మాజీ మంత్రి కారుమూరికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

ఏపీ మద్యం రవాణా కేసులో అరెస్టైన మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్‌లోని ఈడీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ్ విధించడంతో కారుమూరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

24 ఆగస్టు, 2026 6:29 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మాజీ మంత్రి కారుమూరికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనవాణి): ఏపీ మద్యం రవాణా కేసులో అరెస్టైన మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్‌లోని ఈడీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ స్నేహితుడి ఇంట్లో కారుమూరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈడీ కార్యాలయం నుంచి కోర్టుకు తరలించారు. కోర్టు విచారణ అనంతరం రెండు వారాల రిమాండ్ విధించడంతో కారుమూరి నాగేశ్వరరావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో కారుమూరితో పాటు ఆయన కుమారుడు సునీల్ కుమార్ కూడా నిందితుడిగా ఉన్నారు. సునీల్ కుమార్‌ను గత జూన్‌లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కూటమి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. దర్యాప్తులో మద్యం ధరల నిర్ణయం, లైసెన్సులు, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం దుకాణాలకు సరఫరా వంటి అంశాల్లో అక్రమాలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో రెండు కేసులు నమోదు కాగా.. నిధుల మళ్లింపుపై ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా కారుమూరి సునీల్ కుమార్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డి, విజయ నరసింహారెడ్డి, సందీప్ తదితరులకు సంబంధించిన ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో రెండు రోలెక్స్ వాచీలు, రేంజ్ రోవర్ కారు సహా పలు కీలక వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కారుమూరి సునీల్ కుమార్ ఇంట్లో మద్యం రవాణాకు సంబంధించిన జాయింట్ వెంచర్ ఒప్పందం కాపీ లభించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. అలాగే కారుమూరి నాగేశ్వరరావుకు రూ.15 కోట్లు ముట్టినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డిలను జూన్ 11న, కారుమూరి సునీల్ కుమార్‌ను జూన్ 18న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేయడంతో కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు