విజయవాడ, ఆగస్టు 11 (జనవాణి): ఏపీ ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసుపత్రికి చేరుకుని పిడుగు హరిప్రసాద్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం వైద్యులతో మాట్లాడి హరిప్రసాద్‌కు అందిస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంట ఆసుపత్రికి వెళ్లారు.





















