కొత్త క్రిమినల్ చట్టాలు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు తుది తీర్పు వరకు న్యాయ ప్రక్రియ గరిష్టంగా మూడేళ్లలో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మరో ఏడాదిన్నరలో కొత్త చట్టాల పూర్తి అమలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ దాడికి గురైనప్పటికీ 173 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్‌లో మాట్లాడారు. తీవ్ర గాయాలతోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించిన కెప్టెన్ ధైర్యాన్ని ప్రధాని ప్రశంసించారు. ఘటన సమయంలో హనుమాన్ చాలీసా జపించానని కెప్టెన్ స్మిత్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారణాసిలో పర్యటిస్తున్నారు. కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు.. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం (సెప్టెంబర్ 17) భారీ దీపోత్సవం నిర్వహించనున్నారు. క్షిప్రా నది ఘాట్లతో పాటు మహాకాల్ లోక్ ప్రాంతంలో 25 లక్షలకు పైగా మట్టి ప్రమిదలను వెలిగించనున్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది వాలంటీర్లు పాల్గొననుండగా, దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా పలు ప్రజా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ప్రధానికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ప్రజాసేవ, నాయకత్వం, దేశ అభివృద్ధికి చేస్తున్న కృషిని ఇద్దరూ తమ సందేశాల్లో ప్రస్తావించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సోషల్ మీడియా ఫాలోయింగ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి వేదికల ద్వారా కోట్లాది మందిని చేరుకుంటున్న మోదీ.. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా తన డిజిటల్ కమ్యూనికేషన్‌ను కొనసాగిస్తున్నారు.
భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. సభ్య దేశాల మధ్య సున్నితమైన భౌగోళిక రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ఏకాభిప్రాయాన్ని సాధించడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. తెల్లవారుజాము వరకు సాగిన చర్చల అనంతరం అన్ని దేశాలు డిక్లరేషన్‌కు అంగీకరించడం భారత్ దౌత్య విజయంగా నిలిచింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శనివారం ఢిల్లీకి చేరుకున్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు.
ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ హాజరుకానున్నారు. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, బీజేపీ కార్యాలయ గేటుకు నల్ల రంగు పూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం కన్నా మించేలా ఈ స్టేడియాన్ని నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పాఠశాల విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. చిన్నారుల చేత రాఖీలు కట్టించుకున్న ఆయన.. విద్యార్థినుల పేర్లు, తరగతులు అడిగి తెలుసుకుని వారితో సరదాగా ముచ్చటించారు.
నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటేకోషి నదిలో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు ప్రాథమికంగా వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉండగా.. విదేశీయుల్లో సుమారు 105 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. గతంలో మాదిరిగా తాను పని చేయలేకపోతున్నానని, బాధ్యతలను యువతరానికి అప్పగించాలని ఆయన చేసిన వ్యాఖ్యలతో యాక్టివ్ పాలిటిక్స్‌కు గడ్కరీ దూరం కానున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశంతో చేసినవి కావని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది.
అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని అన్నారు. రాజకీయ కారణాలతోనే తన పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించిన సీఎం.. గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి, తనకు ఎందుకు నిరాకరించారో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా ఎర్రకోటపై ‘వందే మాతరం’ పూర్తి గానం జరిగింది. అనంతరం జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు.
2036 ఒలింపిక్స్‌లో ప్రతి క్రీడాంశంలో భారత్ పోటీపడేలా సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 5–15 ఏళ్ల పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్ చేపట్టనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తున్న బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజు లోక్‌సభలో అరుదైన దృశ్యం కనిపించింది. గురువారం సభా కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందు తొలిసారిగా ‘వందే మాతరం’ను ఆలపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు ఈ సమయంలో సభలో ఉన్నారు. అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేయడంతో వర్షాకాల సమావేశాలు ముగిశాయి.
ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటలూ పనిచేసే ‘అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం’ను ప్రారంభించారు. బయోమెట్రిక్ ధ్రువీకరణతో ఆటోమేటిక్‌గా ధాన్యం పంపిణీ చేసే ఈ వ్యవస్థ ద్వారా పని చేసే మహిళలు, వలస కార్మికులు, ఇతర లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతంగా ఆహార భద్రత అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ మహాసభల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాస తెలుగువారితో సమావేశమై తెలంగాణ అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణపై చర్చించారు.
భారత్‌లో తన సోషల్ మీడియా ఖాతాపై విధించిన పరిమితులపై ఆప్ అధినేత,ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెటా సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అకౌంట్‌ను ఎందుకు నియంత్రించారో స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో కొన్ని గంటల పాటు తొలగించిన ఘటనపై పార్లమెంటరీ సమాచార సాంకేతిక కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే సంచలన విజయం సాధించారు. బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచి, మూడు దశాబ్దాలుగా బీజేపీ ఆధిపత్యం కొనసాగిన నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ఆక్సిజన్‌లా నిలిచారని, అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్ వంటి కీలక అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రూ.18 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిదర్శనమని ప్రశంసించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోదీ నెరవేరుస్తున్నారని, దేశాన్ని వికసిత్ భారత్ దిశగా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ కొత్త అధ్యాయమని అన్నారు.