దేశంలోని మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఆరు స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో రెండు అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో రెండు, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ స్థానం, అస్సాంలో ఒక లోక్‌సభ స్థానానికి మంగళవారం (అక్టోబర్ 6) ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార పార్టీలకు కీలక పరీక్షగా మారిన ఈ ఉప ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఇంట్లో ఉన్న డబ్బు, బంగారు ఆభరణాలను సోషల్ మీడియాలో ప్రదర్శించిన ఓ యూట్యూబర్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ఆమె వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా సమాచారం సేకరించిన దొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడ్డారు.
తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మెనూలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని చేర్చే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ ఈ ప్రతిపాదనను సీఎం సి. జోసెఫ్ విజయ్ ముందుంచగా, ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. తొలుత ఎంపిక చేసిన పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి, పరిశుభ్రత, ఆహార భద్రత, తయారీ, సరఫరా వంటి అంశాలను పరిశీలించనున్నారు.
తమిళనాడులోని 52 ప్రముఖ ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆలయాల్లో రీల్స్, వీడియోల చిత్రీకరణతో పవిత్రతకు భంగం కలుగుతోందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది.
చెన్నై సమీపంలోని పుఝల్ సెంట్రల్ జైలులో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జైలు సదుపాయాలు, ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్యం, విద్య, వృత్తి శిక్షణపై పరిశీలన జరిపిన ఆయన.. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాపై తమిళనాడు బీజేపీ మాజీ నేత కే అన్నామలై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో మహిళలను అతిగా లైంగికంగా, కించపరిచేలా చూపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలపై ఇలాంటి సన్నివేశాలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి చిత్రాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఎలా అనుమతి ఇస్తోందని ప్రశ్నించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో కీలక సంక్షేమ నిర్ణయాలను ప్రకటించారు. ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకం కింద అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు అందించనున్నట్లు వెల్లడించారు.
చెన్నైలో వెలుగుచూసిన దారుణ హత్య కేసు పోలీసులను సైతం విస్తుపోయేలా చేసింది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో సూట్‌కేస్‌లో మానవ శరీర భాగాలు లభించిన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. ఓ మహిళను హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుల ఇంట్లో బిర్యానీ పాత్రలోనూ మానవ శరీర భాగాలు లభించడంతో కేసు మరింత సంచలనంగా మారింది.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్‌కు నటి త్రిష సెల్యూట్ చేయడం చర్చకు దారితీసిన నేపథ్యంలో నటి సంజన గల్రానీ స్పందించారు. విజయ్ రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక కొందరు ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. విజయ్, త్రిషల వ్యక్తిగత విషయాలను ఆధారాలు లేకుండా చర్చించడం సరికాదని స్పష్టం చేశారు.
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకూ ప్రభుత్వ వాహనాలు కేటాయించడంతో పాటు డ్రైవర్, ఇంధనం, నిర్వహణ కోసం నెలకు రూ.75 వేలు, వ్యక్తిగత కార్యదర్శి కోసం మరో రూ.25 వేల గ్రాంట్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అధికారపక్ష సభ్యులు స్వాగతించగా.. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించింది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పాఠశాలలు, ఉన్నత విద్యకు వేల కోట్ల రూపాయలు కేటాయించింది.
నటి త్రిషపై పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌పై తంజావూరు పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో భద్రత కట్టుదిట్టం కాగా, టీవీకే-డీఎంకే మధ్య రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
Aadi Perukku Festival | పుట్టింటి నుంచి వచ్చే సారె కోసం ఎదురుచూసే ప్రతి సోదరికి ఆ అనుబంధం ఎంతో మధురం. ఆప్యాయత, అనురాగాలతో నిండిన ఆ సంప్రదాయం దేవాలయ వేడుకగా మారితే ఎలా ఉంటుంది? శ్రీరంగంలో కనిపించే ‘కావేరికి సారె ఉత్సవం’ అలాంటి అరుదైన సంప్రదాయమే.