శ్రీకాకుళం (ఆంధ్రప్రదేశ్), జూలై 22: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక కేసులో వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుని, యజమానులు గుర్తించని మొత్తం 7 మోటార్‌సైకిళ్లను ఈ నెల జూలై 28న ఉదయం 9 గంటల నుంచి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఎస్సై హరికృష్ణ తెలిపారు.
వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు తమ ఆధార్ కార్డుతో నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు. వేలానికి సంబంధించిన ఇతర వివరాల కోసం శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.




















