#Telangana Police

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Telangana Police.

30 Stories

Stories tagged with #Telangana Police

వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే.. 49 మంది విదేశీయులపై పోలీసుల ఉక్కుపాదం
crime,news,telangana

వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే.. 49 మంది విదేశీయులపై పోలీసుల ఉక్కుపాదం

వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్, FRRO, ఐటీ సెల్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకు 49 మంది అక్రమ విదేశీయులను గుర్తించారు. వీరిలో 12 మందిని ఇప్పటికే స్వదేశాలకు పంపగా.. మరో 37 మందిని హోల్డింగ్ సెంటర్లలో ఉంచారు. విచారణలో నకిలీ కరెన్సీ, డ్రగ్స్, మోసాలు, అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

3 అక్టో, 20262 min read
బొల్లారం ఆయుధాల చోరీ వెనుక సంచలన కుట్ర..ముగ్గురు ఆర్మీ జవాన్లే కీలక పాత్ర
crime,news,telangana

బొల్లారం ఆయుధాల చోరీ వెనుక సంచలన కుట్ర..ముగ్గురు ఆర్మీ జవాన్లే కీలక పాత్ర

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, సంపన్నుల ఇళ్లలో దోపిడీలకు ఈ ఆయుధాలను ఉపయోగించేందుకు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో ముగ్గురు సర్వీసులో ఉన్న ఆర్మీ జవాన్లతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

3 అక్టో, 20262 min read
హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో భారీ మార్పులు.. కొత్త జోన్లు, డివిజన్ల పూర్తి వివరాలు ఇవే
news,telangana

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో భారీ మార్పులు.. కొత్త జోన్లు, డివిజన్ల పూర్తి వివరాలు ఇవే

జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసింగ్‌ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో కొత్త జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేయడంతో పాటు పలు పోలీస్‌ స్టేషన్ల పరిధులను మార్చింది. కొన్ని స్టేషన్ల పేర్లను సవరించగా, మరికొన్ని ప్రాంతాలను ఇతర పోలీస్‌ స్టేషన్లలో విలీనం చేసింది.

2 అక్టో, 20262 min read
పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. ప్రియుడి కోసం భర్తనే హత్య చేయించిన భార్య
crime,news,telangana

పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. ప్రియుడి కోసం భర్తనే హత్య చేయించిన భార్య

భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. పురుగుల మందు కలిపిన మద్యం తాగించి హత్య చేసిన అనంతరం.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారు. అయితే మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

2 అక్టో, 20262 min read
ప్రేమకు దూరమైందని కక్ష..బైక్ క్లచ్ వైర్‌తో గొంతు బిగించి చంపిన ప్రియుడు
crime,news,telangana

ప్రేమకు దూరమైందని కక్ష..బైక్ క్లచ్ వైర్‌తో గొంతు బిగించి చంపిన ప్రియుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో సంచలనం సృష్టించిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రవెల్లి హరిణి (18) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారంలో దూరం పెట్టడంతో కక్ష పెంచుకున్న పవన్‌కుమార్‌ ముందస్తు పథకంతో హరిణిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

1 అక్టో, 20261 min read
Social Media Images
crime,news,telangana

మహబూబాబాద్‌లో మిస్సింగ్‌ కేసుల కలకలం.. 246 కేసులు నమోదు?

మహబూబాబాద్‌ జిల్లాలో మహిళలు, బాలికల అదృశ్య కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 246 మిస్సింగ్‌ కేసులు నమోదైనట్లు సమాచారం. సోషల్‌ మీడియా పరిచయాలు, ప్రేమ పేరుతో మాయమాటలు వంటి అంశాల నేపథ్యంలో బాలికలు ఇళ్ల నుంచి వెళ్లిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు, స్థానికులు చెబుతున్నారు.

1 అక్టో, 20262 min read
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
crime,news

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజుకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాగారం ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వినోద్, శేషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్లేశ్‌తో వినోద్‌కు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.

29 సెప్టెం, 20261 min read
షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద 13 కిలోల జింక మాంసం పట్టివేత
news,crime,telangana

షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద 13 కిలోల జింక మాంసం పట్టివేత

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద ఎస్‌ఓటీ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో జింక మాంసం పట్టుబడింది. సుమారు 13 కిలోల జింక మాంసాన్ని తరలిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వేటకు ఉపయోగించిన రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

28 సెప్టెం, 20261 min read
గణేష్‌ నిమజ్జనంలో ఖాకీల సందడి..పోలీసుల డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు
entertainment,news,spiritual,telangana

గణేష్‌ నిమజ్జనంలో ఖాకీల సందడి..పోలీసుల డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో భక్తి, సందడి నడుమ పోలీసుల సరదా డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా కొందరు పోలీసులు డ్యాన్స్‌ స్టెప్పులతో సందడి చేయగా ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

26 సెప్టెం, 20262 min read
డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీలపై ఏసీబీ పంజా..బినామీల ఇళ్లలో భారీగా ఆధారాలు
crime,news,telangana

డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీలపై ఏసీబీ పంజా..బినామీల ఇళ్లలో భారీగా ఆధారాలు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్‌రెడ్డి వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఆయన బినామీలు, ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, సంస్థలపై హైదరాబాద్‌, జహీరాబాద్‌లో ఏకకాలంలో 10 బృందాలతో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, మద్యం సీసాలతో పాటు కీలక పత్రాలు, డిజిటల్‌ ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

25 సెప్టెం, 20262 min read
గిరిజన యువకుడి ఆత్మహత్య.. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలి మనవడి వేధింపులే కారణం!
crime,news,politics,telangana

గిరిజన యువకుడి ఆత్మహత్య.. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలి మనవడి వేధింపులే కారణం!

బైక్ విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి ఆత్మహత్యకు తీవ్ర కలకలం రేపుతోంది. రాజేష్ అనే గిరిజన యువకుడిని యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేష్ యాదవ్ వేధించాడని, మూడు రోజులుగా ఒత్తిడి కారణంగా అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

19 సెప్టెం, 20262 min read
Social Media Image
crime,news,telangana

హఫీజ్‌పేటలో మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లింది హోంగార్డే.. డీజీపీ సీరియస్

హైదరాబాద్‌ హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌ వద్ద మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనపై దక్షిణ మధ్య రైల్వే కీలక వివరణ ఇచ్చింది. మహిళపై దాడి చేసింది రైల్వే పోలీసు కాదని, తెలంగాణ పోలీస్‌ శాఖకు చెందిన హోంగార్డు అని స్పష్టం చేసింది. ఘటనపై సీరియస్‌ అయిన డీజీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాలతో హోంగార్డును సర్వీసు నుంచి తొలగించగా, మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

19 సెప్టెం, 20262 min read
హైదరాబాద్‌ NIA కోర్టు సంచలన తీర్పు..ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి నెట్టిన నిందితులకు జీవిత ఖైదు
india,national,news,telangana,international

హైదరాబాద్‌ NIA కోర్టు సంచలన తీర్పు..ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి నెట్టిన నిందితులకు జీవిత ఖైదు

హైదరాబాద్‌లోని ప్రత్యేక NIA కోర్టు 2019 నాటి అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను ఉద్యోగాల పేరుతో భారత్‌కు అక్రమంగా తరలించి, వ్యభిచారంలోకి నెట్టిన కేసులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు సహా తొమ్మిది మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది.

18 సెప్టెం, 20262 min read
ఆర్మీ ఆయుధాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు..ఎట్టకేలకు చిక్కిన రిటైర్డ్ హవల్దార్ మల్లేశ్
crime,news,telangana

ఆర్మీ ఆయుధాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు..ఎట్టకేలకు చిక్కిన రిటైర్డ్ హవల్దార్ మల్లేశ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఇటీవలే పదవీ విరమణ పొందిన హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్‌ను గుర్తించినట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రిటైర్మెంట్‌పై అసంతృప్తితో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చోరీ చేసి.. వాటిని నాగర్‌కర్నూల్‌లోని తన స్వగ్రామం, యాప్రాల్‌లోని మరో ప్రాంతంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

11 సెప్టెం, 20263 min read
బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు.. మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్? పోలీసుల తాజా క్లారిటీ ఇదే
news,telangana

బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు.. మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్? పోలీసుల తాజా క్లారిటీ ఇదే

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ కేసులో అరెస్టులపై వస్తున్న వార్తలను తెలంగాణ పోలీసులు ఖండించారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ స్పష్టం చేశారు. మరోవైపు, రెజిమెంట్ సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది.

11 సెప్టెం, 20262 min read
పక్కా ప్రణాళికతోనే శాసనసభ వద్ద బీఆర్‌ఎస్‌ నేతల హంగామా.. మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
crime,news,politics,telangana

పక్కా ప్రణాళికతోనే శాసనసభ వద్ద బీఆర్‌ఎస్‌ నేతల హంగామా.. మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

శాసనసభ వద్ద సోమవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ఫిర్యాదుల ఆధారంగా కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. భద్రతా సిబ్బందిపై దాడి, మహిళా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, బెదిరింపులు, స్పీకర్‌ను దూషించడం వంటి ఆరోపణలు కేసుల్లో నమోదయ్యాయి.

9 సెప్టెం, 20262 min read
SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో ఛాన్స్.. సెప్టెంబర్ 16 గ‌డువు పొడిగింపు
jobs,news,telangana

SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో ఛాన్స్.. సెప్టెంబర్ 16 గ‌డువు పొడిగింపు

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి కీలక శుభవార్త అందించింది. 7,437 ఎస్సై, కానిస్టేబుల్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. ముందుగా సెప్టెంబర్ 9తో ముగియాల్సిన గడువును సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

8 సెప్టెం, 20261 min read
మేం మా డ్యూటీ చేశాం.. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగలేదు: డీసీపీ శిల్పవల్లి
news,politics,telangana

మేం మా డ్యూటీ చేశాం.. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగలేదు: డీసీపీ శిల్పవల్లి

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నల్ల టీషర్టులపై అసభ్యకర పదాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఉండటంతోనే వారిని అసెంబ్లీలోకి అనుమతించలేదని తెలిపారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

7 సెప్టెం, 20262 min read
బొల్లారం ఆర్మీ క్యాంపు సమీపంలో డిటోనేటర్ల కలకలం..160 డిటోనేటర్ల స్వాధీనం
news,telangana

బొల్లారం ఆర్మీ క్యాంపు సమీపంలో డిటోనేటర్ల కలకలం..160 డిటోనేటర్ల స్వాధీనం

హైదరాబాద్‌ బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ పరిసరాల్లో డిటోనేటర్ల కలకలం రేగింది. ఫైరింగ్‌ క్యాంప్‌ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న బకెట్‌ను పోలీసులు తనిఖీ చేయగా 160 డిటోనేటర్లు బయటపడ్డాయి. దీంతో బాంబ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించి పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

3 సెప్టెం, 20261 min read
పట్టపగలు బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడా?.. పోలీసులపై బండి సంజయ్ ఫైర్
news,politics,telangana

పట్టపగలు బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడా?.. పోలీసులపై బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, బీజేపీ కార్యాలయ గేటుకు నల్ల రంగు పూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

31 ఆగ, 20261 min read
ప్రేమ విఫలమై ఏఆర్ కానిస్టేబుల్ బలవన్మరణం..స్నేహితులకు వాట్సాప్‌లో చివరి మెసేజ్
crime,news,telangana

ప్రేమ విఫలమై ఏఆర్ కానిస్టేబుల్ బలవన్మరణం..స్నేహితులకు వాట్సాప్‌లో చివరి మెసేజ్

హైదరాబాద్‌లో ప్రేమ విఫలమై ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. అంబర్‌పేటలోని తిరుమలనగర్‌కు చెందిన నిభాష్ ఓ యువతిని కొంతకాలంగా ప్రేమించారు. అయితే పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు స్నేహితులకు వాట్సాప్‌లో మెసేజ్ పంపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

31 ఆగ, 20261 min read
Social Media Image
crime,news,telangana,health

హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. ఫేక్ సర్టిఫికెట్లతో వైద్యం..11 మంది అరెస్ట్‌!

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల దందాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బట్టబయలు చేశారు. గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండానే నకిలీ సర్టిఫికెట్లతో క్లినిక్‌లు నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, ప్రిస్క్రిప్షన్‌ ప్యాడ్లు, అనుమతి లేని మందులు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

25 ఆగ, 20262 min read
కారు డిక్కీలో మహిళ మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్! కూతురి హత్యకు తండ్రే సుపారీ?
crime,telangana,news

కారు డిక్కీలో మహిళ మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్! కూతురి హత్యకు తండ్రే సుపారీ?

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

25 ఆగ, 20262 min read
Social Media Image
crime,district,news,telangana

Warangal: మద్యం మత్తులో బెటాలియన్ కానిస్టేబుల్‌ న్యూసెన్స్..లాఠీ ఝుళిపించిన పోలీసులు

వరంగల్ జిల్లా ఉర్సుగుట్టలోని ఓ బార్‌లో మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌పై బీట్ కానిస్టేబుల్ లాఠీతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బార్ సిబ్బంది 112కు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బెటాలియన్ కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, పరస్పరం చెంపదెబ్బలు తగలడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

22 ఆగ, 20261 min read
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు
news,telangana

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు

తెలంగాణ పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీస్ శాఖలోని పలు ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఉన్న ఐదేళ్ల సడలింపుతో కలిపి మొత్తం ఏడేళ్ల వరకు వయోపరిమితి రిలాక్సేషన్ లభించనుంది.

15 ఆగ, 20261 min read
తెలుగు రాష్ట్రాలకు పోలీసు పతకాల పంట.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 38 మందికి గౌరవం
national,news,andhra-pradesh,telangana

తెలుగు రాష్ట్రాలకు పోలీసు పతకాల పంట.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 38 మందికి గౌరవం

స్వాతంత్ర్య దినోత్సవం-2026 సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 38 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి పతకాలు దక్కాయి. ఏపీ నుంచి 23 మంది, తెలంగాణ నుంచి 15 మంది ఎంపికయ్యారు.

14 ఆగ, 20262 min read
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్
news,telangana

లాల్‌దర్వాజా బోనాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్‌

లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా 48 గంటల పాటు 2,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఏఐ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టామన్నారు.

9 ఆగ, 20261 min read
లోన్‌.. వర్క్‌ ఫ్రం హోం.. ఓటీపీ పేరుతో కొత్త ఎత్తులు..ఏపీకే ఫైల్‌ తెరిచారా.. ఖాతా ఖాళీ!
news,telangana

లోన్‌.. వర్క్‌ ఫ్రం హోం.. ఓటీపీ పేరుతో కొత్త ఎత్తులు..ఏపీకే ఫైల్‌ తెరిచారా.. ఖాతా ఖాళీ!

ఆదిలాబాద్‌ జిల్లాలో సైబర్‌ మోసాలపై ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ హెచ్చరించారు. ఏపీకే ఫైళ్లు, తెలియని లింకులు, లోన్‌, వర్క్‌ ఫ్రం హోం, ఓటీపీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వారంలో 38 సైబర్‌ క్రైమ్‌ ఫిర్యాదులు నమోదయ్యాయి.

8 ఆగ, 20263 min read
Janavaani Image
crime,news,telangana

తెలంగాణలో డయల్ 112 సేవల ప్రారంభం.. ఒకే నంబర్‌పై 18 అత్యవసర సేవలు

తెలంగాణలో అత్యవసర సేవలను మరింత వేగవంతం చేసే లక్ష్యంతో డయల్ 112 సేవలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం ప్రారంభించారు.

5 ఆగ, 20261 min read
ఎల్లారెడ్డిపేటలోని కిరాణ దుకాణంలో డ్రగ్స్, గంజాయిలపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు
district,news,telangana

సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు.. ఎల్లారెడ్డిపేటలో నార్కోటిక్ జాగిలంతో తనిఖీలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్‌, గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు మంగళవారం ఎల్లారెడ్డిపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నార్కోటిక్‌ జాగిలం సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

4 ఆగ, 20261 min read