హీరో వెంకటేష్‌తో గతంలో చోటుచేసుకున్న విభేదాలపై సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భర్త, దర్శకుడు సెల్వమణితో సినిమా చేస్తానని చెప్పిన వెంకటేష్ ఆ తర్వాత మరో సినిమా కోసం డేట్స్ ఇవ్వడంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిపారు. అలాగే ‘పోకిరి రాజా’ సినిమా సాంగ్ రీషూట్ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని కూడా రోజా వెల్లడించారు.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరికొందరిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, గేటు తాళాలు పగులగొట్టి, నిర్మాణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.
విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ సినిమాపై ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన టీజర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాపై అంచనాలను పెంచగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించనున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు సినిమా విడుదల తేదీపై కూడా కొత్త ప్రచారం జరుగుతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈసారి 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లతో కలిపి మొత్తం 16 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే కంటెస్టెంట్లకు బిగ్ బాస్ టీమ్ చెల్లిస్తున్న వారపు రెమ్యునరేషన్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి హౌస్ లోకి వెళ్లిన వారి రెమ్యునరేషన్ ఎంతో ఒక్కసారి చూద్దాం.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డిజైన్ చేసిన స్పెషల్ జాకెట్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి ‘ఇరుముడి’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రవితేజ నటన, శివ నిర్వాణ దర్శకత్వంతో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు. అయితే చివర్లో “ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
రవితేజ నటించిన ‘ఇరుముడి’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న వేళ అనుకోని వివాదంలో చిక్కుకుంది. సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసింది.
ప్రముఖ సీనియర్ సినీ నటి షావుకారు జానకి అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఫిక్స్ అయింది. ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ప్రకటించిన చిత్రబృందం.. 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాప్షన్ కూడా ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.
తెలుగు సినీ పరిశ్రమలో లెజెండరీ కమెడియన్‌గా గుర్తింపు పొందిన బ్రహ్మానందం గురించి ఆయన అన్నయ్య శ్రీవదన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. బ్రహ్మానందం తనను పలకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. తనకు డబ్బు, ఆస్తులు ఏమీ అవసరం లేదని, అన్నయ్యగా ఒక్కసారి పలకరిస్తే చాలని భావోద్వేగానికి గురయ్యారు.
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రముఖులు, ఆత్మీయులు, సినీ మిత్రులకు బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. వేడుకలో ఏవైనా లోటుపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని కోరుతూ ఆయన చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్‌గా మారింది.
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. అనసూయ వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని వారు ఆరోపించారు.
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. సికింద్రాబాద్‌లోని KIMS ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం తారక్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా శబరిమల నేపథ్యంలో తెరకెక్కలేదని దర్శకుడు స్పష్టం చేశారు.
ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ తన రాజకీయ ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి పనిచేసినా తగిన గుర్తింపు దక్కలేదని, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదని తెలిపారు. రాజకీయాలకు స్వస్తి చెప్పడానికి ఇదే కారణమని వెల్లడించారు.
టాలీవుడ్‌లో విడుదలైన ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల వెనుక ఆసక్తికరమైన కథలు దాగి ఉంటాయి. కొంతమంది హీరోలు తిరస్కరించిన కథలే తర్వాత ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి జాబితాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అ..ఆ' సినిమా కూడా చేరింది. ఈ కథను ముందుగా నాగచైతన్యకు వినిపించారని, అయితే కొన్ని కారణాల వల్ల ఆయన తిరస్కరించారని సోషల్ మీడియాలో మరోసారి చర్చ సాగుతోంది.
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన 'చెన్నై లవ్ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలై 10 రోజులు పూర్తయ్యే సరికి ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బ్రేక్ ఈవెన్‌ను దాటి భారీ లాభాలు అందుకోవడంతో కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఈ చిత్రం అతిపెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచే దిశగా అడుగులు వేస్తోంది.
పాన్ ఇండియా సినిమాల హవాతో స్టార్ హీరోయిన్ల పారితోషికం కూడా భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోయిన్ తెలుగు సినిమా కోసం రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా ఆమె నిలిచే అవకాశం ఉంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
బిగ్ బాస్ తెలుగు 10పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్న వేళ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్న 90వ దశకం చాక్లెట్ బాయ్ అబ్బాస్ ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ వార్త నిజమైతే మాత్రం పదో సీజన్‌కు భారీ బూస్ట్ దక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు వినగానే భారీ బడ్జెట్ సినిమాలు, రికార్డులు తిరగరాసే వసూళ్లు గుర్తుకొస్తాయి. అయితే ఆయన సినిమాలే కాదు.. వ్యక్తిగత ఆస్తులు, లగ్జరీ లైఫ్‌స్టైల్ కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్, ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఇళ్లు, కుటుంబ వారసత్వ ఆస్తులతో ప్రభాస్ దేశంలోనే అత్యంత సంపన్న సినీ నటుల్లో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన మొత్తం ఆస్తుల విలువపై మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, ఈ పాత్ర కోసం ముందుగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఆడిషన్ ఇచ్చిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే చివరికి ఆ అవకాశం సాయి పల్లవిని వరించింది. ఈ ఆసక్తికర విషయంపై సినీ వర్గాల్లో మరోసారి చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ రాజకీయ, సినీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన కుటుంబం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి కనిపిస్తుంది. ముఖ్యంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే ఆయన సతీమణి అన్నా లెజినోవా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. రష్యన్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన అన్నా.. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే తన వ్యక్తిగత విజయాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె జీవితం, ఆస్తులు, పవన్ కళ్యాణ్‌కు అండగా నిలిచిన ప్రయాణం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
సమయానికి తీసుకున్న ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేస్తే, ఒక్కసారి మిస్ అయిన అవకాశం కూడా భారీ నష్టాన్ని మిగులుస్తుంది. అలాంటి అనుభవమే టాలీవుడ్ నటుడు పృథ్వీ జీవితంలో జరిగింది. ఒకప్పుడు కొనాలని అనుకుని చివరి నిమిషంలో వదులుకున్న భూమి నేడు వేల కోట్ల విలువ చేస్తుందని ఆయనే స్వయంగా వెల్లడించడంతో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నేపథ్యంలో చిత్రబృందం వరుసగా వీడియో సాంగ్స్‌ను విడుదల చేస్తోంది. తాజాగా అఖిల్ స్వయంగా ఆలపించిన 'బంగారం' లవ్ సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
కొన్ని నిర్ణయాలు ఆ సమయంలో సరైనవిగా అనిపించినా.. కాలం గడిచాక మాత్రం అదే నిర్ణయం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇప్పుడు హీరో సుమంత్ కూడా అలాంటి విషయాన్నే బయటపెట్టాడు. తన కెరీర్‌ను మార్చేసే రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలను తానే వదులుకున్నానని, వాటిలో ఒక సినిమా చేయకపోవడం ఇప్పటికీ బాధగా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక్క కార్యక్రమంతోనే సోషల్ మీడియాలో భారీ చర్చకు తెరలేచింది. అభిమానులతో మరింత బలమైన అనుబంధం ఏర్పరుచుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్న స్టార్ హీరోపై ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది. దీని వెనుక మరో పెద్ద ప్లాన్ ఉందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
అఖిల్ అక్కినేని కెరీర్‌లో అత్యుత్తమ ఓపెనింగ్స్ అందుకున్న 'లెనిన్' సినిమా తొలి రోజే రూ.16 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి భారీ అంచనాలు పెంచింది. మంచి టాక్‌తో విజయవంతంగా సాగినా..ప్రస్తుతం ఉన్న పోటీ పరిస్థితుల్లో రూ.100 కోట్ల క్లబ్ చేరే అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతి మణికట్టుకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తైంది. కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్య బృందం ఈ సర్జరీ నిర్వహించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సర్జరీ అనంతరం డాక్టర్లతో కలిసి దిగిన తొలి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన సినీ కెరీర్‌లో ఎదురైన ఒక షాకింగ్ ఘటనను తాజాగా గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయంలో ఒంటరిగా కారవాన్‌లో విశ్రాంతి తీసుకుంటుండగా జరిగిన సంఘటన తనను తీవ్రంగా భయపెట్టిందని ఆమె వెల్లడించారు.
టాలీవుడ్‌లో ఒక్క హిట్ చాలనడానికి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజా ఉదాహరణగా మారుతోంది. 'లెనిన్' విజయంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని, దీంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.