జగన్‌ను చూడగానే విజయమ్మ భావోద్వేగం..ఇడుపులపాయలో వైఎస్ఆర్ 17వ వర్ధంతి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వేర్వేరుగా ఘాట్‌కు చేరుకుని తండ్రిని స్మరించుకున్నారు. జగన్‌ను చూసిన తల్లి విజయమ్మ భావోద్వేగానికి గురై ఆప్యాయంగా హత్తుకుని ముద్దుపెట్టుకున్నారు.

2 సెప్టెంబర్, 2026 5:15 PM•ByNarender Kumar Nangunoori

Share this article

జగన్‌ను చూడగానే విజయమ్మ భావోద్వేగం..ఇడుపులపాయలో వైఎస్ఆర్ 17వ వర్ధంతి

ఆంద్రప్రదేశ్, సెప్టెంబర్ 01 (జనవాణి): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వైఎస్ఆర్‌ను స్మరించుకున్నారు.

జగన్‌ను చూసి భావోద్వేగానికి గురైన విజయమ్మ

ప్రార్థనల అనంతరం తల్లి వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకునేందుకు జగన్ వెళ్లారు. కుమారుడిని చూడగానే విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. జగన్‌ను ఆప్యాయంగా హత్తుకుని ముద్దుపెట్టుకున్నారు. ఆయన సతీమణి వైఎస్ భారతిని కూడా దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది. అనంతరం వైఎస్ఆర్ ఘాట్ సమీపంలోని ఆయన విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ ప్రజాసేవ, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం వైసీపీ కార్యకర్తలను కలుసుకుని ఇడుపులపాయ హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరారు.

YS Jagan

తల్లితో కలిసి షర్మిల నివాళులు

జగన్ వెళ్లిన అనంతరం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం తల్లితో కలిసి తండ్రి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. వైఎస్ఆర్‌ను స్మరించుకున్నారు.

'మరణం లేని మహానేత' అంటూ షర్మిల

వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా షర్మిల ఎక్స్ వేదికగా ఆయనను స్మరించుకున్నారు. వైఎస్ఆర్ కోట్లాది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, 108-104 అంబులెన్స్ సేవలు, రైతులకు రుణమాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేశారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని షర్మిల పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు