హైదరాబాద్ మహానగర పరిధిలో ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపు పొందిన లబ్ధిదారులకు తెలంగాణ హౌసింగ్ బోర్డు కీలక సూచన చేసింది. తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌గా చెల్లించాల్సిన రూ.1 లక్ష మొత్తాన్ని చెల్లించేందుకు గడువును అక్టోబర్ 9 వరకు పొడిగించింది. ఈలోగా చెల్లింపు చేయని వారి తాత్కాలిక కేటాయింపులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర పూల పండుగ బతుకమ్మ వేడుకలను ఈ నెల 10 నుంచి 18 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చివరి రోజు సద్దుల బతుకమ్మను హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై వేలాది మంది మహిళలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల వ్యాపారాలపై బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. మెడికోవర్ హాస్పిటల్స్ సహా పలు సంస్థల్లో దుంప శిరీష పాత్ర ఏమిటని ప్రశ్నించిన ఆయన.. రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యాపారాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తన ఆరోపణలను తప్పని నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణలు చెబుతానని సవాల్ విసిరారు.
జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసింగ్ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో కొత్త జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేయడంతో పాటు పలు పోలీస్ స్టేషన్ల పరిధులను మార్చింది. కొన్ని స్టేషన్ల పేర్లను సవరించగా, మరికొన్ని ప్రాంతాలను ఇతర పోలీస్ స్టేషన్లలో విలీనం చేసింది.
హైదరాబాద్‌లో ప్రజా రవాణా మరింత సులభతరం కానుంది. మెట్రో, ఆర్టీసీ సేవలను ఒకే పాస్‌తో వినియోగించుకునే మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కామన్ పాస్‌ను ఆవిష్కరించారు. ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు నగరంలో ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.
హైదరాబాద్ నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఇక ఆర్టీసీ బస్సు, మెట్రోలో ప్రయాణించేందుకు ప్రతిసారీ టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే కామన్ పాస్‌తో ఆర్టీసీ బస్సులు, మెట్రోలో ప్రయాణించే సౌకర్యాన్ని అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. డే, వీక్లీ, నెలవారీ పాస్‌లతో పాటు ఆర్టీసీ పాస్‌లను మొబైల్ యాప్ ద్వారా పొందే సదుపాయం కూడా ప్రారంభం కానుంది.
కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలను ఏర్పాటు చేసిన లేదా ఇతర పార్టీల్లో చేరిన నేతలు తిరిగి హస్తం గూటికి రావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శరద్ పవార్, మమతా బెనర్జీలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.
కరీంనగర్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు పనిచేయాలని సూచించారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు తెలంగాణ యువకులు అనూహ్యంగా రష్యా సైన్యంలో చేరి యుద్ధభూమిలో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు నమ్మించి విదేశాలకు తీసుకెళ్లి, ఆ తర్వాత ఆర్మీలో చేర్చారని కుటుంబాలు పేర్కొన్నాయి. యువకులను సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన తరఫున అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానం నాగేందర్ పార్టీ మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మరణాలు, ప్రభుత్వ వైద్య సేవలు, ఓటర్ల జాబితా సవరణ, తన ఫామ్‌హౌస్‌పై వస్తున్న ఆరోపణలపైనా స్పందించారు.
మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం (సెప్టెంబరు 26) ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించి, దేశానికి, తెలంగాణకు మన్మోహన్ సింగ్ అందించిన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 544 అధ్యాపక, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కొత్త ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంపిక విధానంలో మార్పులు చేయనున్నారు. అకడమిక్ ప్రతిభకు 50 మార్కులు, రాత పరీక్షకు 40, ఇంటర్వ్యూకు 10 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులతో ఎంపిక చేపట్టే అవకాశం ఉంది.
గణేశ్ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సెప్టెంబర్ 25న సెలవు ప్రకటించింది. ఈ మేరకు జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14ను పనిదినంగా నిర్ణయించింది.
తెలంగాణలో ప్రభుత్వ పౌర సేవలను మరింత సులభంగా అందించేందుకు మీసేవ డోర్ డెలివరీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇక కొన్ని ముఖ్యమైన ధృవీకరణ పత్రాలు, ఆధార్, రిజిస్ట్రేషన్, పోలీస్ శాఖకు చెందిన సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చు. ఇందుకోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి లేదా మీసేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని ప్రజల స్పందన ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణలో కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. అక్టోబర్‌లో కొత్త పెన్షన్లను ప్రారంభించి, దసరా పండుగకు ముందే అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో సోమవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నవజాత శిశువుల ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ వద్ద షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో ఊపిరాడక ముగ్గురు పసికందులు మృతిచెందారు. మరో చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అడ్వర్టైజింగ్ రంగంలో వర్క్ ఆపర్చునిటీ, కాంట్రాక్ట్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనను గెస్ట్‌హౌస్‌కు రావాలని పిలిచి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించిన మహిళా వ్యాపారవేత్త కె. శోభా రెడ్డి మరోసారి స్పందించారు. తనను రాజకీయ పార్టీలకు అంటగడుతూ ‘పెయిడ్ ఆర్టిస్ట్’, ‘పేటీఎం బ్యాచ్’ అంటూ ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేస్తూ.. మున్సిపల్ శాఖలో అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుంచేందుకు ఒక్క అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు.
తెలంగాణలో ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా రాజకీయాలు వ్యక్తిగత విమర్శలు, దూషణలకే పరిమితమవుతున్నాయంటూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
హైదరాబాద్ నగరంలో ఇంటింటి నుంచి చెత్త సేకరణను రాంకీ సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్వచ్ఛ ఆటో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకోగా పలువురు మహిళా కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత లోపించిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. తన నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లను ఇతర నియోజకవర్గాల వారికి ఇచ్చారని శాసనసభలో జీరో అవర్‌లో ప్రస్తావించారు. ఈ విషయాన్ని మంత్రికి చెబితే ‘కూల్ కూల్’ అంటున్నారని, ప్రభుత్వ పెద్దలు కూల్‌గా ఉండటం వల్లే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని విమర్శించారు.
2004 కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ తనకు ఒక్క ఎకరం భూమి కూడా లేదని పేర్కొన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం వేల కోట్ల విలువైన భూములు, ఆస్తులు ఎలా సమకూరాయో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్‌ల ఆధారంగానే కేసీఆర్ ఆస్తుల పెరుగుదలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్లలో ఆరుగురు విద్యార్థులు చెరువులో పడి మృతిచెందిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్‌ను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మృతదేహాల పోస్టుమార్టం సందర్భంగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకోబోమని బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి.
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. తెలంగాణ నేల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనేక ప్రజా ఉద్యమాలకు వేదికైందని పేర్కొన్న ఆయన.. సెప్టెంబర్ 17కు రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడటమే ప్రజాపాలన లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, ప్రభుత్వ భూములు, ఫీజు రీయింబర్స్‌మెంట్, కరవు తదితర అంశాలు సభలో చర్చకు వస్తాయనే ఉద్దేశంతోనే ప్రతిపక్షం సభా కార్యక్రమాలను అడ్డుకునేలా వ్యవహరించిందని ఆరోపించారు. కొంతమందిని చరిత్ర ఎప్పటికీ క్షమించదని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. సెప్టెంబర్ 18లోగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే హైదరాబాద్ దిగ్బంధానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ అభివృద్ధి, వారసత్వ పరిరక్షణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ మరింత భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vతో భేటీ అయిన సీఎం.. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, ఫ్యూచర్ సిటీ, వారసత్వ భవనాల పునరుద్ధరణ, విద్యా–పర్యాటక–వైద్య రంగాల్లో సహకారంపై చర్చించారు. ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నగరానికి నలువైపులా గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది.
హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని అగాపురాలో ఏర్పాటు చేసిన వినూత్న గణపతి మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘తెలంగాణ రైజింగ్–1000 డేస్ యాజ్ సీఎం’ థీమ్‌తో రూపొందించిన ఈ మండపంలో సీఎం రేవంత్‌రెడ్డి భుజంపై గణనాథుడిని ఎత్తుకున్నట్లుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ ప్రతిమ ‘బాహుబలి’ సినిమాలోని శివలింగాన్ని భుజాన మోసే సన్నివేశాన్ని తలపిస్తోంది.
తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పేదలు, రైతులు, భూయజమానులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ధరణి సమస్యలను అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు పలుమార్లు మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని విమర్శించారు. ధరణిలోని సాంకేతిక లోపాలు, ‘సీక్రెట్ లాక్’ల వ్యవస్థ, భూ రికార్డుల సమస్యలపై శాసనసభలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.