అరుదైన వృక్ష జాతి మొక్కకు పేరు పెట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కకు ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ (Euphorbiaceae) కుటుంబానికి చెందిన ఈ కొత్త జాతికి “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” (Croton Ubbalamadugensis) అని పేరు పెట్టారు.

29 జులై, 2026 5:04 PM•ByRamchandram

Share this article

అరుదైన వృక్ష జాతి మొక్కకు పేరు పెట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కకు ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ (Euphorbiaceae) కుటుంబానికి చెందిన ఈ కొత్త జాతికి “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” (Croton Ubbalamadugensis) అని పేరు పెట్టారు.

ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండల ప్రాంతం ఈ మొక్కకు సహజ ఆవాసంగా ఉండటంతో, ఆ ప్రాంత పర్యావరణ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. అద్భుతమైన సుగంధ పరిమళాలను వెదజల్లే ఆకులు కలిగిన ఈ మొక్క ప్రత్యేకతలు పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకున్నాయి. ప్రధాన అటవీ సంరక్షణాధికారి (PCCF) పీవీ చలపతిరావు తన పరిశోధనా సహచరులతో కలిసి తూర్పు కనుమల్లో నిర్వహించిన విస్తృత వృక్షశాస్త్ర పరిశోధనల సందర్భంగా ఈ కొత్త జాతి మొక్కను గుర్తించారు. శాస్త్రీయ పరిశీలనల్లో, సమీప సంబంధిత జాతి అయిన క్రోటన్ అరోమాటికస్ (Croton aromaticus) తో పోలిస్తే ఈ మొక్క ప్రత్యేకమైన నిర్మాణం, పునరుత్పత్తి లక్షణాలను కలిగి ఉన్నట్లు నిర్ధారించారు.

ఈ ఆవిష్కరణ తూర్పు కనుమల అపార జీవ వైవిధ్య సంపదను ప్రతిబింబించడమే కాకుండా, ఆ ప్రాంతంలో మరింత లోతైన శాస్త్రీయ పరిశోధనల ఆవశ్యకతను చాటింది. అత్యంత పరిమిత ప్రాంతంలో మాత్రమే కనిపించడం, సహజ ఆవాసాలపై పెరుగుతున్న ముప్పు క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ జాతిని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతిగా పరిశోధకులు గుర్తించారు. ఈ శాస్త్రీయ ఆవిష్కరణలు జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, రాష్ట్ర సహజ వారసత్వ సంపద సంరక్షణ పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు