తులకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలని జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి వినతిపత్రం సమర్పించారు.