రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు..!

పాన్ ఇండియా సినిమాల హవాతో స్టార్ హీరోయిన్ల పారితోషికం కూడా భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోయిన్ తెలుగు సినిమా కోసం రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా ఆమె నిలిచే అవకాశం ఉంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

3 ఆగస్టు, 2026 10:25 PM•ByLaharika

Share this article

రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు..!

సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ ఎక్కువ కాలం కొనసాగడం అంత సులువు కాదు. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే వరుస సినిమాలు చేస్తూ భారీ రెమ్యూనరేషన్ అందుకోవాలని చాలా మంది నటీమణులు ప్రయత్నిస్తుంటారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల పారితోషికం కొన్ని కోట్లకే పరిమితమైతే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా మార్కెట్ విస్తరించడంతో స్టార్ హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా ఊహించని స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తోంది.

బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా 'వారణాసి' లో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ.25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్‌గా ఆమె నిలిచే అవకాశం ఉంది.

ప్రియాంక చోప్రా సినీ ప్రయాణం కూడా ఎన్నో ఒడిదొడుకులతో సాగింది. 2002లో తమిళ స్టార్ విజయ్ నటించిన 'తమిజాన్' సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత 'ది హీరో' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుస విజయాలతో తక్కువ టైమ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ప్రియాంకకు 2006 నుంచి 2008 మధ్యకాలం మాత్రం అంతగా కలిసి రాలేదు. ఆ సమయంలో వరుసగా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఆమె కెరీర్ ముగిసిందనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే 'దోస్తానా' మూవీతో బలమైన కమ్‌బ్యాక్ ఇచ్చి తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకుంది.

గత కొన్నేళ్లుగా ప్రియాంక చోప్రా ప్రధానంగా హాలీవుడ్ ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టింది. 2019 తర్వాత బాలీవుడ్ సినిమాలకు దాదాపు దూరంగా ఉంటూ, వరుసగా అంతర్జాతీయ చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించింది. ఇప్పుడు మళ్లీ భారతీయ సినిమా, అందులోనూ తెలుగు చిత్రంలో నటించబోతుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే రాజమౌళి సినిమా, ప్రియాంక పారితోషికం గురించి వస్తున్న సమాచారం పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు