బ్రహ్మానందం పలకరింపుకోసం ఎదురుచూస్తున్నసొంత అన్నయ్య.. పట్టించుకోవట్లేదు అంటూ శ్రీవదన్ ఎమోషనల్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమలో లెజెండరీ కమెడియన్‌గా గుర్తింపు పొందిన బ్రహ్మానందం గురించి ఆయన అన్నయ్య శ్రీవదన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. బ్రహ్మానందం తనను పలకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. తనకు డబ్బు, ఆస్తులు ఏమీ అవసరం లేదని, అన్నయ్యగా ఒక్కసారి పలకరిస్తే చాలని భావోద్వేగానికి గురయ్యారు.

19 ఆగస్టు, 2026 3:30 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బ్రహ్మానందం పలకరింపుకోసం ఎదురుచూస్తున్నసొంత అన్నయ్య.. పట్టించుకోవట్లేదు అంటూ శ్రీవదన్ ఎమోషనల్ కామెంట్స్

AI

తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా తన అద్భుతమైన కామెడీతో నవ్వించిన లెజెండరీ నటుడు బ్రహ్మానందం. గత కొంతకాలంగా సినిమాల్లో అడపాదడపా మాత్రమే కనిపిస్తున్న ఆయన.. తాజాగా మరో కారణంతో వార్తల్లో నిలిచారు. బ్రహ్మానందం సొంత అన్నయ్య శ్రీవదన్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీవదన్ మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం అని, వారిలో నలుగురు చనిపోయారని తెలిపారు. ప్రస్తుతం తాను, బ్రహ్మానందం మాత్రమే ఉన్నామని చెప్పారు. తాను ఒంటరిగా జీవిస్తున్నానని, తన కుమార్తెలు ఆహారం అందిస్తున్నారని వివరించారు.

బ్రహ్మానందం ఎప్పుడైనా కనీసం పలకరిస్తాడేమో అని ఎదురుచూస్తున్నాను. షూటింగ్ లేని సమయంలో రోజులో ఒక్క నిమిషం అయినా ఫోన్ చేసి ‘అన్నయ్య ఎలా ఉన్నావు?’ అని అడిగితే చాలు. నాకు ఆయన దగ్గర నుంచి డబ్బులు ఏమీ అవసరం లేదు. కేవలం పలకరింపు చాలు అంటూ శ్రీవదన్ భావోద్వేగానికి గురయ్యారు.

ఇటీవల బ్రహ్మానందం తమ ఊరికి వచ్చినట్లు తెలిసిందని, అయితే తాను చిన్నగా నడవడం వల్ల అక్కడికి వెళ్లలేకపోయానని చెప్పారు. కనీసం తాను ఉన్న చోటుకు వచ్చి పలకరించి వెళ్తే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే శ్రీవదన్ చేసిన వ్యాఖ్యలపై బ్రహ్మానందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన వెలువడలేదు. మరి ఈ విషయంపై ఆయన స్పందిస్తారా? తన అన్నయ్యను కలుస్తారా.. చూడాలి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు