
news,politics,telangana
గురుపూర్ణిమ వేళ సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రత్యేక పూజలు.. తెలంగాణ శ్రేయస్సు కోసం ప్రార్థనలు
గురుపూర్ణిమ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని శ్రీ సాయిబాబా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, దేశ శ్రేయస్సు కోసం సాయిబాబా ఆశీస్సులు కోరుతూ ప్రార్థనలు చేసినట్లు ఆయన తెలిపారు.
29 జులై, 20261 min read
