పవన్ కల్యాణ్ కోసం ఆలయాల్లో అన్నా లెజినోవా పూజలు...పిఠాపురం, ద్రాక్షారామంలో ప్రత్యేక దర్శనాలు

శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పిఠాపురం, ద్రాక్షారామంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, భీమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

14 ఆగస్టు, 2026 6:19 PM•ByNarender Kumar Nangunoori

Share this article

పవన్ కల్యాణ్ కోసం ఆలయాల్లో అన్నా లెజినోవా పూజలు...పిఠాపురం, ద్రాక్షారామంలో ప్రత్యేక దర్శనాలు

కాకినాడ జిల్లా, ఆగస్టు 14 (జనవాణి): శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పిఠాపురం నియోజకవర్గంలోని పలు ఆలయాలను సందర్శించారు. పాదగయ క్షేత్రంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని కూడా అన్నా లెజినోవా సందర్శించారు. ఆ తర్వాత ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, జనసేన ఇన్‌ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇటీవల పవన్ కల్యాణ్ ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అన్నా లెజినోవా ఏపీలోని పలు ప్రముఖ ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం తిరుమల శ్రీవారిని కూడా ఆమె దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు