హస్తకళలకు క్యూఆర్ కోడ్.. పవన్ కల్యాణ్ సూచనతో ప్రత్యేక లేపాక్షి వినూత్న కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారులకు తగిన గుర్తింపు కల్పించేందుకు లేపాక్షి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రాష్ట్ర హస్తకళా అభివృద్ధి సంస్థ దేశంలో తొలిసారిగా హస్తకళా ఉత్పత్తులకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనుంది.

6 ఆగస్టు, 2026 5:07 PM•ByRalin

Share this article

హస్తకళలకు క్యూఆర్ కోడ్.. పవన్ కల్యాణ్ సూచనతో ప్రత్యేక లేపాక్షి వినూత్న కార్యక్రమం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారులకు తగిన గుర్తింపు కల్పించేందుకు లేపాక్షి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రాష్ట్ర హస్తకళా అభివృద్ధి సంస్థ దేశంలో తొలిసారిగా హస్తకళా ఉత్పత్తులకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనుంది.

ఇటీవల నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం సందర్భంగా ప్రతి కళాఖండానికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆయన ఆదేశాల మేరకు నెల రోజుల వ్యవధిలోనే ఈ విధానాన్ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

స్కాన్ చేస్తే పూర్తి సమాచారం

హస్తకళా ఉత్పత్తిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేస్తే ఆ కళాఖండానికి సంబంధించిన పూర్తి వివరాలు క్షణాల్లో అందుబాటులోకి వస్తాయి. వస్తువు చరిత్ర, సాంస్కృతిక విశిష్టత, తయారు చేసిన కళాకారుడి పేరు, వారి నైపుణ్యం, తయారీకి ఉపయోగించిన ముడిసరుకు, పట్టిన సమయం, వస్తువు కొలతలు వంటి వివరాలతో పాటు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్), 'ఒక జిల్లా–ఒక ఉత్పత్తి' (ODOP) గుర్తింపు ఉందా అనే సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

తొలి దశలో 8 హస్తకళా ఉత్పత్తులు

మొదటి దశలో రాష్ట్రంలోని ఎనిమిది ప్రముఖ హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ ప్రొఫైల్స్‌ను కేటాయించారు. వీటిలో బొబ్బిలి వీణ, కలంకారి సంపూర్ణ రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణలీలా, మత్స్యావతారం చిత్రాలు, సవర ఆదివాసి పెయింటింగ్స్ ఉన్నాయి. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని హస్తకళా ఉత్పత్తులు, కళాకారుల క్లస్టర్లకు ఈ విధానాన్ని విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

నకిలీలకు చెక్.. కళాకారులకు గుర్తింపు

ఈ విధానం ద్వారా హస్తకళా ఉత్పత్తుల అసలుదనాన్ని సులభంగా నిర్ధారించడంతో పాటు నకిలీ ఉత్పత్తులను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రపంచ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు మరింత గుర్తింపు లభించడంతో పాటు కళాకారుల ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు