
తెలంగాణలో కరెంట్ బిల్లులు పెరగనున్నాయి..నవంబర్ నుంచి కొత్త ఛార్జీలు
తెలంగాణ విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడనుంది. గత ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ కొనుగోలు వ్యయం, ఆదాయ లోటును సర్దుబాటు చేసేందుకు రూ.5,420.23 కోట్ల ట్రూఅప్ ఛార్జీలను వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) డిస్కంలకు అనుమతి ఇచ్చింది. నవంబర్‌లో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.




























