ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌ల బదిలీ చేపట్టింది. 22 మంది ఐఏఎస్‌ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

7 ఆగస్టు, 2026 10:31 PM•ByRalin

Share this article

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్!

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్!

AP IAS Transfers | అమరావతి, ఆగస్టు 7 (జనవాణి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌ల బదిలీ చేపట్టింది. 22 మంది ఐఏఎస్‌ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

దీని ప్రకారం.. ఏపీసీపీడీసీఎల్ సీఎండీగా శివశంకర్ లోతేటిని.. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా జిలానీ సమూన్‌ను.. ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా ఎస్. దిల్లీరావు.. సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా కేఎస్ విశ్వనాథ్‌ను నియమించింది. జిల్లాల స్థాయిలోనూ పలువురు జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు కొత్త పోస్టింగ్ కల్పించింది. అయితే, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఆమ్రపాలిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం కొత్త పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. సాధారణ పరిపాలన శాఖ (GAD) రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆమ్రపాలి స్థానంలో పట్టంశెట్టటి రవి సుభాష్‌ను ఏపీటీడీసీ ఎండీగా నియమించారు. అదనంగా ఏపీపీఎస్సీలో సీఈవో, సెక్రటరీ పోస్టులకు కూడా ఆయన FAC బాధ్యతలు అప్పగించారు.

IAS అధికారుల బదిలీల జాబితా

  1. ఎస్‌.ఎస్‌. రావత్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

  2. జె. శ్యామలరావు – పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

  3. కోనా శశిధర్ – రవాణా, రోడ్లు–భవనాల శాఖ కార్యదర్శి

  4. ఎం. శివ ప్రసాద్ (IFS) – APSRTC జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్

  5. ఆమ్రపాలి కాటా – GADకు రిపోర్ట్ చేయాలి (పోస్టింగ్ పెండింగ్)

  6. పట్టన్‌శెట్టి రవి సుభాష్ – APTDC మేనేజింగ్ డైరెక్టర్, APPSC సెక్రటరీ, CEO (FAC)

  7. ఎస్‌. సురేష్ కుమార్ – గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి

  8. డా. నారాయణ భరత్ గుప్తా – గోదావరి పుష్కరాల జాయింట్ స్పెషల్ ఆఫీసర్

  9. ముత్యాలరాజు రేవు – పురావస్తు, మ్యూజియంల కమిషనర్

  10. కేవీఎన్ చక్రధర బాబు – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌, NHM ఎండీ (FAC)

  11. హెప్సిబా రాణి కొర్లపాటి – హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, AP Housing Corporation VC & MD (FAC)

  12. పి. అరుణ్ బాబు – డైరెక్టర్ జనరల్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్

  13. ఎన్‌. తేజ్ భరత్ – VMRDA కమిషనర్ బాధ్యతల నుంచి రిలీవ్

  14. ప్రఖర్ జైన్ – VMRDA కమిషనర్

  15. గీతాంజలి శర్మ – AP State Fibernet MD (FAC: CEO, RTGS)

  16. చేతన్ టి.ఎస్‌. – డైరెక్టర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (FAC)

  17. డా. ఎ. శరత్ (రిటైర్డ్ IAS) – టీటీడీ జాయింట్ ఈవోగా కొనసాగింపు

  18. ప్రభల గోపీనాథ్ – టీటీడీ జాయింట్ ఈవో (హెల్త్ & ఎడ్యుకేషన్)

  19. ఎ.ఎ.ఎల్‌. పద్మావతి – NTR వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ

  20. ఎం. జయకృష్ణ – తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్

  21. బి. అనిల్ కుమార్ రెడ్డి – AP స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్

  22. బి. సునీల్ కుమార్ రెడ్డి (IFS) – AP స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (FAC)

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు