#Latest News

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Latest News.

30 Stories

Stories tagged with #Latest News

సిద్దిపేటలో ఏసీబీ దాడులు.. రూ.15 వేల లంచం కేసులో ఇద్దరి అరెస్ట్!
crime,news,telangana

సిద్దిపేటలో ఏసీబీ దాడులు.. రూ.15 వేల లంచం కేసులో ఇద్దరి అరెస్ట్!

సిద్దిపేట జిల్లాలో లంచం తీసుకుంటున్నారన్న ఆరోపణలపై గ్రామ కార్యదర్శి, కారొబార్‌ ఏసీబీ అధికారుల ట్రాప్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో ఇంటి మ్యుటేషన్‌ కోసం రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది.

6 అక్టో, 20261 min read
నాకు గాడ్‌ఫాదర్లు ఎవరూ లేరు..నేను ఎవరికీ బినామీని కాదు..ఐటీ సోదాలపై రకుల్‌ప్రీత్ సింగ్ క్లారిటీ
cinema,entertainment,national,news

నాకు గాడ్‌ఫాదర్లు ఎవరూ లేరు..నేను ఎవరికీ బినామీని కాదు..ఐటీ సోదాలపై రకుల్‌ప్రీత్ సింగ్ క్లారిటీ

హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, ఆమె భర్త వసు భగ్నానీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయన్న వార్తలపై రకుల్ స్పందించింది. తాను ఎవరికీ బినామీ కాదని, తనకు కోట్ల విలువైన ఆస్తులను ఎవరూ బహుమతిగా ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేయొద్దని కోరింది.

5 అక్టో, 20261 min read
రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే మీ కార్డు రద్దు..!
news,telangana

రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే మీ కార్డు రద్దు..!

రేషన్ కార్డుదారులకు కీలక సమాచారం. వరుసగా ఆరు నెలలపాటు రేషన్ తీసుకోని కార్డులను తాత్కాలికంగా ఇనాక్టివ్ చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా, సంబంధిత లబ్ధిదారులకు ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువు ఇవ్వనున్నారు. రేషన్ కార్డు ప్రయోజనాలు కొనసాగాలంటే ఈకేవైసీ పూర్తి చేసుకోవడం కీలకంగా మారింది.

3 అక్టో, 20262 min read
అనంతగిరి ఘాట్‌లో ప్రైవేట్ బస్సు బోల్తా..ముగ్గురు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు
news,telangana

అనంతగిరి ఘాట్‌లో ప్రైవేట్ బస్సు బోల్తా..ముగ్గురు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు

వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌ రోడ్డులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకర్‌పల్లి మండలం కేసారం నుంచి ధారూర్ మండలం చింతకుంటకు అంత్యక్రియలకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

3 అక్టో, 20261 min read
హనుమాన్ చాలీసా చదివా.. ధైర్యం వచ్చింది.. ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ కెప్టెన్ ఆసక్తికర సంభాషణ
aviation-air-travel,india,national,news

హనుమాన్ చాలీసా చదివా.. ధైర్యం వచ్చింది.. ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ కెప్టెన్ ఆసక్తికర సంభాషణ

ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ దాడికి గురైనప్పటికీ 173 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్‌లో మాట్లాడారు. తీవ్ర గాయాలతోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించిన కెప్టెన్ ధైర్యాన్ని ప్రధాని ప్రశంసించారు. ఘటన సమయంలో హనుమాన్ చాలీసా జపించానని కెప్టెన్ స్మిత్ తెలిపారు.

2 అక్టో, 20262 min read
 విగ్రహంతో పాటు నదిలో పడిన యువకుడు (AI Image)
news,telangana

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి.. విగ్రహంతో పాటు నదిలో పడిన యువకుడు

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మూసీ పాత వంతెనపై నుంచి గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ప్రయత్నించగా ఓ యువకుడు ప్రమాదవశాత్తూ విగ్రహంతో పాటు నదిలో పడిపోయాడు. అయితే కొద్దిసేపటికే సురక్షితంగా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.

24 సెప్టెం, 20261 min read
తల్లి అవ్వాలంటే పెళ్లే చేసుకోవాలా?.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న కామెంట్స్!
cinema,entertainment,news

తల్లి అవ్వాలంటే పెళ్లే చేసుకోవాలా?.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి వార్తలు వినిపిస్తున్న వేళ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి, మాతృత్వం విషయంలో తన ఆలోచనలను ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె బహిరంగంగా వెల్లడించింది. తల్లి కావడానికి పెళ్లి తప్పనిసరి కాదని, పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

23 సెప్టెం, 20261 min read
రక్తం అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు.. విమర్శలపై చిరు క్లారిటీ
cinema,entertainment,news

రక్తం అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు.. విమర్శలపై చిరు క్లారిటీ

బ్లడ్ బ్యాంక్ పేరుతో రక్తం విక్రయిస్తున్నారంటూ తనపై వస్తున్న ఆరోపణలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమాల ద్వారా వస్తున్న తన సంపాదన తనకు సరిపోతుందని, రక్తం అమ్ముకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నానని తెలిపారు. జీవితంలో ఎదగడానికి క్రమశిక్షణ, కష్టపడే తత్వమే కారణమని, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిమానులకు సూచించారు.

22 సెప్టెం, 20262 min read
బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు.. మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్? పోలీసుల తాజా క్లారిటీ ఇదే
news,telangana

బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు.. మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్? పోలీసుల తాజా క్లారిటీ ఇదే

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ కేసులో అరెస్టులపై వస్తున్న వార్తలను తెలంగాణ పోలీసులు ఖండించారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ స్పష్టం చేశారు. మరోవైపు, రెజిమెంట్ సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది.

11 సెప్టెం, 20262 min read
వీరప్పన్‌ను అటవీ మంత్రిని చేస్తే ఎలా ఉంటుందో.. రేవంత్‌ను సీఎంను చేస్తే అట్లనే ఉంది: కేటీఆర్
news,politics,telangana

వీరప్పన్‌ను అటవీ మంత్రిని చేస్తే ఎలా ఉంటుందో.. రేవంత్‌ను సీఎంను చేస్తే అట్లనే ఉంది: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలోని భూములను కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకం వెనుక ఓ స్కామ్ ఉందని విమర్శించారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమైన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు.

11 సెప్టెం, 20262 min read
Social Media Image
cinema,entertainment

సినిమాలు మానేయాలనుకున్నా..విడాకుల తర్వాత కెరీర్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు గుడ్‌బై చెప్పాలని అనుకున్నానని నటి సమంత వెల్లడించింది. అయితే ఆ సమయంలో తన జీవితంలోకి వచ్చిన రాజ్ నిడిమోరు ఇచ్చిన ధైర్యం, నమ్మకంతోనే ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మళ్లీ నటించానని చెప్పింది. భర్త ఇచ్చిన మోరల్ సపోర్ట్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని సమంత తెలిపింది.

10 సెప్టెం, 20262 min read
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది.. రాష్ట్రపతి పాలన విధించాలి: హరీశ్ రావు
news,politics,telangana

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది.. రాష్ట్రపతి పాలన విధించాలి: హరీశ్ రావు

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన.. కేసీఆర్ ఇంటిపై దాడి, మహిళా ఎమ్మెల్యేలపై దాడులు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడ్డారు.

8 సెప్టెం, 20262 min read
Social Media Image
news,national,india

రీల్స్‌కు బానిసగా మారి.. మొబైల్‌లో నెట్ స్లోగా ఉందని ప్రాణాలు తీసుకున్న మహిళ

రీల్స్ చూడ్డానికి అలవాటు పడిన ఓ మహిళ.. మొబైల్‌లో ఇంటర్నెట్ సరిగా పనిచేయకపోవడంతో తీవ్ర అసహనానికి గురైంది. ఫోన్‌ను విసిరికొట్టి అనంతరం పురుగుల మందు తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.

8 సెప్టెం, 20261 min read
నల్ల దుస్తులతో బీఆర్‌ఎస్‌ నిరసన.. చీర లాగారని కన్నీరు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి
news,politics,telangana

నల్ల దుస్తులతో బీఆర్‌ఎస్‌ నిరసన.. చీర లాగారని కన్నీరు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల దుస్తులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకు దిగారు. ఈ క్రమంలో తన చీర లాగారని, కాలికి గాయమైందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఘటనపై ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

7 సెప్టెం, 20261 min read
ఏపీలో మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
andhra-pradesh,news,politics

ఏపీలో మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం పొందుతున్న మహిళలకు త్వరలో ఏసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ అవకాశం కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏసీ బస్సుల సంఖ్యను పెంచి, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

1 సెప్టెం, 20262 min read
AI
cinema,entertainment,news

వివాదం తర్వాత మళ్లీ వార్తల్లో అనసూయ.. ఈసారి జిమ్ వీడియోతో హల్‌చల్

యాంకర్ అనసూయ భరద్వాజ్‌ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ, డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. స్పీడ్‌గా ఎక్సర్‌సైజులు చేస్తూ కనిపించిన ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీడియోలో ఆమె ధరించిన దుస్తులపై కొందరు నెటిజన్లు విమర్శలు, ట్రోలింగ్‌కు దిగారు.

31 ఆగ, 20262 min read
యూపీలో ఘోర పేలుడు.. బాణసంచా ఫ్యాక్టరీలో 11 మంది మృతి
india,national,news

యూపీలో ఘోర పేలుడు.. బాణసంచా ఫ్యాక్టరీలో 11 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కౌశాంబి జిల్లాలోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో 11 మంది కార్మికులు మృతి చెందారు. మరో 10 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

31 ఆగ, 20261 min read
చుట్టూ ఇళ్లు కొట్టుకుపోయాయి.. ఈ భవనం మాత్రం నిలిచింది! నేపాల్ వరదల్లో అద్భుత దృశ్యం
international,news

చుట్టూ ఇళ్లు కొట్టుకుపోయాయి.. ఈ భవనం మాత్రం నిలిచింది! నేపాల్ వరదల్లో అద్భుత దృశ్యం

నేపాల్‌లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. చుట్టుపక్కల అనేక ఇళ్లు, నిర్మాణాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినా.. ఓ భవనం మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. అందులో ఉన్నవారు సైతం క్షేమంగా బయటపడటంతో, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

29 ఆగ, 20262 min read
హైదరాబాద్‌లో 24 గంటల పాటు వాటర్‌ కట్‌.. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం
news,telangana

హైదరాబాద్‌లో 24 గంటల పాటు వాటర్‌ కట్‌.. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం

హైదరాబాద్‌ నగరవాసులకు జలమండలి కీలక ప్రకటన చేసింది. బండ్లగూడ ఎక్స్‌ రోడ్‌ వద్ద పైప్‌లైన్‌ జంక్షన్‌ పనుల కారణంగా ఆగస్టు 29న ఉదయం 10 గంటల నుంచి 24 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పూర్తిగా లేదా పాక్షికంగా అంతరాయం ఏర్పడనుంది. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

28 ఆగ, 20261 min read
చిన్నారులతో ప్రధాని మోదీ రాఖీ వేడుకలు.. రాఖీలు కట్టిన విద్యార్థినులు
india,national,news

చిన్నారులతో ప్రధాని మోదీ రాఖీ వేడుకలు.. రాఖీలు కట్టిన విద్యార్థినులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పాఠశాల విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్‌ వేడుకలు జరుపుకున్నారు. చిన్నారుల చేత రాఖీలు కట్టించుకున్న ఆయన.. విద్యార్థినుల పేర్లు, తరగతులు అడిగి తెలుసుకుని వారితో సరదాగా ముచ్చటించారు.

28 ఆగ, 20261 min read
పాఠశాలల్లో హిజాబ్‌కు అనుమతి లేదు.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
india,national,news

పాఠశాలల్లో హిజాబ్‌కు అనుమతి లేదు.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

పాఠశాలల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థలు సమానత్వం, క్రమశిక్షణ కోసం యూనిఫాం నిబంధనలను అమలు చేసే హక్కు కలిగి ఉంటాయని స్పష్టం చేసింది.

25 ఆగ, 20261 min read
హైదరాబాద్‌ నుండి ఎపికి చికెన్‌ వ్యర్థాల అక్రమ రవాణా..100 టన్నులు సీజ్‌
andhra-pradesh,crime,news,telangana

హైదరాబాద్‌ నుండి ఎపికి చికెన్‌ వ్యర్థాల అక్రమ రవాణా..100 టన్నులు సీజ్‌

హైదరాబాద్‌లో చికెన్‌ వ్యర్థాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. కోళ్ల దుకాణాలు, మాంసం ప్రాసెసింగ్‌ యూనిట్ల నుంచి సేకరించిన వ్యర్థాలను రాత్రివేళల్లో లారీల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు తరలించి చేపల చెరువులకు మేతగా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సైబరాబాద్‌ పోలీసులు, పశువైద్య శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 100 టన్నుల చికెన్‌ వ్యర్థాలను సీజ్‌ చేశారు.

24 ఆగ, 20261 min read
బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం దారుణ హత్య.. గంటల తరబడి అదే ఇంట్లో నిందితులు
crime,india,news,international

బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం దారుణ హత్య.. గంటల తరబడి అదే ఇంట్లో నిందితులు

బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్యకు గురైన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యులను హత్య చేసిన అనంతరం నిందితులు వెంటనే పారిపోకుండా కొన్ని గంటల పాటు అదే ఇంట్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోనే స్నానం చేసి, ఫ్రిజ్‌లో ఉన్న ఆహారాన్ని తిని, డ్రగ్స్ సేవించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

24 ఆగ, 20262 min read
Social MEDIA iMAGE
crime,district,news,telangana

రామగుండంలో ఉగ్ర లింకుల అనుమానాలు.. ఎన్‌ఐఏ అదుపులో ఇంజినీరింగ్ విద్యార్థి

పెద్దపల్లి జిల్లా రామగుండంలో NIA నిర్వహించిన తనిఖీలు కలకలం రేపాయి. అయోధ్య నగర్‌లో చేపట్టిన సోదాల్లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడిని ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

24 ఆగ, 20261 min read
అమరావతి ఆసుపత్రిలో విషాదం.. అగ్నిప్రమాదంలో ముగ్గురు పసికందులు మృతి
national,india,news

అమరావతి ఆసుపత్రిలో విషాదం.. అగ్నిప్రమాదంలో ముగ్గురు పసికందులు మృతి

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు మూడో అంతస్తులోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ (NICU)లో మంటలు చెలరేగాయి.

24 ఆగ, 20262 min read
Social Media Image
crime,india,news

ఢిల్లీలో పోలీసులపై దాడి.. కళ్లలో కారం చల్లి, ఇటుకలు-కర్రలతో దాడి

ఢిల్లీలో విధుల్లో ఉన్న పోలీసులపై ఓ గుంపు దాడికి పాల్పడింది. బైక్‌ను సీజ్ చేశారన్న కోపంతో హెడ్ కానిస్టేబుళ్ల కళ్లలో కారం చల్లి, ఇటుకలు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.

23 ఆగ, 20262 min read
మహిళను హత్య చేసి.. శరీర భాగాలతో బిర్యానీ! పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
crime,india,news

మహిళను హత్య చేసి.. శరీర భాగాలతో బిర్యానీ! పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు

చెన్నైలో వెలుగుచూసిన దారుణ హత్య కేసు పోలీసులను సైతం విస్తుపోయేలా చేసింది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో సూట్‌కేస్‌లో మానవ శరీర భాగాలు లభించిన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. ఓ మహిళను హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుల ఇంట్లో బిర్యానీ పాత్రలోనూ మానవ శరీర భాగాలు లభించడంతో కేసు మరింత సంచలనంగా మారింది.

23 ఆగ, 20261 min read
తెలంగాణలో ఈ ఆటో, క్యాబ్‌, స్కూల్ వ్యాన్‌ల నిరవధిక బంద్‌.. డ్రైవర్ల డిమాండ్లు ఇవే!
telangana,travel-trends-niche-tourism,news

తెలంగాణలో ఈ ఆటో, క్యాబ్‌, స్కూల్ వ్యాన్‌ల నిరవధిక బంద్‌.. డ్రైవర్ల డిమాండ్లు ఇవే!

తెలంగాణలో ఆటో, క్యాబ్‌, స్కూల్ వ్యాన్‌ డ్రైవర్లు ఆదివారం (ఆగస్టు 23) అర్ధరాత్రి నుంచి నిరవధిక బంద్‌కు దిగనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించిన పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆటో, యాప్‌ ఆధారిత సంఘాల జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. బంద్‌తో ప్రయాణికులు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

23 ఆగ, 20262 min read
Social Media Image
crime,district,news,telangana

Warangal: మద్యం మత్తులో బెటాలియన్ కానిస్టేబుల్‌ న్యూసెన్స్..లాఠీ ఝుళిపించిన పోలీసులు

వరంగల్ జిల్లా ఉర్సుగుట్టలోని ఓ బార్‌లో మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌పై బీట్ కానిస్టేబుల్ లాఠీతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బార్ సిబ్బంది 112కు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బెటాలియన్ కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, పరస్పరం చెంపదెబ్బలు తగలడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

22 ఆగ, 20261 min read
అర్ధరాత్రి విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకే కుటుంబంలో నలుగురి మృతి
telangana,news

అర్ధరాత్రి విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకే కుటుంబంలో నలుగురి మృతి

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను బలవంతపూర్‌కు చెందిన భాగ్య, రాజు, పిల్లలు నియాన్, శాన్వికగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం బావిలో నుంచి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

20 ఆగ, 20261 min read