సీదిరి అప్పలరాజుకు కోర్టులో ఊరట.. హిట్ అండ్ రన్ కేసులో షరతులతో బెయిల్

శ్రీకాకుళం జిల్లాలో నమోదైన హిట్ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. సోంపేట కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

14 ఆగస్టు, 2026 6:31 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సీదిరి అప్పలరాజుకు కోర్టులో ఊరట.. హిట్ అండ్ రన్ కేసులో షరతులతో బెయిల్

శ్రీకాకుళం, ఆగస్టు 14 (జనవాణి):: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజుకు కోర్టులో ఊరట లభించింది. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హిట్ అండ్ రన్ కేసులో సోంపేట కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఇటీవల కాశీబుగ్గ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. ఈ ఘటనలో మాజీ మంత్రి కుమారుడి ప్రమేయం ఉందనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసును పక్కదోవ పట్టించేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. అప్పటి నుంచి సుమారు 23 రోజులుగా ఆయన జైలులో ఉన్నారు.

బెయిల్ కోసం సీదిరి అప్పలరాజు తరఫు న్యాయవాదులు సోంపేట కోర్టును ఆశ్రయించారు. గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురైనప్పటికీ, తాజాగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు.

▶CategoriesAndhra-pradesh, District, News and Crime
▶Follow us onFacebook, Twitter & Instagram.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు