వ్యవసాయ డిప్లొమా కోర్సులకు స్పెషల్‌, స్పాట్‌ కౌన్సెలింగ్.. ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ కీలక ప్రకటన

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న రెండేళ్ల వ్యవసాయ, విత్తన సాంకేతిక, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులతో పాటు మూడేళ్ల వ్యవసాయ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం స్పెషల్‌ కేటగిరి, మాన్యువల్‌ మాప్‌అప్‌, చివరి విడత స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డా. ఎ. మణి తెలిపారు.

4 ఆగస్టు, 2026 2:41 PM•ByRalin

Share this article

వ్యవసాయ డిప్లొమా కోర్సులకు స్పెషల్‌, స్పాట్‌ కౌన్సెలింగ్.. ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ కీలక ప్రకటన

గుంటూరు, ఆగస్టు 4: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న రెండేళ్ల వ్యవసాయ, విత్తన సాంకేతిక, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులతో పాటు మూడేళ్ల వ్యవసాయ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం స్పెషల్‌ కేటగిరి, మాన్యువల్‌ మాప్‌అప్‌, చివరి విడత స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డా. ఎ. మణి తెలిపారు.

ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 10న స్పెషల్‌ కేటగిరి, మాన్యువల్‌ మాప్‌అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న లేదా నమోదు చేసుకోని అభ్యర్థుల కోసం ఆగస్టు 14న చివరి విడత స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

కౌన్సెలింగ్‌ కార్యక్రమం గుంటూరులోని లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం (RARS)లోని కృష్ణా ఆడిటోరియంలో నిర్వహిస్తామని తెలిపారు. అర్హత, సీట్ల వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలు తదితర పూర్తి సమాచారానికి విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు