అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్ అదేనా?.. అందుకే ఫ్యాన్స్ మీట్ పెట్టాడా?

ఒక్క కార్యక్రమంతోనే సోషల్ మీడియాలో భారీ చర్చకు తెరలేచింది. అభిమానులతో మరింత బలమైన అనుబంధం ఏర్పరుచుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్న స్టార్ హీరోపై ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది. దీని వెనుక మరో పెద్ద ప్లాన్ ఉందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

29 జులై, 2026 11:56 AM•ByLaharika

Share this article

అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్ అదేనా?.. అందుకే ఫ్యాన్స్ మీట్ పెట్టాడా?

సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం కొత్త విషయం కాదు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి చాలా మంది సినీ నటులు రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా తమిళ స్టార్ హీరో విజయ్ సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ తమిళనాడు CMగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. దీనికి కారణం ఇటీవల ఆయన అభిమానులతో మరింత దగ్గరగా ఉంటూ కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం.

జూలై 28న హైదరాబాద్‌లో జరిగిన ఫ్యాన్ మీట్‌లో అల్లు అర్జున్ తన అభిమాన సంఘం సభ్యులకు ఉచిత ప్రమాద బీమా కల్పించారు. అలాగే అభిమానులు సమాజంలో బాధ్యతగా ఉండాలని కొన్ని సూచనలు కూడా చేశారు. ఈ కార్యక్రమం తర్వాత సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. అభిమానులను మరింత బలంగా ఒక వేదికపైకి తీసుకురావడంలో ఇది భాగమా లేక భవిష్యత్తు కోసం మరో ఆలోచన ఉందా అని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై అల్లు అర్జున్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. గతంలో తనకు నచ్చిన వ్యక్తులకు మద్దతు ఇస్తానని ఆయన చెప్పిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఆయన చేసిన కొన్ని చర్యలు కూడా అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. దీంతో భవిష్యత్తులో రాజకీయాలపై ఆయన ఆసక్తి చూపుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరోవైపు మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి రాజకీయాల్లో ఒకానొక టైమ్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా అదే దారిలో నడుస్తారా లేక పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెడతారా అనేది ఇప్పటికైతే స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ ఊహాగానాలే. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. భవిష్యత్తులో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు