#Revanth Reddy

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Revanth Reddy.

30 Stories

Stories tagged with #Revanth Reddy

బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అరెస్ట్
news,telangana

బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అరెస్ట్

బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ను హైదరాబాద్ గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. క్రిశాంక్‌తో పాటు ఎంఆర్ మీడియా తెలంగాణ, మరికొందరిని కూడా ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.

6 అక్టో, 20262 min read
‘ఫేక్ గాంధీ’.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
news,politics,telangana

‘ఫేక్ గాంధీ’.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదవడంపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించిన ఆయన.. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్‌ నేతల అవినీతిని బట్టబయలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

6 అక్టో, 20261 min read
కేటీఆర్‌పై గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు.. అమరావతి హోటల్ నుంచి యశోద భూముల వరకు!
news,telangana

కేటీఆర్‌పై గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు.. అమరావతి హోటల్ నుంచి యశోద భూముల వరకు!

కేటీఆర్‌పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అమరావతిలో కేటీఆర్ భార్య శైలిమా పేరుతో భారీగా హోటల్ నిర్మించారంటూ ఆరోపించిన ఆయన యశోద ఆసుపత్రికి ప్రభుత్వ భూముల కేటాయింపు, మెడికోవర్ సంస్థతో సంబంధాలు, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

5 అక్టో, 20262 min read
రేవంత్ కూతురు నైమిషాతో వ్యాపార భాగస్వామి దుంప శిరీష ఎవరు?..క్రిశాంక్ సంచలన ఆరోపణలు
news,politics,telangana

రేవంత్ కూతురు నైమిషాతో వ్యాపార భాగస్వామి దుంప శిరీష ఎవరు?..క్రిశాంక్ సంచలన ఆరోపణలు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల వ్యాపారాలపై బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. మెడికోవర్ హాస్పిటల్స్ సహా పలు సంస్థల్లో దుంప శిరీష పాత్ర ఏమిటని ప్రశ్నించిన ఆయన.. రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యాపారాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తన ఆరోపణలను తప్పని నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణలు చెబుతానని సవాల్ విసిరారు.

3 అక్టో, 20262 min read
సచివాలయంలో గద్వాల విజయలక్ష్మిని అడ్డుకున్న అధికారులు.. కేబినెట్ భేటీకి నో ఎంట్రీ!
news,politics,telangana

సచివాలయంలో గద్వాల విజయలక్ష్మిని అడ్డుకున్న అధికారులు.. కేబినెట్ భేటీకి నో ఎంట్రీ!

తెలంగాణ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మిని కేబినెట్ సమావేశానికి అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమావేశానికి తనకు ఆహ్వానం లేదని అధికారులు చెప్పడంతో ఆమె సీఎంవోను సంప్రదించినప్పటికీ అక్కడా స్పష్టత లభించలేదని సమాచారం.

1 అక్టో, 20261 min read
రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..నా హోటళ్లకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన రేవంత్‌కు థ్యాంక్స్
news,politics,telangana

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..నా హోటళ్లకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన రేవంత్‌కు థ్యాంక్స్

సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. తన హోటల్‌ వ్యాపారం, కుటుంబ ఆస్తులపై సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తన హోటళ్లకు ఉచిత ప్రచారం కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి కుటుంబాల ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సవాల్‌ విసిరారు.

1 అక్టో, 20262 min read
ఆరు గ్యారెంటీలను పక్కనపెట్టి దేవుళ్లపై చర్చ ఎందుకు?: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
news,politics,telangana

ఆరు గ్యారెంటీలను పక్కనపెట్టి దేవుళ్లపై చర్చ ఎందుకు?: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాముడు, శివుడి విషయంలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టకుండా మతాలు, దేవుళ్ల అంశాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు.

1 అక్టో, 20261 min read
మీ ఆస్తులు బయటపెడతా..లెక్క తేలుస్తా!..కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
news,politics,telangana

మీ ఆస్తులు బయటపెడతా..లెక్క తేలుస్తా!..కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ధైర్యముంటే కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. హైటెక్ సిటీ సమీపంలోని స్టార్ హోటళ్లతో పాటు అమెరికా, సింగపూర్‌లో పెట్టుబడులపై కూడా రేవంత్ ప్రశ్నలు సంధించారు.

30 సెప్టెం, 20261 min read
బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల ‘ఉరిసిల్ల’గా మారింది: సీఎం రేవంత్ రెడ్డి
news,telangana,politics

బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల ‘ఉరిసిల్ల’గా మారింది: సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సిరిసిల్ల తీవ్ర సమస్యలకు కేంద్రంగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సిరిసిల్లను ‘సిరుల సిల్ల’గా కాకుండా ‘ఉరిసిల్ల’గా మార్చారని ఆరోపించారు. సిరిసిల్ల కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, ఆత్మహత్యలు, గల్ఫ్ వలసలపై మాజీ మంత్రి కేటీఆర్‌ను సీఎం ప్రశ్నించారు.

30 సెప్టెం, 20262 min read
ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసేది లేదు..కేసీఆరే మ‌ళ్లీ సీఎం: కేటీఆర్
news,politics,telangana

ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసేది లేదు..కేసీఆరే మ‌ళ్లీ సీఎం: కేటీఆర్

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. గత 26 ఏళ్లలో బీజేపీతో బీఆర్‌ఎస్‌ ఒక్కసారి కూడా పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

30 సెప్టెం, 20261 min read
File Photo
andhra-pradesh,india,news,politics,telangana

తిరిగి హస్తం గూటికి రండి.. జగన్‌ సహా కాంగ్రెస్‌ను వీడిన కీలక నేతలకు భట్టి విక్రమార్క ఆహ్వానం

కాంగ్రెస్‌ పార్టీని వీడి ఇతర పార్టీలను ఏర్పాటు చేసిన లేదా ఇతర పార్టీల్లో చేరిన నేతలు తిరిగి హస్తం గూటికి రావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శరద్‌ పవార్‌, మమతా బెనర్జీలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.

30 సెప్టెం, 20263 min read
పేదల కోసం పథకాలు.. ప్రజలకు చేరేలా ఉద్యోగులు పనిచేయాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
news,politics,telangana

పేదల కోసం పథకాలు.. ప్రజలకు చేరేలా ఉద్యోగులు పనిచేయాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొత్త కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు పనిచేయాలని సూచించారు.

30 సెప్టెం, 20261 min read
వరంగల్ ఎయిర్‌పోర్టు పేరుపై వివాదం.. రేవంత్‌పై కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు
news,telangana,politics

వరంగల్ ఎయిర్‌పోర్టు పేరుపై వివాదం.. రేవంత్‌పై కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు

వరంగల్ మామునూరు విమానాశ్రయానికి పేరు పెట్టే అంశం తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీసింది. విమానాశ్రయానికి రేచర్ల రుద్రారెడ్డి పేరు పెట్టాలన్న ప్రతిపాదన వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయంటూ ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆరోపించారు. అయితే, విమానాశ్రయానికి తుది పేరు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

30 సెప్టెం, 20261 min read
కాకా వెంకటస్వామి కలను సాకారం చేస్తాం.. ప్రాణహిత-చేవెళ్లపై ఎంపీ వంశీకృష్ణ కీలక ప్రకటన
news,telangana

కాకా వెంకటస్వామి కలను సాకారం చేస్తాం.. ప్రాణహిత-చేవెళ్లపై ఎంపీ వంశీకృష్ణ కీలక ప్రకటన

ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సాగునీటి కొరతను తీర్చేందుకు దివంగత కాకా వెంకటస్వామి కన్న కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మహారాష్ట్రకు సంబంధించిన అంశాలు, అవసరమైన అనుమతులు, సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

30 సెప్టెం, 20261 min read
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం.. కవిత కీలక ప్రకటన
news,politics,telangana

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం.. కవిత కీలక ప్రకటన

ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన తరఫున అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానం నాగేందర్ పార్టీ మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మరణాలు, ప్రభుత్వ వైద్య సేవలు, ఓటర్ల జాబితా సవరణ, తన ఫామ్‌హౌస్‌పై వస్తున్న ఆరోపణలపైనా స్పందించారు.

26 సెప్టెం, 20262 min read
హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం..రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరణ
news,telangana

హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం..రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరణ

మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం (సెప్టెంబరు 26) ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించి, దేశానికి, తెలంగాణకు మన్మోహన్ సింగ్ అందించిన సేవలను స్మరించుకున్నారు.

25 సెప్టెం, 20262 min read
ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. తలసాని సాయి కిరణ్‌కు ఛాన్స్!
news,telangana,politics

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. తలసాని సాయి కిరణ్‌కు ఛాన్స్!

ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

25 సెప్టెం, 20261 min read
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక పురస్కారం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026’ అవార్డు
news,telangana

సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక పురస్కారం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026’ అవార్డు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు దక్కనుంది. రైతులు, బీసీలు, సామాన్య ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాస్వామిక విలువల పట్ల ఆయన నిబద్ధతను గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకుల జ్యూరీ వెల్లడించింది.

24 సెప్టెం, 20261 min read
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది ప్యారడైజ్’.. నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్ స్పందన
cinema,news,telangana,entertainment

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది ప్యారడైజ్’.. నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్ స్పందన

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని నేచురల్ స్టార్ నాని చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు నానిని అభినందించిన సీఎం.

23 సెప్టెం, 20261 min read
వర్షపు నీరు నిలిచినా.. వాహనాలు ఆగినా చర్యలు తప్పవు: సీఎం రేవంత్
news,telangana

వర్షపు నీరు నిలిచినా.. వాహనాలు ఆగినా చర్యలు తప్పవు: సీఎం రేవంత్

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

22 సెప్టెం, 20261 min read
ఆదిలాబాద్ రిమ్స్‌లో ఘోర అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతుల సంఖ్య
news,telangana

ఆదిలాబాద్ రిమ్స్‌లో ఘోర అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతుల సంఖ్య

ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో సోమవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నవజాత శిశువుల ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ వద్ద షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో ఊపిరాడక ముగ్గురు పసికందులు మృతిచెందారు. మరో చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

22 సెప్టెం, 20262 min read
సంతోష్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?..పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా దోచుకుంది: రమ్యారావు తీవ్ర వ్యాఖ్యలు
news,politics,telangana

సంతోష్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?..పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా దోచుకుంది: రమ్యారావు తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా పాలనతో ప్రజల మద్దతు పొందుతుంటే బీఆర్ఎస్ ‘22ఏ’ పేరుతో రాజకీయాలు చేస్తోందని టీపీసీసీ సీనియర్ నేత రమ్యారావు విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా సంపాదించిందని ఆరోపించారు. తన భూములపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆమె సంతోష్ రావు ఆస్తులు, భూములు, ప్లాట్లపై పలు ప్రశ్నలు సంధించారు.

21 సెప్టెం, 20262 min read
సీఎం సర్ ప్లీజ్ హెల్ప్ (AI Image)
news,telangana,politics

సియం సర్ మీ సన్నిహితుడు నన్ను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నాడు...సీఎం రేవంత్ రెడ్డికి శోభా రెడ్డి కీలక విజ్ఞప్తి

అడ్వర్టైజింగ్ రంగంలో వర్క్‌ ఆపర్చునిటీ, కాంట్రాక్ట్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనను గెస్ట్‌హౌస్‌కు రావాలని పిలిచి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించిన మహిళా వ్యాపారవేత్త కె. శోభా రెడ్డి మరోసారి స్పందించారు. తనను రాజకీయ పార్టీలకు అంటగడుతూ ‘పెయిడ్ ఆర్టిస్ట్’, ‘పేటీఎం బ్యాచ్’ అంటూ ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేస్తూ.. మున్సిపల్ శాఖలో అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుంచేందుకు ఒక్క అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు.

21 సెప్టెం, 20262 min read
తెలంగాణలో రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడమేనా?: కల్వకుంట్ల కవిత
news,politics,telangana

తెలంగాణలో రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడమేనా?: కల్వకుంట్ల కవిత

తెలంగాణలో ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా రాజకీయాలు వ్యక్తిగత విమర్శలు, దూషణలకే పరిమితమవుతున్నాయంటూ తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

21 సెప్టెం, 20262 min read
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై రేవంత్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్.. జడ్జితో విచారణ జరిపించండి
news,politics,telangana

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై రేవంత్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్.. జడ్జితో విచారణ జరిపించండి

కేసీఆర్ కుటుంబ భూములపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గతంలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను 1,000 ఎకరాలుగా పేర్కొన్న రేవంత్.. ఇప్పుడు కేసీఆర్ దంపతులకు 67.13 ఎకరాలు ఉన్నట్లు సభలో చెప్పడాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. తమ ఆస్తులపై, ప్రభుత్వ పెద్దల ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ చేశారు. ఇదే సమయంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

17 సెప్టెం, 20262 min read
నిరంకుశ పాలనపై పోరాటానికి తెలంగాణ పుట్టినిల్లు: సీఎం రేవంత్ రెడ్డి
news,telangana

నిరంకుశ పాలనపై పోరాటానికి తెలంగాణ పుట్టినిల్లు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. తెలంగాణ నేల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనేక ప్రజా ఉద్యమాలకు వేదికైందని పేర్కొన్న ఆయన.. సెప్టెంబర్ 17కు రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడటమే ప్రజాపాలన లక్ష్యమని తెలిపారు.

17 సెప్టెం, 20261 min read
ఎన్నికల అఫిడవిట్ కంటే గజం భూమి ఎక్కువున్నా ప్రభుత్వానికి ఇస్తా.. కవిత సంచలన ప్రకటన
news,politics,telangana

ఎన్నికల అఫిడవిట్ కంటే గజం భూమి ఎక్కువున్నా ప్రభుత్వానికి ఇస్తా.. కవిత సంచలన ప్రకటన

తెలంగాణ అసెంబ్లీలో కల్వకుంట్ల కుటుంబానికి చెందిన భూములపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల కంటే ఒక్క గజం భూమి ఎక్కువగా ఉన్నా ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని స్పష్టం చేశారు.

16 సెప్టెం, 20262 min read
కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు.. 30 రోజుల్లో నివేదిక
news,politics,telangana

కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు.. 30 రోజుల్లో నివేదిక

తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమం, ధరణిని అడ్డుపెట్టుకుని భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు పేర్కొన్న భూముల వివరాలను సభలో వెల్లడించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ భూములపై 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

16 సెప్టెం, 20262 min read
ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో గంటన్నరపాటు వాదనలు
crime,news,politics,telangana

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో గంటన్నరపాటు వాదనలు

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుమారు గంటన్నరపాటు వాదనలు వినిపించారు.

16 సెప్టెం, 20261 min read
CM Revanth Reddy's speech in the Assembly
news,politics,telangana

ప్రతిపక్షం సభను అడ్డుకునేందుకు కుట్ర చేసింది...చరిత్ర కొంతమందిని ఎప్పటికీ క్షమించదు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, ప్రభుత్వ భూములు, ఫీజు రీయింబర్స్‌మెంట్, కరవు తదితర అంశాలు సభలో చర్చకు వస్తాయనే ఉద్దేశంతోనే ప్రతిపక్షం సభా కార్యక్రమాలను అడ్డుకునేలా వ్యవహరించిందని ఆరోపించారు. కొంతమందిని చరిత్ర ఎప్పటికీ క్షమించదని వ్యాఖ్యానించారు.

16 సెప్టెం, 20262 min read