ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?.. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్.. సినిమాకు రూ.20 కోట్లు రెమ్యూనరేషన్!

సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ చిన్నారి ఫొటో కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్‌లో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ ఈమె. గ్లామర్ కంటే అభినయంతోనే స్టార్‌డమ్ అందుకున్న ఆమె చిన్ననాటి ఫొటో ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

31 జులై, 2026 9:37 PM•ByLaharika

Share this article

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?.. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్.. సినిమాకు రూ.20 కోట్లు రెమ్యూనరేషన్!

సినీ పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుందో చెప్పడం చాలా కష్టం. కొంతమంది ఎన్నో సినిమాలు చేసినా ఆశించిన గుర్తింపు దక్కదు. మరికొందరికి మాత్రం తొలి సినిమాతోనే స్టార్‌డమ్ దక్కిపోతుంది. అలాంటి అరుదైన హీరోయిన్లలో ఒకరు ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి. పుట్టి పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో కాకపోయినా.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు.. స్టార్ హీరోయిన్ సాయి పల్లవి.

గ్లామర్ ప్రదర్శన లేకపోతే హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం కష్టమనే భావనను తన నటనతో తలకిందులు చేసింది సాయి పల్లవి. అందం కంటే అభినయమే గొప్పదని నిరూపిస్తూ స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సైతం ఆమెను 'లేడీ పవర్ స్టార్' అని కొనియాడడం ఆమెకు ఉన్న అభిమాన బలం ఎంతటిదో చెప్పడానికి చాలు.

సాయి పల్లవి సినిమా థియేటర్లలో విడుదలైతే అభిమానుల సందడి మరో స్థాయిలో ఉంటుంది. హీరో ఎవరన్నది కూడా పట్టించుకోకుండా, ఆమె కోసం మాత్రమే సినిమా చూసేందుకు వెళ్లే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. ఆ స్థాయి అభిమానాన్ని ఆమె తన నటనతో సంపాదించుకుంది. 2015లో విడుదలైన మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో హీరోయిన్‌గా సినీ రంగంలో అడుగుపెట్టిన సాయి పల్లవి, తొలి సినిమాతోనే దక్షిణాది అంతటా సంచలనంగా మారింది. ఆ సినిమా ఆమె కెరీర్‌కు బలమైన పునాది వేసింది.

ఆ తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'ఫిదా' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. భానుమతి పాత్రలో ఆమె చూపించిన సహజ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా సక్సెస్‌కు సాయి పల్లవి నటనే ప్రధాన బలమని అప్పట్లో సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భానుమతి పాత్రను ఆమె తప్ప మరెవరూ అంత సహజంగా చేయలేరని ప్రేక్షకులు భావించేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది.

'ఫిదా' తర్వాత 'ఎంసీఏ', 'పడి పడి లేచే మనసు', 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగరాయ్', 'తండేల్' వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంది. ఒక్కో సినిమాతో తన నటిగా ఉన్న స్థాయిని మరింత పెంచుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం హిందీలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక 'రామాయణ' సినిమాలో సీతమ్మ పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సాయి పల్లవి రూ.20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. అలాగే తమిళంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం.

సాయి పల్లవి వ్యక్తిత్వాన్ని తెలియజేసే ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ప్రముఖ కాస్మెటిక్ కంపెనీ తమ ఉత్పత్తులకు ప్రచారం చేయాలని కోరుతూ ఆమెకు దాదాపు రూ.2 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, అందాన్ని పెంచుతామని చెప్పే బ్యూటీ ప్రొడక్ట్స్‌ను తాను ప్రోత్సహించనని స్పష్టంగా చెప్పి ఆ భారీ ఆఫర్‌ను తిరస్కరించిందట. ఇప్పటివరకు కూడా అలాంటి ప్రకటనల్లో ఆమె కనిపించలేదు. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ను వదులుకుని తన నమ్మకాలకు కట్టుబడి ఉండడం వల్లే సాయి పల్లవి అభిమానుల దృష్టిలో మరింత ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు