‘ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు’.. చిరంజీవి పోస్ట్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి ‘ఇరుముడి’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రవితేజ నటన, శివ నిర్వాణ దర్శకత్వంతో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు. అయితే చివర్లో “ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

27 ఆగస్టు, 2026 7:04 PM•ByNarender Kumar Nangunoori

Share this article

‘ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు’.. చిరంజీవి పోస్ట్ వైరల్

శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసించగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా మూవీపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ఇరుముడి’ విజయం సాధించినందుకు రవితేజకు హృదయపూర్వక అభినందనలు తెలిపిన చిరంజీవి.. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎంతో ఆస్వాదించానని పేర్కొన్నారు. రవితేజ తన పాత్రను అద్భుతంగా పోషించారని, త్రినాథ్ పాత్రను పూర్తిగా తన భుజాలపై మోశారని ప్రశంసించారు. దర్శకుడు శివ నిర్వాణ సినిమాను ఎంతో డెప్త్, ఎమోషన్‌తో తెరకెక్కించారని చిరు కొనియాడారు. సినిమాలో నటించిన బేబీ నక్షత్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. మంచి విజయాన్ని అందుకున్నందుకు నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్‌లకు అభినందనలు తెలిపారు.

అయితే చిరంజీవి పోస్ట్‌లో చివరగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ప్రత్యేక చర్చకు కారణమయ్యాయి. “ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి” అంటూ చిరు పేర్కొన్నారు. సినిమాను ప్రశంసించడం వరకు సాధారణంగానే ఉన్నా.. చివర్లో పరిశ్రమ గురించి చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఏదైనా ప్రత్యేక ఉద్దేశం ఉందా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. “ఇండస్ట్రీ కొందరిది కాదు.. అందరిదీ” అనే మాటలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చిరంజీవి మాత్రం తన వ్యాఖ్యల వెనుక ప్రత్యేక కారణం ఉందని ఎక్కడా స్పష్టం చేయలేదు.

ఇక చిరంజీవి ప్రశంసలపై రవితేజ స్పందించారు. “అన్నయ్యా థాంక్యూ” అంటూ హార్ట్ ఎమోజీలతో కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు శివ నిర్వాణ కూడా చిరుకు ధన్యవాదాలు చెప్పారు. చిరంజీవి నుంచి వచ్చిన ప్రశంస తనకు ఎంతో విలువైనదని, అది నిజంగా ఎమోషనల్ మూమెంట్ అని పేర్కొన్నారు. ‘ఇరుముడి’లోని భావోద్వేగాన్ని చిరు ఫీల్ అవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఆయన ఆశీర్వాదాన్ని ఎప్పటికీ పదిలంగా ఉంచుకుంటానని తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు