Stories tagged with #News

crime,news,telangana
సిద్దిపేటలో ఏసీబీ దాడులు.. రూ.15 వేల లంచం కేసులో ఇద్దరి అరెస్ట్!
సిద్దిపేట జిల్లాలో లంచం తీసుకుంటున్నారన్న ఆరోపణలపై గ్రామ కార్యదర్శి, కారొబార్ ఏసీబీ అధికారుల ట్రాప్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో ఇంటి మ్యుటేషన్ కోసం రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది.

news,telangana
మాజీ మావోయిస్టులకు కవిత ఆహ్వానం.. ‘మా పార్టీలో చేరండి’
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వేములవాడలో పర్యటించారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టులు ప్రజాసేవలోకి రావాలని, తమ పార్టీలో చేరి ప్రజల కోసం పనిచేయాలని ఆమె ఆహ్వానించారు. మరోవైపు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన కవిత ఆలయ పునర్నిర్మాణంలో కాంక్రీట్ వినియోగాన్ని వ్యతిరేకించారు.

andhra-pradesh,news,spiritual

news,telangana
బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అరెస్ట్
బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ను హైదరాబాద్ గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. క్రిశాంక్‌తో పాటు ఎంఆర్ మీడియా తెలంగాణ, మరికొందరిని కూడా ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.

crime,news,telangana
మూడేళ్ల ప్రేమ..మూడు అబార్షన్లు.. మున్సిపల్ ఛైర్మన్ కుమారుడిపై యువతి ఆరోపణలు
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ ప్రేమ పేరుతో తనను నమ్మించి మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరై, గర్భం దాల్చిన సందర్భాల్లో అబార్షన్ చేయించారని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. యువతికి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు సంఘీభావం తెలిపారు.

international,news,aviation-air-travel

india,national,news,politics
6 స్థానాలకు ఉప ఎన్నికలు: బెంగాల్ నుంచి తమిళనాడు వరకు.. ఎవరి బలమెంతో తేల్చే పరీక్ష!
దేశంలోని మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఆరు స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో రెండు అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో రెండు, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ స్థానం, అస్సాంలో ఒక లోక్‌సభ స్థానానికి మంగళవారం (అక్టోబర్ 6) ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార పార్టీలకు కీలక పరీక్షగా మారిన ఈ ఉప ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

aviation-air-travel,international,news

crime,news,andhra-pradesh
క్షుద్రపూజల కోసం వరుస హత్యలు.. నిద్రిస్తున్న వారే టార్గెట్!
పల్నాడు జిల్లాలో క్షుద్రపూజల పేరుతో ఇద్దరిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటకు చెందిన నిఖిల్.. నిద్రిస్తున్న వారిని బండరాయితో హత్య చేసి, మృతదేహం నుంచి కొన్ని శరీర భాగాలను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో 2018లో జరిగిన మరో హత్యలోనూ నిఖిల్ ప్రమేయం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

crime,news,telangana
పాత పరిచయం పేరుతో వేధింపులు.. వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడి, వీడియోలతో బెదిరింపులు
పదో తరగతిలో ఏర్పడిన పరిచయం ఓ వివాహితకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పాత పరిచయంతో ఆమెతో తరచూ మాట్లాడిన ఓ కానిస్టేబుల్ కరీంనగర్‌లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, రహస్యంగా వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడి రూ.1.30 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. చివరకు వీడియోలను భర్తకు పంపడంతో ఆమె కాపురం కూడా దెబ్బతింది.

aviation-air-travel,crime,international,news
ఫ్లైదుబాయ్‌ను కూల్చేందుకు ఇజ్రాయెల్ ప్లాన్!
ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న హైజాక్ ప్రయత్నం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. విమానం టెల్ అవీవ్ వైపు దూసుకొస్తుండటంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైందని, అవసరమైతే విమానాన్ని కూల్చివేయాలని కూడా ఒక దశలో నిర్ణయించినట్టు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ప్రయాణికులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు విమానం సౌదీ వైపు మళ్లడంతో ఇజ్రాయెల్ ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్టు సమాచారం.

news,politics,telangana
‘ఫేక్ గాంధీ’.. కాంగ్రెస్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదవడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించిన ఆయన.. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ నేతల అవినీతిని బట్టబయలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

crime,news,telangana
ఫిజియోథెరపీ ఆస్పత్రి తెరవాలంటే రూ.2 లక్షలు లంచం.. చివరికి ఏసీబీ వలకు
రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) స్వర్ణకుమారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఎల్బీనగర్‌లో లైసెన్స్ లేదంటూ మూసివేసిన ఫిజియోథెరపీ ఆస్పత్రిని తిరిగి తెరవడానికి రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడి నిర్వహించారు. ఈ వ్యవహారంలో డీఎంహెచ్‌వోతో పాటు హెల్త్ ఇన్‌స్పెక్టర్, డ్రైవర్ పాత్రపై దర్యాప్తు చేపట్టారు.

news,andhra-pradesh,special-stories,spiritual
శివలింగాన్ని చుట్టూ ప్రదక్షిణలు.. మూడు నాగుపాముల అరుదైన దర్శనం
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓ శివాలయంలో సోమవారం అరుదైన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకటి కాదు.. ఏకంగా మూడు నాగుపాములు శివలింగం చుట్టూ తిరుగుతూ, అనంతరం దాని ముందు పడగవిప్పి నిలబడటం కనిపించింది. భక్తులు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించడంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

news,telangana,crime
రీల్స్ చేయొద్దన్న భర్త.. తీవ్ర నిర్ణయం తీసుకున్న భార్య
సోషల్ మీడియా రీల్స్ విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలు విషాదానికి దారితీశాయి. రీల్స్ చేయొద్దని భర్త వారించడంతో మనస్తాపానికి గురైన 35 ఏళ్ల వివాహిత గజ్వేల్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 11 ఏళ్ల వైవాహిక బంధం, ఇద్దరు పిల్లలున్న కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

aviation-air-travel,international,news
పైలట్‌ను హతమార్చి విమానాన్ని కూల్చేయాలని ప్లాన్.. ఫ్లైదుబాయ్ ఘటనలో షాకింగ్ వివరాలు
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు హీబ్రూ మీడియా కథనాలు వెల్లడించాయి. పైలట్‌ను హతమార్చిన తర్వాత విమానాన్ని బెన్ గురియన్ విమానాశ్రయంలోని భవనం లేదా జెట్‌పై ఢీకొట్టాలని కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి భావించినట్టు దర్యాప్తు అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.

india,news,national,politics
పొలం ఉంది.. ఇల్లు ఉంది.. అయినా పెళ్లి కావడం లేదు..ఓ యువరైతు ఆవేదన
కర్ణాటకలో ఓ యువరైతు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు, పొలాలు ఉండి కష్టపడి వ్యవసాయం చేస్తున్న యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని ఆయన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీల తరహాలో దీనినీ ‘ఆరో గ్యారంటీ’గా పరిగణించాలని కోరారు.

crime,news,telangana
మద్యం, జల్సాలకు డబ్బులు ఇవ్వలేదని తల్లి ఇంటిని తగలబెట్టిన కొడుకు
మద్యం, మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్నతల్లి నివసిస్తున్న ఇంటికే నిప్పుపెట్టాడు. పెట్రోల్ పోసి ఇంటిని దహనం చేయడంతో విలువైన వస్తువులతో పాటు రేషన్ సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం నస్కల్ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

crime,india,national,news
గాంధీజీపై అసభ్యకర రీల్.. మహిళా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్
మహాత్మా గాంధీ చిత్రంతో ఉన్న రూ.500 కరెన్సీ నోటును ఉపయోగించి అసభ్యకరంగా రీల్ చేసిన ఆరోపణలపై గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మహిళా కంటెంట్ క్రియేటర్ సిమ్రాన్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు.

crime,india,national,news

national,news
ఆధార్ సేవల్లో భారీ మార్పులు.. కొత్త వెబ్‌సైట్‌లో కీలక ఫీచర్లు
ఆధార్ సేవలను మరింత సులభతరం చేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక మార్పులు చేసింది. ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌ను పూర్తిగా పునరుద్ధరించి, వినియోగదారులకు అనుకూలంగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు రేషన్ పంపిణీలో వేలిముద్రలతో ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.

cinema,entertainment,national,news

crime,news,telangana
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. ప్రయాణికుడి అరెస్ట్
హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద సుమారు 800 గ్రాముల బంగారాన్ని గుర్తించి సీజ్ చేశారు. దీని విలువ దాదాపు రూ.1.20 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

crime,news,telangana

crime,news,telangana
వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే.. 49 మంది విదేశీయులపై పోలీసుల ఉక్కుపాదం
వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్, FRRO, ఐటీ సెల్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకు 49 మంది అక్రమ విదేశీయులను గుర్తించారు. వీరిలో 12 మందిని ఇప్పటికే స్వదేశాలకు పంపగా.. మరో 37 మందిని హోల్డింగ్ సెంటర్లలో ఉంచారు. విచారణలో నకిలీ కరెన్సీ, డ్రగ్స్, మోసాలు, అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

crime,international,news,national
ఫ్లైదుబాయ్ విమానంలో ఉగ్ర కుట్ర.. కో-పైలట్ దాడి వెనుక సంచలన విషయాలు
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ జరిపిన దాడిని యూఏఈ ప్రాసిక్యూటర్లు ఉగ్రవాద చర్యగా ధృవీకరించారు. విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని కూల్చివేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.

news,national,telangana
అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. ఇదే కారణం!
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకుని, ఆదివారం మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఢిల్లీలో కొనసాగుతున్న కీలక రాజకీయ, రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దైనట్లు సమాచారం.

news,telangana
రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే మీ కార్డు రద్దు..!
రేషన్ కార్డుదారులకు కీలక సమాచారం. వరుసగా ఆరు నెలలపాటు రేషన్ తీసుకోని కార్డులను తాత్కాలికంగా ఇనాక్టివ్ చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా, సంబంధిత లబ్ధిదారులకు ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువు ఇవ్వనున్నారు. రేషన్ కార్డు ప్రయోజనాలు కొనసాగాలంటే ఈకేవైసీ పూర్తి చేసుకోవడం కీలకంగా మారింది.

andhra-pradesh,news,spiritual

crime,news,telangana
బొల్లారం ఆయుధాల చోరీ వెనుక సంచలన కుట్ర..ముగ్గురు ఆర్మీ జవాన్లే కీలక పాత్ర
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, సంపన్నుల ఇళ్లలో దోపిడీలకు ఈ ఆయుధాలను ఉపయోగించేందుకు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో ముగ్గురు సర్వీసులో ఉన్న ఆర్మీ జవాన్లతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.