నెల్లూరు వైసీపీ దీక్షలో శ్రీవారి గోవింద నామాల పేరడీ..పవన్ కళ్యాణ్ ఆగ్రహం

నెల్లూరులో వైసీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన దైవ నామాలు, భక్తి గీతాలను అపహాస్యం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు.

10 ఆగస్టు, 2026 5:29 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నెల్లూరు వైసీపీ దీక్షలో శ్రీవారి గోవింద నామాల పేరడీ..పవన్ కళ్యాణ్ ఆగ్రహం

AI Image

నెల్లూరు,ఆగస్టు10(జనవాణి): 2025 జరిపిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు వివాదాస్పదంగా మారాయి. ఈ రిలే నిరాహార దీక్షలలో వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి.. శ్రీవారి గోవింద నామాలను అపహాస్యం చేశారని కూటమి శ్రేణులు, సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఆరోపిస్తున్నారు. పవిత్రమైన శ్రీవారి గోవింద నామాలు, భక్తి గీతాలను పేరడీ చేసి పాడుతూ అపహాస్యం చేశారంటూ.. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. పవిత్రమైన దైవ నామాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించి అపహాస్యం చేయడం సరికాదని స్పష్టం చేశారు.

భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని భక్తితో కొలుస్తూ ఆలపించే గోవింద నామాలు, భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం పేరడీ చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తితో కొలిచే మంత్రాలు, నామాలు, స్తోత్రాలు, కీర్తనలను అపహాస్యం చేసే విధానాన్ని ప్రతి ఒక్కరూ విడిచిపెట్టాలని సూచించారు. రాజకీయ కార్యక్రమాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడి భక్తుల మనోభావాలను కించపరచడం తగదని పేర్కొన్నారు.

Loading Tweet...

చట్టపరంగా ముందుకెళ్లాలని జనసేనకు సూచన

ఈ చర్యలు ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మతపరమైన విద్వేషాలు రేపే కుట్రపూరిత ఆలోచనలతో ఇలాంటి చర్యలు జరిగాయనే అనుమానాలను వ్యక్తం చేస్తూ.. ఈ వ్యవహారంపై చట్ట ప్రకారం ముందుకెళ్లాలని జనసేన పార్టీ నేతలకు సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

వైసీపీ ఎమ్మెల్సీపై ఆరోపణలు

ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ-2025లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నెల్లూరు వీఆర్సీ సెంటర్‌లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయించారనే ఆరోపణలు కూటమి శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని కూటమి నేతలు, పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ చేపట్టిన రాజకీయ ఉద్యమం.. ఇప్పుడు గోవింద నామాల పేరడీ వివాదంతో మరింత చర్చనీయాంశంగా మారింది.

Loading Tweet...

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు