విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను టాలీవుడ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రముఖ దర్శకులు కలిసి విడుదల చేశారు. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తో అనుకున్న ప్రాజెక్టులు ప్రస్తుతానికి ముందుకు వెళ్లకపోవడంతో లోకేష్ ఇప్పుడు మహేశ్ బాబుతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రాన్ని తుది దశ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసినట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా వస్తే అది టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూపించాలని తాను కోరుకుంటున్నట్లు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెలిపారు. అవకాశం వస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కోసం బుచ్చిబాబు రా అండ్ రస్టిక్ నేపథ్యంలో ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లె’ పాట పేరుతో వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. AIని దుర్వినియోగం చేసి మహిళను అవమానకరంగా చూపించడాన్ని ఖండించిన ఆయన.. వీడియోను రూపొందించిన వారితో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్ల కాగితం’ అక్టోబర్ 1 న ప్రేక్షకుల ముందుకొచ్చింది. యుక్త వయసులో ప్రేమలో పడిన ఓ జంట తొందరపాటులో చేసిన తప్పు ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అన్నది చూద్దాం.
రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. డబ్బు కోసం ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన హీరో ఆమె దెయ్యమని తెలుసుకున్న తర్వాత ఎదుర్కొన్న పరిణామాల చుట్టూ కథ సాగుతుంది. ఆసక్తికరమైన పాయింట్ ఉన్నప్పటికీ, కథనం నెమ్మదించడం, భావోద్వేగాలు బలంగా పండకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారాయి.
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి ఘన నివాళులర్పించారు. సత్యం, అహింసతో గాంధీజీ అందించిన పోరాట స్ఫూర్తిని, ‘జై జవాన్–జై కిసాన్’ నినాదంతో శాస్త్రి చూపిన దేశభక్తిని గుర్తుచేసుకుంటూ ఎక్స్ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. గతంలో తెలుగు విడుదలకు సంబంధించి త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపించిన ఈ సినిమా, కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా అక్టోబర్ 9న థియేటర్లలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అదే రోజున విడుదల కానున్న త్రివిక్రమ్ చిత్రం ‘ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47’ తో ఆసక్తికరమైన పోటీ నెలకొంది.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో మోహన్ బాబు శిఖంజా మాలిక్‌గా విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ చిట్‌చాట్ ఇంటర్వ్యూలో మోహన్ బాబు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనను ‘మోసం చేశాడంటూ’ సరదాగా వ్యాఖ్యానించారు.
‘ది ప్యారడైజ్’ సినిమా విజయంతో జోష్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు చిత్ర బృందం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా విజయోత్సాహంలో ఉన్న చిత్రబృందం మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని సందర్శించింది. హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరితో పాటు చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించింది.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.114 కోట్ల వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సినిమాను థియేటర్‌లో చూడబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సినిమాలో తెలంగాణ అంశాలు, కేసీఆర్‌ను పోలిన ప్రియదర్శి పాత్ర ఉండటంతో కేటీఆర్ సినిమా వీక్షణపై ఆసక్తి నెలకొంది.
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాపై భిన్న స్పందనలు వస్తుండగా.. నెగెటివ్ రివ్యూస్, సోషల్ మీడియా ట్రోల్స్‌పై నాని స్పందించాడు. ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలను కూడా స్వీకరిస్తానని తెలిపాడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నేళ్లుగా గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపించిన ఆయన.. తాజాగా క్లీన్ షేవ్‌తో మునుపటి కంటే యంగ్‌గా దర్శనమిచ్చారు. ‘వారణాసి’ షూటింగ్‌లో భాగంగా కాశీ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న మహేశ్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ కొత్త లుక్ వెనుక ‘వారణాసి’లోని కీలక పాత్రే కారణమా అన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది.
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాలో నాని తల్లి సమ్మక్క పాత్రలో ఆమె యంగ్ వెర్షన్‌గా కనిపించిన నటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమె సినీ నేపథ్యం ఏంటి?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ లో రష్మిక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన రష్మిక కెరీర్‌లో తొలిసారి విలన్‌గా కనిపించబోతుండటం ఆసక్తిని పెంచుతోంది.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై మిక్స్‌డ్ టాక్ కొనసాగుతుండగా.. సెకండాఫ్‌లోని కొన్ని పొలిటికల్ రిఫరెన్సులు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా కేసీఆర్‌ను పోలిన ‘శంకరన్న’ పాత్ర, ఎన్టీఆర్‌ను పోలిన మరో పాత్రపై నెటిజన్లు చర్చిస్తున్నారు.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో, కొన్ని సన్నివేశాల్లో కనిపించిన చిన్న చిన్న పొరపాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘సిగ్మా’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి వార్తలు వినిపిస్తున్న వేళ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి, మాతృత్వం విషయంలో తన ఆలోచనలను ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె బహిరంగంగా వెల్లడించింది. తల్లి కావడానికి పెళ్లి తప్పనిసరి కాదని, పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసి 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. చిరంజీవి సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న చరణ్.. 50 ఏళ్ల మైలురాయిని కలిసి జరుపుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.
‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని నేచురల్ స్టార్ నాని చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు నానిని అభినందించిన సీఎం.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. రాజకీయ ప్రస్తావనలు, వివాదాస్పద డైలాగులు, హింసాత్మక సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు మొత్తం 21 మార్పులను సూచించినట్లు సమాచారం. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్‌లో సినిమా దూసుకెళ్తోంది. నైజాంలో బుకింగ్స్ ప్రారంభమైన గంటలోనే 25 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
బ్లడ్ బ్యాంక్ పేరుతో రక్తం విక్రయిస్తున్నారంటూ తనపై వస్తున్న ఆరోపణలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమాల ద్వారా వస్తున్న తన సంపాదన తనకు సరిపోతుందని, రక్తం అమ్ముకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నానని తెలిపారు. జీవితంలో ఎదగడానికి క్రమశిక్షణ, కష్టపడే తత్వమే కారణమని, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిమానులకు సూచించారు.
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఈ మూవీ నుంచి తొలి పాట ‘నారాయణమ్మ’ను సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫోక్ టచ్‌తో సాగే ఈ మాస్ సాంగ్‌లో వెంకటేష్‌తో కలిసి శ్రీనిధి శెట్టి, డింపుల్ హయతి, నివేదా పేతురాజ్ సందడి చేయనున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. రష్మిక డిఫరెంట్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరో వెంకటేష్‌తో గతంలో చోటుచేసుకున్న విభేదాలపై సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భర్త, దర్శకుడు సెల్వమణితో సినిమా చేస్తానని చెప్పిన వెంకటేష్ ఆ తర్వాత మరో సినిమా కోసం డేట్స్ ఇవ్వడంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిపారు. అలాగే ‘పోకిరి రాజా’ సినిమా సాంగ్ రీషూట్ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని కూడా రోజా వెల్లడించారు.
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సంచలన రీతిలో దూసుకెళ్తోంది. ఆగస్టు 21న విడుదలైన ఈ సినిమా 26 రోజుల్లోనే రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. కేవలం రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో విడుదలైన ఈ మూవీ భారీ లాభాలను అందుకుంటూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మరోసారి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.