తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం సర్వదర్శనం కోసం 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు.
సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు సుమారు 8 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్ర దర్శనం) ద్వారా వెళ్లే భక్తులకు 2 నుంచి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు 3 నుంచి 5 గంటల్లో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది.
ఆదివారం 90వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 28,345 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా రూ.4.99 కోట్ల ఆదాయం లభించింది. అదే సమయంలో 4.50 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.71 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.




















