వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. హారర్-కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోందని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఎక్కడ చూసినా 'నవ్వులే నవ్వులు' అనే మాటే వినిపిస్తోంది. ఈ విజయానికి పూర్తిగా అర్హుడివి వరుణ్ తేజ్. నీ కష్టానికి, నిజాయతీకి తగిన ప్రతిఫలం దక్కింది అంటూ చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ, హీరోయిన్ రితికా నాయక్, కమెడియన్ సత్య, నిర్మాతలకు కూడా ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ అనంతపురం యువకుడిగా కనిపించారు. రాయలసీమ యాస, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్‌తో ఆయన చేసిన నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అనంతపురం జిల్లా పెనుగొండ నేపథ్యంలో సాగే ఈ కథలో, కియా కంపెనీలో పనిచేసే అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత చోటుచేసుకునే కొరియన్ సంస్కృతికి సంబంధించిన హాస్యభరిత పరిణామాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
తాను త్వరలోనే 'కొరియన్ కనకరాజు' చిత్రాన్ని చూస్తానని, ఈ సినిమా మరింత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమా ప్రచారానికి మరింత ఊతమిస్తోంది.
Loading Tweet...




















