
national,india,news
లోక్‌సభ చరిత్రలో తొలిసారి ‘వందే మాతరం’తో ప్రారంభం.. ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజు లోక్‌సభలో అరుదైన దృశ్యం కనిపించింది. గురువారం సభా కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందు తొలిసారిగా ‘వందే మాతరం’ను ఆలపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు ఈ సమయంలో సభలో ఉన్నారు. అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేయడంతో వర్షాకాల సమావేశాలు ముగిశాయి.
13 ఆగ, 20262 min read
