
national,news,crime
సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కిర్పాన్‌తో దాడి.. నిందితుడిని వెంటనే పట్టుకున్న పోలీసులు
మహారాష్ట్రలోని నాందేడ్‌లో శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడికి యత్నం కలకలం రేపింది. గురుద్వారా మెట్ల వద్ద ఓ సేవాదార్ అకస్మాత్తుగా కిర్పాన్‌తో ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు నాందేడ్ ఎస్పీ డాక్టర్ నిలాభ్ రోహన్ తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
13 ఆగ, 20262 min read
