పిఠాపురం, సెప్టెంబర్ 02 (జనవాణి): జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరును ఖరారు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆడియో సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత రెండు మూడు నెలలుగా ఆరోగ్య సమస్యల కారణంగా పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారని తెలిపారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నా ప్రజల గురించి ఆలోచిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించిందని మనోహర్ అన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను ఎదుర్కొని కూటమి విజయానికి జనసేన పార్టీ కీలకంగా పనిచేసిందని తెలిపారు. యువతను పార్టీతో మరింతగా అనుసంధానం చేయడం, ప్రజా సమస్యలపై చురుగ్గా పనిచేసేలా వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా ‘జై కొట్టు’ యువజన విభాగాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
Loading Tweet...




















