పవన్ కళ్యాణ్ చొరవతో ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు

ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.12.60 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ కీలక పాత్ర పోషించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

4 ఆగస్టు, 2026 10:30 PM•ByRalin

Share this article

పవన్ కళ్యాణ్ చొరవతో ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు

అమరావతి, ఆగస్టు 4 (జనవాణి): ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.12.60 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ కీలక పాత్ర పోషించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కల్యాణ్ చేపట్టిన జనవాణి, వారాహి యాత్రల సందర్భంగా ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తరగతి గదుల కొరత, చెట్ల కింద విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి, దృష్టిలోపం ఉన్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి విద్యార్థి సంఘాలు తీసుకెళ్లాయి. ఆ సమయంలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ఆయన హామీ ఇచ్చారు.

ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ చొరవతో కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం రూ.12.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీంతో చాలా కాలంగా మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఊరట లభించనుంది.

ఈ సందర్భంగా ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

▶CategoriesAndhra-pradesh and News
▶Follow us onFacebook, Twitter & Instagram.
Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు