#X

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #X.

30 Stories

Stories tagged with #X

బన్నీ, చెర్రీలకు నో.. మహేశ్‌తో లోకేష్‌ కనగరాజ్‌ మూవీ?
cinema,entertainment,news

బన్నీ, చెర్రీలకు నో.. మహేశ్‌తో లోకేష్‌ కనగరాజ్‌ మూవీ?

తమిళ స్టార్ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌తో అనుకున్న ప్రాజెక్టులు ప్రస్తుతానికి ముందుకు వెళ్లకపోవడంతో లోకేష్‌ ఇప్పుడు మహేశ్‌ బాబుతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్‌ చేస్తున్నట్టు టాక్‌ వినిపిస్తోంది.

6 అక్టో, 20262 min read
Social Media Image
crime,news,telangana

పాత పరిచయం పేరుతో వేధింపులు.. వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడి, వీడియోలతో బెదిరింపులు

పదో తరగతిలో ఏర్పడిన పరిచయం ఓ వివాహితకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పాత పరిచయంతో ఆమెతో తరచూ మాట్లాడిన ఓ కానిస్టేబుల్ కరీంనగర్‌లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, రహస్యంగా వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడి రూ.1.30 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. చివరకు వీడియోలను భర్తకు పంపడంతో ఆమె కాపురం కూడా దెబ్బతింది.

6 అక్టో, 20261 min read
చిరంజీవి–పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో పాన్ ఇండియా సినిమా.. ఎప్పటి నుంచి అంటే?
cinema,entertainment,news

చిరంజీవి–పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో పాన్ ఇండియా సినిమా.. ఎప్పటి నుంచి అంటే?

రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కోసం బుచ్చిబాబు రా అండ్ రస్టిక్ నేపథ్యంలో ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

5 అక్టో, 20261 min read
ఢిల్లీలో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సీరియస్.. గూండాల మనసుల్లో భయం పుట్టించాలి
india,national,news,telangana,crime

ఢిల్లీలో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సీరియస్.. గూండాల మనసుల్లో భయం పుట్టించాలి

ఢిల్లీ లో వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే నేరస్థుల మనసుల్లో పోలీసులంటే భయం కలిగేలా పటిష్టమైన పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించింది. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. అసలు నేరమే జరగకుండా నిరోధించడమే ముఖ్యమని స్పష్టం చేసింది.

5 అక్టో, 20262 min read
నాకు గాడ్‌ఫాదర్లు ఎవరూ లేరు..నేను ఎవరికీ బినామీని కాదు..ఐటీ సోదాలపై రకుల్‌ప్రీత్ సింగ్ క్లారిటీ
cinema,entertainment,national,news

నాకు గాడ్‌ఫాదర్లు ఎవరూ లేరు..నేను ఎవరికీ బినామీని కాదు..ఐటీ సోదాలపై రకుల్‌ప్రీత్ సింగ్ క్లారిటీ

హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, ఆమె భర్త వసు భగ్నానీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయన్న వార్తలపై రకుల్ స్పందించింది. తాను ఎవరికీ బినామీ కాదని, తనకు కోట్ల విలువైన ఆస్తులను ఎవరూ బహుమతిగా ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేయొద్దని కోరింది.

5 అక్టో, 20261 min read
రేవంత్ కూతురు నైమిషాతో వ్యాపార భాగస్వామి దుంప శిరీష ఎవరు?..క్రిశాంక్ సంచలన ఆరోపణలు
news,politics,telangana

రేవంత్ కూతురు నైమిషాతో వ్యాపార భాగస్వామి దుంప శిరీష ఎవరు?..క్రిశాంక్ సంచలన ఆరోపణలు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల వ్యాపారాలపై బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. మెడికోవర్ హాస్పిటల్స్ సహా పలు సంస్థల్లో దుంప శిరీష పాత్ర ఏమిటని ప్రశ్నించిన ఆయన.. రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యాపారాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తన ఆరోపణలను తప్పని నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణలు చెబుతానని సవాల్ విసిరారు.

3 అక్టో, 20262 min read
హైదరాబాద్‌లో కొలువుదీరిన ‘పెన్‌ షో’..రూ.50 నుంచి రూ.7.80 లక్షల వరకు అరుదైన కలెక్షన్లు
news,telangana,special-stories

హైదరాబాద్‌లో కొలువుదీరిన ‘పెన్‌ షో’..రూ.50 నుంచి రూ.7.80 లక్షల వరకు అరుదైన కలెక్షన్లు

డిజిటల్‌ యుగంలో పెన్నుల వినియోగం తగ్గుతున్నా వాటిపై అభిమానం మాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనంగా హైదరాబాద్‌లో జరుగుతున్న ‘హైదరాబాద్‌ పెన్‌ షో-2026’ నిలుస్తోంది. రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవనంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా వచ్చిన తయారీదారులు అరుదైన, ప్రత్యేకమైన పెన్నులను ప్రదర్శిస్తున్నారు. రూ.50 నుంచి ఏకంగా రూ.7.80 లక్షల విలువైన పెన్నులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

3 అక్టో, 20262 min read
తిరుపతి శ్రీసిటీలో ఘోర ప్రమాదం.. బాయిలర్‌ పేలుడుతో ఐదుగురుకు పైగా కార్మికులు మృతి
andhra-pradesh,news

తిరుపతి శ్రీసిటీలో ఘోర ప్రమాదం.. బాయిలర్‌ పేలుడుతో ఐదుగురుకు పైగా కార్మికులు మృతి

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీ పారిశ్రామికవాడలోని టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. బాయిలర్‌ పేలిన ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు తాజా సమాచారం. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. రెస్క్యూ, పోలీసు, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

3 అక్టో, 20262 min read
ఏపీ మీదుగా మరో వందేభారత్ స్లీపర్ రైలు.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
india,indian-railway,news,national

ఏపీ మీదుగా మరో వందేభారత్ స్లీపర్ రైలు.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

బెంగళూరు–ముంబై నగరాల మధ్య మరో కీలక రైలు సర్వీసు అందుబాటులోకి రానుంది. కేఎస్ఆర్ బెంగళూరు–ముంబై సీఎస్ఎంటీ మధ్య వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించనుండగా రాష్ట్రంలో అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఆగనుంది.

3 అక్టో, 20262 min read
తడబాటు లేకుండా డబుల్ స్పీడ్‌లో హనుమాన్ చాలీసా.. అమెరికన్ యువకుడి పఠనం వైరల్!
international,news,spiritual

తడబాటు లేకుండా డబుల్ స్పీడ్‌లో హనుమాన్ చాలీసా.. అమెరికన్ యువకుడి పఠనం వైరల్!

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన నిక్ డీర్‌మన్ హనుమాన్ చాలీసాను అత్యంత వేగంగా, స్పష్టంగా పఠించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలాంటి తడబాటు లేకుండా డబుల్ స్పీడ్‌లో చాలీసాను చదివిన ఆయన ఏకాగ్రత, ఉచ్చారణపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

3 అక్టో, 20261 min read
పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. ప్రియుడి కోసం భర్తనే హత్య చేయించిన భార్య
crime,news,telangana

పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. ప్రియుడి కోసం భర్తనే హత్య చేయించిన భార్య

భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. పురుగుల మందు కలిపిన మద్యం తాగించి హత్య చేసిన అనంతరం.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారు. అయితే మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

2 అక్టో, 20262 min read
మహనీయులకు మెగాస్టార్ ఘన నివాళి.. ఏమన్నారంటే?
cinema,news,entertainment

మహనీయులకు మెగాస్టార్ ఘన నివాళి.. ఏమన్నారంటే?

జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి ఘన నివాళులర్పించారు. సత్యం, అహింసతో గాంధీజీ అందించిన పోరాట స్ఫూర్తిని, ‘జై జవాన్–జై కిసాన్’ నినాదంతో శాస్త్రి చూపిన దేశభక్తిని గుర్తుచేసుకుంటూ ఎక్స్ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

2 అక్టో, 20261 min read
‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. త్రివిక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ క్లాష్
cinema,entertainment

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. త్రివిక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ క్లాష్

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. గతంలో తెలుగు విడుదలకు సంబంధించి త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపించిన ఈ సినిమా, కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా అక్టోబర్ 9న థియేటర్లలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అదే రోజున విడుదల కానున్న త్రివిక్రమ్ చిత్రం ‘ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47’ తో ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

2 అక్టో, 20262 min read
ఆరు గ్యారెంటీలను పక్కనపెట్టి దేవుళ్లపై చర్చ ఎందుకు?: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
news,politics,telangana

ఆరు గ్యారెంటీలను పక్కనపెట్టి దేవుళ్లపై చర్చ ఎందుకు?: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాముడు, శివుడి విషయంలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టకుండా మతాలు, దేవుళ్ల అంశాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు.

1 అక్టో, 20261 min read
174 మందిని కాపాడిన ‘రియల్ హీరో’..భారత పైలట్ సాహసానికి మోదీ ప్రశంసలు
international,news,national

174 మందిని కాపాడిన ‘రియల్ హీరో’..భారత పైలట్ సాహసానికి మోదీ ప్రశంసలు

దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో కో-పైలట్‌ కత్తితో దాడి చేయడంతో విమానం ప్రమాదకరంగా కిందికి పడిపోయింది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యంగా ప్రతిఘటించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఆయన అసాధారణ సాహసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసించారు.

1 అక్టో, 20262 min read
డాలర్, పౌండ్, యూరో కాదు..ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఇదే!
international,news,special-stories,world

డాలర్, పౌండ్, యూరో కాదు..ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఇదే!

ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ అనగానే చాలామందికి అమెరికా డాలర్, బ్రిటన్ పౌండ్ లేదా యూరో గుర్తుకొస్తాయి. కానీ యూనిట్ మారకం విలువ పరంగా వీటన్నింటినీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది కువైట్ దీనార్.

30 సెప్టెం, 20262 min read
జాకీ చాన్ మరణించారంటూ వైరల్.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్
international,news

జాకీ చాన్ మరణించారంటూ వైరల్.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్

హాలీవుడ్ స్టార్, మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ జాకీ చాన్ మరణించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఫ్యాక్ట్ చెక్ నివేదికలు వెల్లడించాయి. ‘1954–2026’ అంటూ ఆయన ఫొటోలతో వైరల్ అయిన పోస్టులు అభిమానుల్లో ఆందోళన రేపినా జాకీ చాన్ క్షేమంగా ఉన్నట్లు ధృవీకరణలు వెలువడ్డాయి.

29 సెప్టెం, 20261 min read
బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష
crime,news,telangana

బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష

హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌ పరిధిలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఎల్‌.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా రేప్‌, పోక్సో కేసుల ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. నిందితుడికి రూ.25,500 జరిమానాతో పాటు బాధితుడికి రూ.2 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.

29 సెప్టెం, 20262 min read
వందే భారత్ రైల్లో హీరోయిన్ ఫుడ్ రివ్యూ.. 'సఖియా' వీడియో వైరల్
cinema,indian-railway,news,national,entertainment

వందే భారత్ రైల్లో హీరోయిన్ ఫుడ్ రివ్యూ.. 'సఖియా' వీడియో వైరల్

తెలుగులో ‘సఖియా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి నౌహీద్ సైరసి మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబై నుంచి గోవాకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఆమె.. 8 గంటల జర్నీలో రైల్వే శాఖ అందించిన ఆహారానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్, డెజర్ట్ వరకు తనకు అందించిన ఫుడ్‌ను వీడియోలో చూపించడంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

24 సెప్టెం, 20262 min read
NEET PG 2026 ఫలితాలు విడుదల.. ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి!
education,national,news

NEET PG 2026 ఫలితాలు విడుదల.. ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి!

NEET PG 2026 Results: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) NEET PG 2026 ఫలితాలను సెప్టెంబర్ 24న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు, ర్యాంకును చెక్ చేసుకోవచ్చు.

24 సెప్టెం, 20261 min read
Tekkali Train Accident Four Inter Students Killed One Injured
andhra-pradesh,indian-railway,news

ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి..సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రావివలస-బర్మా కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులను రాజధానిఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

23 సెప్టెం, 20261 min read
జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 బెంజ్ కార్లు కాలి బూడిద
india,national,news

జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 బెంజ్ కార్లు కాలి బూడిద

రాజస్థాన్‌లోని జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీతాపుర ప్రాంతంలోని బాలాజీ మార్కెట్‌లో ఉన్న ఓ మెర్సిడెస్ బెంజ్ కార్ల వర్క్‌షాప్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 8 లగ్జరీ కార్లు, కార్ల విడిభాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మరిన్ని కార్లు మంటలకు ఆహుతి కాకుండా కాపాడారు.

23 సెప్టెం, 20261 min read
ట్రంప్‌కు అమెరికా టీవీ చానళ్ల షాక్.. అధికారిక కార్యక్రమాలకు నో కవరేజీ
news,international,politics

ట్రంప్‌కు అమెరికా టీవీ చానళ్ల షాక్.. అధికారిక కార్యక్రమాలకు నో కవరేజీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రముఖ టెలివిజన్‌ వార్తా సంస్థలు షాక్‌ ఇచ్చాయి. అధ్యక్ష భవనం కార్యకలాపాలను కవర్‌ చేసే మీడియా సంస్థలపై ట్రంప్‌ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిరసిస్తూ అధ్యక్షుడి అధికారిక కార్యక్రమాలు, పర్యటనలకు కవరేజీ ఇవ్వకూడదని టెలివిజన్‌ పూల్‌ కన్సార్టియం నిర్ణయించింది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ట్రంప్‌ పాల్గొనే కార్యక్రమాలకు కూడా ఈ నిర్ణయం వర్తించనుంది.

22 సెప్టెం, 20261 min read
Socil Media Image
crime,india,national,news

ఢిల్లీలో దారుణం..చేతులు, కాళ్లు కట్టేసి 11 ఏళ్ల బాలికపై అత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీలో 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. సదర్‌ బజార్‌ ప్రాంతంలో పెన్సిల్‌, పెన్ను వంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన బాలికను ఓ వ్యక్తి మాయమాటలతో దుకాణంలోకి తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

21 సెప్టెం, 20261 min read
AI Genareted
news,education,crime,national

స్టూడెంట్ సాహిల్ ఆత్మహత్యతో రగిలిన IIT బాంబే.. ప్రొఫెసర్ స‌స్పెండ్‌

ముంబైలోని IIT బాంబేలో బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడ్ ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరీక్షలో మొబైల్ ఫోన్, చాట్‌జీపీటీ వినియోగం వ్యవహారం తర్వాత సాహిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన కుమారుడిని ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల వేధించారని, కుల వివక్షకు గురి చేశారని సాహిల్ తండ్రి ఆరోపించారు. దీంతో విద్యార్థులు మూడు రోజులుగా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు పెట్టిన 18 డిమాండ్లపై IIT బాంబే డైరెక్టర్ అంగీకారం తెలిపారు. దూళ్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆయనపై సంస్థ చర్యలు చేపట్టింది.

21 సెప్టెం, 20262 min read
మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. రీఛార్జ్ ధరలు తగ్గే అవకాశం ఎందుకంటే?
business,india,national,news,technology

మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. రీఛార్జ్ ధరలు తగ్గే అవకాశం ఎందుకంటే?

పెరిగిన మొబైల్ రీఛార్జ్ ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. టెలికాం కంపెనీలు చెల్లించే లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల భారాన్ని తగ్గించే ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థల రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.

19 సెప్టెం, 20262 min read
పరీక్షలో ChatGPT వాడుతూ దొరికిన విద్యార్థి..IIT Bombay లో స్టూడెంట్ ఆత్మహత్య
crime,india,national,news

పరీక్షలో ChatGPT వాడుతూ దొరికిన విద్యార్థి..IIT Bombay లో స్టూడెంట్ ఆత్మహత్య

ముంబైలోని పవాయ్‌లో ఉన్న ఐఐటీ బాంబే క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల సాహిల్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల జరిగిన పరీక్షలో మొబైల్ ఫోన్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని ChatGPTలో అప్‌లోడ్ చేసి సమాధానాలు వెతికినట్లు ఆరోపణలు రావడం, అనంతరం క్యాంపస్‌లో ఈ విషయంపై ప్రచారం జరగడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.

19 సెప్టెం, 20261 min read
విభిన్నమైన కథ.. భారీ టైటిల్..హర్ష సినిమా ఎలా ఉందంటే!
cinema,entertainment,news

విభిన్నమైన కథ.. భారీ టైటిల్..హర్ష సినిమా ఎలా ఉందంటే!

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళీ, కబీర్, డోల్ రవి మొదలగువారు’. చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో సీపీఐ నేత కె. రామకృష్ణ కుమారుడు హర్ష హీరోగా పరిచయమయ్యారు. 1995 నేపథ్యంలో మిస్టరీ, మ్యూజిక్, ప్రేమ, స్నేహం చుట్టూ సాగే ఈ సినిమా ఎలా ఉందంటే..

18 సెప్టెం, 20263 min read
iPhone 18 Pro కోసం ఢిల్లీలో  అర్ధరాత్రి నుంచే క్యూ.. భారీగా పెరిగిన క్రేజ్!
india,national,news,technology

iPhone 18 Pro కోసం ఢిల్లీలో అర్ధరాత్రి నుంచే క్యూ.. భారీగా పెరిగిన క్రేజ్!

యాపిల్‌ కొత్తగా తీసుకొచ్చిన iPhone 18 Pro, iPhone 18 Pro Max స్మార్ట్‌ఫోన్ల సాధారణ విక్రయాలు శుక్రవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. భారత్‌లోనూ ఉదయం 8 గంటల నుంచి ప్రీ-ఆర్డర్‌ చేసిన కస్టమర్లకు డెలివరీలు మొదలయ్యాయి. యాపిల్‌ స్టోర్లతోపాటు ప్రముఖ రిటెయిల్‌ స్టోర్ల వద్ద కొత్త ఐఫోన్‌ల కోసం టెక్ ప్రియులు భారీగా క్యూ కట్టారు.

18 సెప్టెం, 20262 min read
X Image
india,national,news

ఆరు నెలల చిన్నారిపై కుక్క దాడి.. తల్లి చేతుల్లోంచి పసికందును లాక్కెళ్లిన పిట్‌బుల్

హర్యానాలోని సోనిపట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి చేతుల్లో ఉన్న ఆరు నెలల పసికందుపై పిట్‌బుల్ కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. చిన్నారిని నోట కరుచుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

18 సెప్టెం, 20261 min read