కళాకారుల కళ్లలో వెలుగు నింపుతున్న ఏపీ ప్రభుత్వం.. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు

హస్తకళాకారుల చేతుల్లో కళ చిరకాలం నిలవాలంటే వారి కళ్ల ఆరోగ్యం అత్యంత కీలకమనే భావనతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 143 మంది లేస్, నేత కళాకారులకు కంటి పరీక్షలు నిర్వహించగా, 15 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు.

31 జులై, 2026 10:01 PM•ByLaharika

Share this article

కళాకారుల కళ్లలో వెలుగు నింపుతున్న ఏపీ ప్రభుత్వం.. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు

ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం సందర్భంగా హస్తకళాకారులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే కొండపల్లి, నరసాపురం, పాలకొల్లు, బొబ్బిలి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించిన ప్రభుత్వం.. గురువారం పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో లేస్, నేత కళాకారుల కోసం ప్రత్యేక ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

శిబిరంలో మొత్తం 143 మంది కళాకారులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 15 మందికి క్యాటరాక్ట్ (ముత్యబిందు) శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. వారికి త్వరలోనే ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే 110 మంది కళాకారులకు కళ్లద్దాలు అవసరమని నిర్ధారించగా, వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించనున్నారు. మరో 18 మందికి అవసరమైన మందులను అక్కడికక్కడే ఉచితంగా పంపిణీ చేశారు.

హస్తకళాకారుల ఆరోగ్యమే వారి కళకు బలమనే భావనతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కంటి పరీక్షల నుంచి అవసరమైన మందులు, కళ్లద్దాలు, శస్త్రచికిత్సల వరకు పూర్తిస్థాయి వైద్య సహాయాన్ని ఉచితంగా అందిస్తూ కళాకారులకు ఆరోగ్య భరోసా కల్పిస్తోంది.

ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా హస్తకళాకారులు ఆరోగ్యవంతంగా తమ వృత్తిని కొనసాగించేందుకు, సంప్రదాయ కళలను పరిరక్షించేందుకు తోడ్పాటు అందుతుందని అధికారులు తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు