రూ.2,078 కోట్లతో 2,310 కి.మీ. గ్రామీణ రహదారుల అభివృద్ధి.. 'అడవితల్లి బాట' పనులు వేగవంతం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు

మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టిన 'అడవితల్లి బాట' కార్యక్రమం పనులను వేగవంతం చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

7 ఆగస్టు, 2026 10:38 PM•ByRalin

Share this article

రూ.2,078 కోట్లతో 2,310 కి.మీ. గ్రామీణ రహదారుల అభివృద్ధి.. 'అడవితల్లి బాట' పనులు వేగవంతం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు

అమరావతి, ఆగస్టు 7 (జనవాణి): మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టిన 'అడవితల్లి బాట' కార్యక్రమం పనులను వేగవంతం చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

శుక్రవారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ 'అడవితల్లి బాట' పథకం అమలుపై సమీక్షించారు. తొలి దశలో రూ.1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు అధికారులు వివరించారు.

అనంతరం చేపట్టిన 'అడవితల్లి బాట–2.0' విస్తరణలో మొత్తం రూ.2,078 కోట్ల వ్యయంతో 2,310 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 905 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.

మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. అటవీ శాఖ అనుమతులు అవసరమైన చోట ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా పనులు సాధ్యంకాని ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో రహదారి పనులను నిరంతరంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.

గిరిజన ప్రాంతాల్లో డోలీ ద్వారా రోగులను తరలించే పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 'డోలీ రహిత ఆంధ్రప్రదేశ్‌' లక్ష్య సాధనలో ప్రతి అధికారి, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు